Kissing Device: వర్చువల్‌గా  మీ లవర్‌కి లిప్‌లాక్ ఇవ్వొచ్చు.. ఇలా ట్రై చేయండి

YouSay Short News App

ఎన్నో మాటల కన్నా ఒక్క ‘ముద్దు’తో ప్రేమని బయటపెట్టొచ్చు. ఎంత గాఢమైన ముద్దు ఇస్తే అంత ఎక్కువ అనుభూతి పొందుతారు. కానీ, ప్రేయసి/ప్రియుడు దూరంగా ఉంటే ఇది సాధ్యపడదు కదా.

చాలామంది ప్రేమికులు/ భాగస్వాములు వివిధ కారణాల వల్ల వేర్వేరు చోట్ల పనిచేయాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఫోన్లలో మాట్లాడుకోవడం తప్ప సన్నిహితంగా మెలగడం కుదరదు. ఇకపై  ఈ లోటు ఉండబోదు.

చైనాకు చెందిన జియాంగ్ జాంగ్లీ ‘కిస్సింగ్ డివైజ్’ని కనిపెట్టాడు. ఈ డివైజ్ ద్వారా ఎక్కడ ఉన్నా మీ భాగస్వామికి ముద్దును ఇవ్వొచ్చు. పబ్లిక్‌గానే నిర్మొహమాటంగా లిప్ లాక్ చేయొచ్చు.

పబ్లిక్‌గా లిప్‌లాక్..

ఈ డివైజ్ పనిచేయాలంటే ఇరువురి ఫోన్లలో డివైజ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం రెండు డివైజ్‌లను పెయిర్ చేయాలి. అప్పుడే వీడియో కాల్‌ని స్టార్ట్ చేయగలిగేందుకు వీలుంటుంది.

పనిచేయాలంటే..?

ఫోన్‌కి ఈ డివైజ్‌ని కనెక్ట్ చేయాలి. అనంతరం ఈ డివైజ్‌కి అమర్చిన పెదాలపై కిస్ చేస్తే.. ఈ ముద్దులోని గాఢత(Pressure)ను స్వీకరించి అనలైజ్ చేస్తుంది. అనంతరం రిసీవర్ వద్ద ఉన్న కిస్సింగ్ డివైజ్‌కి ఈ సమాచారాన్ని చేరవేస్తుంది. దాదాపు అదే గాఢతతో సిలికాన్ లిప్స్ రిసీవర్‌కి ముద్దును ఇస్తాయి.

ఇలా వర్క్ అవుతుంది..

ముద్దు ఇచ్చే సమయంలో పెదాలలోని వేడి, పెదాల కదలికలను కూడా ఈ డివైజ్ మానిటర్ చేసి సమాచారాన్ని రిసీవర్‌కు పంపిస్తుంది. అదే హీట్‌ని ఇక్కడ సిలికాన్ లిప్స్ జనరేట్ చేస్తాయి. ఫలితంగా భాగస్వామే ముద్దు ఇచ్చిన ఫీలింగ్ కలుగుతుంది.

సేమ్ ఫీలింగ్ కలిగేలా..

‘కిస్సింగ్ డివైజ్’ చైనా సోషల్ మీడియా వేదికల్లో ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రతి ప్లాట్‌ఫారంలోనూ ఈ డివైజ్ గురించే చర్చ మొదలైంది.

ఒక్కసారిగా వైరల్..

లవర్స్, పార్ట్‌నర్స్‌కి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది. తమ మధ్య ఎడబాటుని తగ్గించుకొని ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు ఈ డివైజ్ కొద్ది మేర సహకరిస్తుందని చెబుతున్నారు.

వీరికి బెనెఫిట్..

యూనివర్సిటీలో చదివేటప్పుడు నా గర్ల్‌ఫ్రెండ్‌తో రోజూ ఫోన్లో మాట్లాడేవాడిని. ఈ ఎడబాటుని ఎలా దూరం చేయాలని ఆలోచించగా ఈ ఐడియా తట్టింది. వెంటనే ఈ డివైజ్‌‌ని తయారు చేశా- జియాంగ్ జాంగ్లీ, ‘కిస్సింగ్ డివైజ్’ రూపకర్త.

అలా మొదలైంది..

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.