ws_Snapinsta.app_1080_334556766_655463119923908_5688151723382176990_n

KAVYA KALYAN RAM:  నెట్టింట్లో ఒకటే రచ్చ.. నటన సరే..  మరి అక్కడ రాణిస్తుందా?

YouSay Short News App

ws_Snapinsta.app_1080_307307683_457164889801433_7590773570724094202_n

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన ఓ హీరోయిన్‌ గురించే చర్చ. ఆమె ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చింది? అంటూ ఆరా తీస్తున్నారు. ఆమె ఎవరో కాదు కావ్య కల్యాణ్ రామ్.

ws_Snapinsta.app_1080_263686878_2766822076960649_5698805458402996078_n

బాలనటిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన కావ్య…మసూద, బలగం సినిమాలతో హీరోయిన్‌గా మారి గుర్తింపు తెచ్చుకుంది.

ws_Snapinsta.app_1080_252959255_1099959497497365_4883668322085958006_n

అచ్చమైన తెలుగమ్మాయి

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ తెలుగమ్మాయి నాగార్జున హీరోగా వచ్చిన స్నేహమంటే ఇదేరా చిత్రంతో బాలనటిగా ఎంట్రీ ఇచ్చింది.

బాలనటిగా భళా

గంగోత్రి, ఠాగూర్‌, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్‌, పాండురంగడు వంటి ఎన్నో చిత్రాల్లో చిన్నప్పట్నుంచే క్యారెక్టర్లు చేసింది కావ్య.

హీరోయిన్ ఛాన్స్‌

గతేడాది చివర్లో వచ్చిన హార్రర్ చిత్రం మసూదలో హీరోయిన్‌గా ఛాన్స్‌ కొట్టేసింది కావ్య కళ్యాణ్ రామ్. అందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

సూపర్ హిట్

కమేడియన్ వేణు దర్శకత్వం వహించిన బలగంలోనూ కావ్యకు కథానాయికగా మెరిసింది. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవటంతో కావ్య గురించి అందరూ వెతుకుతున్నారు.

ఫాలోయింగ్ ఎక్కువే

సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ముద్దుగుమ్మకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో 95.5k ఫాలోవర్స్‌ ఉన్నారు.

చదువులోనూ మేటి

సినిమాల్లో చేస్తూనే చదువుపై కూడా శ్రద్ధ పెట్టింది కావ్య. B.A, L.L.B పూర్తి చేసింది.

దశ మారుతుందా?

వరుసగా రెండు సినిమాలు హిట్ కొట్టడంతో ఆమెకు అవకాశాలు చాలా పెరగొచ్చు. అందులోనూ దిల్ రాజు వంటి బడా నిర్మాతతో పనిచేయడం కలిసి వస్తుందని ఆశిస్తోంది.

షూటింగ్ బిజీ

ఇప్పటికే మరో సినిమా షూటింగ్‌లోనూ బిజీగా గడుపుతోంది కావ్య. మత్తు వదలరా చిత్రంతో హీరోగా మారిన శ్రీ సింహా సరసన నటిస్తోంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran