కేరాఫ్ కంచెరపాలెం దర్శకుడు వెంకటేశ్ మహా ఒక్కసారిగా ఫేమస్ అయ్యాడు. మళ్లీ ఏదైనా సినిమా తీశాడేమో అనుకుంటే పొరపాటే. సంచలన వ్యాఖ్యలతో ట్రెండింగ్‌లోకి వచ్చాడు ఈ దర్శకుడు.
రికార్డులు తిరగరాసిన కేజీఎఫ్ చిత్రంపై విమర్శలు చేయడం. అదొక సినిమానా అనే తరహాలో మాట్లాడటం. యశ్ ఫ్యాన్స్‌కు కోపం రావటం చకచకా జరిగిపోయాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోండి.
ఓ ఇంటర్వ్యూలో భాగంగా తాము ఎలాంటి సినిమాలు చేయగలమో చెప్పాడు వెంకటేశ్ మహా. అభ్యుదయ భావాలను పక్కన పెడితే గొప్ప చిత్రాలు తీస్తామన్నారు.
అభ్యుదయ దర్శకులం
ప్రస్తుతం తాము అలాంటి సినిమాలు తెరకెక్కించట్లేదన్నారు దర్శకుడు. విలువలతో కూడిన చిత్రాలు తీస్తున్నా..డీగ్రేడ్ చేస్తున్నారని, ఓటీటీ సినిమాలంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాపై విమర్శలా?
ఈ క్రమంలో కేజీఎఫ్‌పై పరోక్షంగా విమర్శలు చేశాడు వెంకటేశ్. కొడుకు గొప్పవాడు కావాలని తల్లి చెప్పటం, ఆమెకు బంగారం తెస్తానని మాటిచ్చి చివర్లో వాటిని ఒకచోట పడేసే సినిమాను ఎగబడి చూస్తున్నామని సంచలన ఆరోపణలు చేేశాడు.
కేజీఎఫ్ సినిమానేనా?
వెంకటేశ్ మహా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. దీంతో ఒక్కసారిగా అతడు ట్విటర్ ట్రెండింగ్‌లోకి వచ్చాడు. కొందరు మద్దతిస్తే.. మరికొందరు చివాట్లు పెడుతున్నారు.
రచ్చ రచ్చ
దర్శకుడు వెంకటేశ్ మహాపై హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. యశ్ ఫ్యాన్స్ క్షమాపణలకు డిమాండ్ చేయడం కొసమెరుపు.
హ్యాష్ ట్యాగ్స్
సోషల్ మీడియాలో ట్రోలింగ్‌రై వెంకటేశ్ మహా స్పందించాడు. కేజీఎఫ్‌పై తన కామెంట్లను వెనక్కి తీసుకోవడం లేదన్నారు. మాట్లాడిన తీరులో తప్పు ఉన్నందున క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియో రిలీజ్ చేశారు.