కింగ్ కోహ్లీ ఈజ్ బ్యాక్. వన్డేల్లో అత్యుత్తమ ఫామ్‌ని కొనసాగిస్తూ.. కెరీర్‌లో మరో సెంచరీ బాదేశాడు. శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో సెంచరీ నమోదు చేసి పలు రికార్డులు బద్దలు కొట్టాడు.
వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. భారత్‌లో కోహ్లీ 21 సెంచరీలు చేశాడు.
రారాజు విరాట్
వన్డేల్లో సొంతగడ్డపై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ తెందుల్కర్(20) రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. మాస్టర్ బ్లాస్టర్ 166 ఇన్నింగ్సుల్లో 20శతకాలు చేస్తే.. కింగ్ కోహ్లీ కేవలం 100 ఇన్నింగ్సుల్లోనే ఫీట్ సాధించడం విశేషం.
వన్డేల్లో ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగానూ విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. శ్రీలంకపై 10 సెంచరీలు చేశాడు.
ప్రత్యర్థి జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును కూడా కోహ్లీ తిరగరాశాడు. సచిన్ తెందుల్కర్‌తో ఆస్ట్రేలియాపై 9 సెంచరీలు చేయగా.. కోహ్లీ శ్రీలంకపై 10 శతకాలు బాదాడు.
వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన ఐదో బ్యాట్స్‌మన్ కోహ్లీనే. 12,754 పరుగులతో శ్రీలంక ప్లేయర్ జయవర్దనెను దాటేశాడు.
జయవర్దనె 448 ఇన్నింగ్సుల్లో 12,650 రన్స్ చేయగా.. కోహ్లీ 268 ఇన్నింగ్సుల్లో 12,754 పరుగులు చేశాడు. విరాట్ కన్నా జయసూర్య(13,430), పాంటింగ్(13,704), సంగక్కర(14,234), సచిన్(18,426) ముందున్నారు.
వన్డేల్లో కోహ్లీకి ఇది 46వ సెంచరీ. ఓవరాల్‌గా తన కెరీర్‌లో కోహ్లీ 74 సెంచరీలు నమోదు చేశాడు. సచిన్ తెందుల్కర్(100) తర్వాత రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
శ్రీలంకపై విరాట్‌కు మెరుగైన ట్రాక్ రికార్డు ఉంది. ద్వైపాక్షిక సిరీసుల్లో కోహ్లీ అదరగొడుతున్నాడు. ఏకంగా 10 సెంచరీలు నమోదు చేయడం విశేషం.
లంక జట్టుపై 300కు పైగా స్కోర్లు నమోదు చేయడం ఇండియాకు ఇది 23వ సారి కావడం గమనార్హం. ఆస్ట్రేలియా(28) ( ఇండియాపై) తర్వాత ఒక జట్టుపై అత్యధిక సార్లు 300కు పైగా పరుగులు చేయడం భారత్‌కే సాధ్యమైంది.
విరాట్ సెంచరీ చేసిన మరుక్షణమే సోషల్ మీడియాను అభిమానులు షేక్ చేస్తున్నారు. కింగ్, సెంచూరీ, విరాట్ కోహ్లీ, GOAT హ్యాష్‌ట్యాగ్స్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లోకి వెళ్లాయి.
తన కెరీర్లో విరాట్ కోహ్లీ మరిన్ని సెంచరీలు సాధించి.. రికార్డులు బద్దలు కొట్టాలని ఆశిద్దాం.