ఇక డయాలసిస్ మిషిన్ లేకుండానే  కిడ్నీ చికిత్స.. హైదరాబాద్ వైద్యుడి  అద్భుత సృష్టి

YouSay Short News App

డయాలసిస్‌ రోగులకు హైదరాబాద్‌ వైద్యుడు  కేఎస్‌. నాయక్‌ శుభవార్త చెప్పారు

డయాలసిస్ మిషన్‌ అవసరం లేకుండా చికిత్స అందించే కొత్త మార్గాన్ని ఆయన కనుగొన్నారు

అల్లో-హీమోడయాలసిస్ పిలిచే సరికొత్త విధానాన్ని ఆవిష్కరించారు.

కేఎస్ నాయక్ హైదరాబాద్ విరించి ఆస్పత్రుల్లో నెఫ్రాలజిస్ట్‌గా పనిచేస్తున్నారు

ఈ విధానంలో డయాలసిస్‌ మిషన్‌కు బదులు మానవ కిడ్నీని ఉపయోగిస్తారు.

అల్లో- హీమో డయాలసిస్?

బాధితుడి శరీరంలోని చెడు రక్తం, వ్యర్థ ద్రవాలను చిన్న మిషన్(డయలైజర్) ద్వారా మరో వ్యక్తి కిడ్నీకి బదిలి చేసి వాటిని శుభ్రపరుస్తారు. అలా శుభ్రపడిన రక్తాన్ని తిరిగి బాధితుడికి ఎక్కిస్తారు.

వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఈ విధంగా చేసి రోగి రక్తంలోని వ్యర్థాలను శుభ్రపరుస్తారు

తొలుత జంతువుల్లో దీనిని ప్రయోగించగా సత్ఫలితాలు వచ్చినట్లు డా.కేఎస్‌ నాయక్‌ తెలిపారు

సత్ఫలితాలు

త్వరలో మానవులపై క్లీనికల్ ప్రయోగాలు చేసేందుకు అనుమతి తీసుకోనున్నట్లు  వెల్లడించారు

ఈ విధానం అందుబాటులోకి వస్తే పెద్దఎత్తున డయాలసిస్ కోసం పెట్టే ఖర్చు తగ్గనుంది

ఖర్చు తగ్గింపు

ప్రస్తుతం వాడుతున్న హీమోడయాలసిస్ (HD) యంత్రానికి రూ.12- రూ. 15 లక్షల వరకు ఖర్చవుతుంది

ముఖ్యంగా డయాలసిస్ యంత్రాలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధానం ఎక్కువగా ఉపయోగపడుతుంది.

గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగం

పాము కాటు, అతిసారం కారణంగా తాత్కాలిక కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఇది ప్రత్యేకంగా సహాయం చేస్తుంది. ఈ టెక్నిక్ ద్వారా వారిని రక్షించవచ్చు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.