74 ఏళ్ల ప్రజాస్వామ్య భారత దేశం సాధించిన కీలక విజయాలు

YouSay Short News App

నేడు భారతావని ప్రజాస్వామ్యంలోకి అడుగుపెట్టి 74 ఏళ్లు కావోస్తోంది. గణతంత్ర దేశంగా వర్ధిల్లుతున్న భారత్ ఈ తన ప్రజాస్వామ్య ప్రయాణంలో విద్యా, శాస్త్ర, సాంకేతిక, వ్యవసాయం, పారిశ్రామిక, వైద్యం, మౌలిక వసతుల కల్పన, రక్షణ, సేవలు, పరిపాలన, ఇలా అన్ని రంగాల్లో ఎనలేని అభివృద్ధి సాధించింది.

ప్రతీ రంగంలో ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ  అంతర్జాతీయ యవనికపై వెలుగులీనుతోంది.  ఈ క్రమంలో భారతదేశం సాధించిన విజయాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

దేశాభివృద్ధిలో పంచవర్ష ప్రణాళికలు కీలక పాత్ర పోషించాయి. తొలుత వ్యవసయాధారిత ఆర్థిక వ్యవస్థగా తన ప్రస్థానం ప్రారంభించిన భారత్.. సోషలిస్ట్‌ అభివృద్ధి నమూనాతో మిశ్రమ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది.

పంచవర్ష ప్రణాళికలు

ఐదేళ్ల పాటు నిర్దేశిత లక్ష్యాలను ఎంచుకుని వాటిని సాధించేందుకు ప్రణాళిక పూరిత వ్యయం ద్వారా అభివృద్ది కొనసాగించింది.

ఆధునిక భారత నిర్మాతగా నెహ్రూ మారారు. అత్యున్నత విద్యా సంస్థలు (IIT, IIM, NIT), రష్యా సహకారంతో నెలకొల్పిన పబ్లిక్‌ రంగ సంస్థలు, భారీ నీటి పారుదల ప్రాజెక్టులు నేటికి భారత ఆర్థిక వ్యవస్థకు ఊతంగా ఉన్నాయి.

విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలలో జరిపిన కృషి, అనుసరించిన అలీన విధానం నేటికి భారత దేశ విదేశాంగ విధానంగా ఉంది.

హరిత విప్లవం 1967లో ప్రవేశపెట్టబడింది. వ్యవసాయ భూమి, నీటి వనరులు దేశంలో సమృద్ధిగా ఉన్నప్పటికీ, భారత్‌  ఆహార కొరత  కలిగే ఉండేది.

హరిత విప్లవం

దేశ జనాభా అవసరాలకు ఆహార ధాన్యాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. దీనిని అరికట్టేందుకు ఇందిరా గాంధీ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టారు.

హరిత విప్లవం ద్వారా భారతదేశం ఆహారధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించింది.

నేడు, భారత్ పప్పుధాన్యాల అతిపెద్ద ఉత్పత్తిదారు. ప్రపంచవ్యాప్తంగా బియ్యం, గోధుమలు, చెరకు ఉత్పత్తిలో రెండవ అతిపెద్ద ఉత్పత్తిదారు.

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 1969 ఆగస్టు 15న స్థాపించబడింది.

అంతరిక్షం& శాస్త్ర సాంకేతికత

1975లో, మొదటి అంతరిక్ష ఉపగ్రహం "ఆర్యభట్ట"ను ప్రయోగించిన ఇస్రో ఆ తర్వాత చంద్రయాన్, మంగళయాన్ వంటి మిషన్ల విజయంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు.

2008లో, ఇస్రో PSLV-C9 ద్వారా ఒకే మిషన్‌లో 10 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపి ప్రపంచ రికార్డు సృష్టించింది.

2017లో PSLV-C37 ద్వారా 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో చరిత్ర సృష్టించింది

మంగళయాన్ ద్వారా మొదటి ప్రయత్నంలో అంగారక గ్రహాన్ని చేరుకున్న మొదటి దేశంగా భారత్ నిలిచింది.

బ్యాంకు సేవలను గ్రామాలకు విస్తరించేందుకు  1969 జులై 19న రూ.100 కోట్లకు పైగా మూలధన పెట్టుబడి ఉన్న 14 బ్యాంకులను జాతీయం చేశారు.

బ్యాంకుల జాతీయకరణ

బ్యాంకింగ్ రంగంలో PSLR వల్ల ప్రాధాన్య రంగాలకు( వ్యవసాయం, విద్యా, పేదలు, గృహనిర్మాణం) రుణ లభ్యత లభించింది.

బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టత వల్లే ఆర్థికమాంద్యం వంటి ఒడుదొడుకులను భారత్ సమర్థంగా ఎదుర్కొంటోంది.

స్వాతంత్య్రానంతరం తన చరిత్ర పునరావృతం చేసుకోకుండా భారత్ తన రక్షణ వ్యస్థను బలోపేతం చేసింది.

శక్తివంతమైన రక్షణ వ్యవస్థ

1954లో, భారతదేశం అటామిక్ ఎనర్జీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించి, అలా చేసిన మొదటి దేశంగా అవతరించింది.

1974లో, భారతదేశం తన మొదటి అణు పరీక్ష "స్మైలింగ్ బుద్ధ"ను నిర్వహించి, అణు సామర్థ్యం కలిగిన ఐదు దేశాల(USA, రష్యా, ఫ్రాన్స్, చైనా, బ్రిటన్) సరసన చేరింది.

నేడు, భారత్ ప్రపంచంలో 2వ అతిపెద్ద సైనిక బలగంతో పాటు స్వచ్ఛంద సైన్యాన్ని కలిగి ఉంది. సొంతంగా వార్ షిప్‌లు, జలాంతర్గాముల(వగీర్) ను నిర్మించే స్థాయికి ఎదిగింది.

వాజ్‌పెయీ 2001లో అమెరికా మోడల్‌లో జాతీయ రహదారుల అభివృద్ధికి కృషి చేశారు. 5846 కిమీ పోడవున ఢిల్లీ- చెన్నై, ముంబై- కోల్‌కతా మెట్రో నగరాలను అనుసంధానించారు. ఈ ప్రాజెక్ట్ 13 రాష్ట్రాలను అనుసంధానిస్తుంది. ఈ కారిడార్ల పొడవును గణనీయమైన పారిశ్రామిక వృద్ధి జరిగింది.

స్వర్ణ చతుర్బుజి (జాతీయ రహదారులు)

భారతదేశంలో ఆర్థిక సరళీకరణ 24 జూలై 1991 నుంచి ప్రారంభమైంది.1947లో స్వతంత్ర ప్రాప్తి అనంతరం భారత్ సోషలిస్టు విధానాలనే అవలంబించింది.

సరళీకృత ఆర్థిక వ్యవస్థ

1991 లో భారత్ ఎదుర్కొన్న బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ (అంతర్జాతీయ చెల్లింపుల) సంక్షోభాన్ని నివారించేందుకు భారత ఆర్థిక వ్యవస్థను ప్రపంచ మార్కెట్‌కు అనుసంధానం చేయాల్సి వచ్చింది.

IMF సూచించిన అన్ని విధానాలలో చాలా వాటిని అవలంబించకున్నా పీవీ నరసింహారావు సరళీకృత విధానాలను అవలంబించటం మొదలు పెట్టారు.

విదేశీ పెట్టుబడులు పెరగడంతో భారత్‌లో పారిశ్రామిక వృద్ధి గణనీయంగా పెరిగింది.

2007నాటికి దేశ జీడీపీ 9% నమోదు కావటంతో భారతదేశం సరళీకరణ అత్యుత్తమ ఫలితాలు అందుకుంది.

1994 వరకు ప్రపంచంలోని పోలియో కేసుల్లో 60% భారతదేశంలోనే నమోదయ్యేవి.రెండు దశాబ్దాల కృషి అనంతరం.. 2014లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి "పోలియో రహిత సర్టిఫికేట్" పొందింది.

పోలియో నివారణ

సరళీకృత ఆర్థిక విధానాల ఊతంతో 2000 నాటికి భారతీయ ఐటీ పాదుకుని శరవేగంగా విస్తరించింది.

ఐటీ విప్లవం

తక్కువ ధరలో సేవలు అందుబాటులో ఉండటం, భారతీయ ఐటీ నిపుణుల సాంకేతిక ప్రతిభ భారతీయ ఐటీ విజయ పథంలో దూసుకెళ్లింది.

హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, పూణే, నోయిడా వంటి నగరాలు దేశంలో ఐటీ కేంద్రాలుగా మారాయి.

అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ప్రధాన ఐటీ సేవల కేంద్రంగా భారత్ ఎదిగింది. అక్కడ పనిచేసే భారత ఐటీ నిపుణుల ద్వారా  భారత ఆర్థిక వ్యవస్థలోకి విదేశీ మారక ద్రవ్యం ప్రవహించింది.

సత్యనాదెళ్ల, సుందర్ పిచాయ్ వంటి వారు మైక్రోసాప్ట్, గూగుల్ వంటి బహుళ జాతి సంస్థలకు దిశానిర్దేశం చేస్తున్నారు.

నాస్కామ్ రిపోర్ట్ ప్రకారం FY22లో, భారతీయ IT రంగం $227 బిలియన్ల ఆదాయాన్ని ఆర్జించింది.

2005లో తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఏడాదిలో కనీసం 100 రోజుల పని హామీ కల్పించింది.

గ్రామీణ ఉపాధి హామీ పథకం

ఉపాధి  కల్పించడం ద్వారా గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంపొందించింది. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలను తగ్గించేందుకు తోడ్పడింది.

వ్యక్తిగత గుర్తింపు సంఖ్య ఆధార్ రాకతో చాలా మేలు జరిగింది. బ్యాంకు- ఆధార్ సీడింగ్ ద్వారా లబ్ధిదారులకు సంక్షేమ నిధులు నేరుగా చేరాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందాలంటే ఆధార్ ఒక మంత్రంగా మారిపోయింది.

ఆధార్ లింకింగ్

పెద్దనోట్ల రద్దు ఫలితాలు ఎలా ఉన్నా దేశంలో డిజిటల్ లావాదేవీలు ఊపందుకున్నాయి. యూపీఐ పేమెంట్స్ గేట్‌వేతో బ్యాంకు లావాదేవీలు సులభతరం అయ్యాయి.

డిజిటల్ ఇండియా

జీరో బ్యాంక్ అకౌంట్స్‌ వల్ల బ్యాకింగ్ సేవలు గ్రామీణ ములాలకు విస్తరించాయి.చిల్లర వ్యాపారులు సైతం యూపీఐ పేమెంట్‌ ద్వారా కార్యకలాపాలు కొనసాగించటం మొదలు పెట్టారు.

ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ డిజిటల్  ఎకానమీగా మారే పరిణామంలో ఉంది.

దేశంలో కరోనా అనేక మంది ప్రాణాలు బలిగొన్నా. అంతిమంగా మహమ్మారిపై విజయం సాధించగలిగాం.

కరోనాపై విజయం

సంక్షోభంలోనూ భారత పరిశ్రమలు అవకాశాలు సృష్టించుకున్నాయి. కరోనా పీపీఈ కిట్లు, ఔషధాల పంపిణీలో ప్రపంచ దేశాలకు భారత్ ఆపన్న హస్తం అందించింది.

చురుకైన ట్రాక్-ట్రేస్-టెస్ట్ విధానం, దేశీయంగా వ్యాక్సిన్ల తయారీ, విస్తృత వ్యాక్సినేషన్ వల్ల కోవిడ్‌ను నియంత్రించగలిగాం.