వరల్డ్స్ టాప్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్ లిస్ట్
YouSay Short News App
టాప్ 30లో KTRకు చోటు
ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో అత్యంత ప్రభావశీలుర జాబితాను విడుదల చేశారు. ఇందులో టాప్ 30లో మంత్రి KTR కూడా స్థానం దక్కించుకున్నారు. టాప్-10 జాబితా ఎలా ఉందంటే..
జాబితాలో టాప్‌లో గ్రెటా థన్‌బర్గ్ నిలిచారు. స్వీడన్‌కు చెందిన గ్రెటా థన్‌బర్గ్ పర్యావరణ పరిరక్షణపై పోరాటం చేస్తోంది.
1. గ్రెటా థన్‌బర్గ్
రెండో స్థానంలో ఉగాండాకు చెందిన వెనిసా నకాటే కూడా పర్యావరణ న్యాయం కోసం పోరాడుతోంది. తన దేశంలో అసాధారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై పోరాటంతో ఆమె వెలుగులోకి వచ్చింది.
2. వెనిసా నకాటే
మూడో స్థానంలో ఈక్వెడార్‌కు చెందిన హెలీనా గ్వాలింగా పర్యావరణ పరిరక్షణతో పాటు మానవ హక్కుల కోసం పోరాడుతున్నారు. 20 ఏళ్ల ఈ యువతి సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల హక్కులపై ప్రచారం నిర్వహిస్తోంది.
3. హెలీనా గ్వాలింగా
జొనానిన్ బొనియాడి ఈ జాబితాలో 5వ స్థానంలో ఉన్నారు. ఈ ఇరానియన్-బ్రిటిష్ నటి..యాక్టివిస్ట్‌గానూ పాపులర్ అయ్యారు. మానవతా వాదంపై తన సోషల్ మీడియా ద్వారా ఆమె ప్రచారం చేస్తుంటారు.
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి KTR, జాబితాలో 12వ స్థానంలో నిలిచారు. నిరంతం సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉంటూ కేటీఆర్ ప్రజలకు సేవలందిస్తుంటారు. ఎంతోమందికి తన పనులతో స్ఫూర్తినిస్తుంటారు
KTR
తెలంగాణ ఐటీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ కూడా జాబితాలో 22 స్థానంలో నిలిచింది. కేటీఆర్ సలహాలు, సూచనలతో ఈ ఖాతా ద్వారా కూడా ప్రజలకు సేవలు అందిస్తుంటారు.