నేడు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్న కేఎల్ రాహుల్- అతియ..  పెళ్లి విశేషాలు ఇవే..

YouSay Short News App

టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ పెళ్లి బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. బాలీవుడు నటుడు సనీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టితో వేదమంత్రాల మధ్య రాహుల్ ఏడు అడుగులు వేయనున్నాడు.

మహారాష్ట్ర- ఖండాలలోని సునిల్ శెట్టికి చెందిన ఖండాల ఫామ్ హౌస్‌లో వివాహం జరగనుంది. ఇందుకోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన వివాహ వేదికను అద్భతంగా నిర్మించారు. ఖండాల ఫామ్ హౌస్ పచ్చని అడవుల మధ్య ప్రకృతిరమణీయతో కూడి ఉంటుంది.

పెళ్లి ఎక్కడ?

నూతన వధూవరులు అతియా, కేఎల్ రాహుల్ బంధుమిత్రుల సమక్షంలో సాయంత్రం 4 గంటలకు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు.

పెళ్లి ఎప్పుడు?

విహహం అనంతరం సాయంత్రం 6:30 గంటలకు బంధుమిత్రులతో ఫొటో సెషన్ నిర్వహించనున్నారు.

కెఎల్ రాహుల్- అతియా వివాహానికి 100  మందిని ఆహ్వానించారు. ఇరుకుటుంబాలకు అత్యంత సన్నిహితులు మాత్రమే వివాహానికి హాజరవుతున్నారు.

అతిథులు ఎవరు?

సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, అక్షయ్ కుమార్, టైగర్ ష్రాప్, జాకీ ష్రాప్ అనుష్క శర్మ వంటి సెలబ్రెటీలు పెళ్లికి అతిథులుగా వస్తున్నారు.

ఈ పెళ్లికి హాజరయ్యే అతిథులు సెల్‌ఫొన్ తీసుకెళ్లరాదనే నిబంధన విధించారు. గతంలో విక్కీ- కత్రినా వివాహానికి కూడా ఇలాంటి నిబంధనే విధించారు.

నో ఫొన్ పాలసీ

పెళ్లి అనంతరం ముంబైలో కేఎల్ రాహుల్ గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశాడు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 3 వేల మందికి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు.

ముంబైలో గ్రాండ్ రిసెప్షన్

పెళ్లికి హాజరయ్యే అతిథుల కోసం అదిరే వంటకాలను సిద్ధం చేశారు. ఇందుకోసం సౌత్ ఇండియన్ ట్రెడిషనల్ డిషెస్‌తో పాటు అన్నిరకాల ఇండియన్ ఫుడ్‌ను ప్రత్యేకంగా తయారు చేశారు. అతిథులకు సాంప్రదాయ బద్దంగా అరిటాకుల్లో విందు భోజనం వడ్డించనున్నారు.

పెళ్లిలో అదిరే వంటకాలు

రాహుల్- అతియ జంట 2019నుంచి నుంచి పీకల్లోతూ ప్రేమలో ఉన్న వీరి ప్రేమ గురించి తెలిసిందే మాత్రం కొద్దికాలం క్రితమే.

కేఎల్ రాహుల్- అతియా ప్రేమాయణం

అతియ- రాహుల్‌కు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆతర్వాత ఆ పరిచయం ప్రేమగా మారి డేటింగ్‌కు దారితీసింది.

పలు టీమిండియా సిరీస్‌లకు అతియా హాజరు కావడం, రాహుల్‌ను ఎంకరేజ్ చేసిన ఫొటోలు ఇన్‌స్టాలో పోస్టు చేసిన సందర్భాలు వీరిద్దరి మధ్య ప్రేమ ఉందనే వార్తలకు బలం చేకూర్చాయి.

ఇలా బయటపడింది

గత వన్డే వరల్డ్ కప్‌ మ్యాచ్‌ల్లోనూ అతియా పెవిలియన్‌లో కూర్చోని రాహుల్‌ను ఎంకరేజ్ చేసింది. 2021 వరకు వీరి ప్రేమ గురించి ఎవరికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

డిజైనర్ విక్రమ్ ఫడ్నీస్ ఇన్‌స్టాలో అతియాను టీజ్ చేసిన సందర్భంలో వీరిద్దరి మధ్య ఉన్న అసలు రిలేషన్ షిప్ బయటపడింది. హ్యాండ్సమ్ క్రికెటర్‌తో ప్రేమాయణం అంటూ అతియాను అప్పట్లో టీజ్ చేశాడు.

2021 నవంబర్‌లో కేఎల్ రాహుల్- అతియాలు తమ మధ్య ఉన్న బంధాన్ని అధికారికంగా తెలుపుతూ ఇన్‌స్టాలో పోస్టు పెట్టారు.

అధికారిక ప్రకటన

2022 మార్చిలో కేఎల్ రాహుల్ తన ప్రేమ గురించి అతియ తండ్రి సునీల్ శెట్టికి తన కుటుంబానికి తెలియజేశాడు

పెద్దల ఆశీర్వాదం లభించడంతో ఈ యువ జంట పెళ్లి బంధంతో నేడు(జనవరి 23న)  ఒక్కటి కానుంది.