సమంత చెప్పిన జీవిత పాఠాలు

You Say Short News App

జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కున్న అందాల నటి సమంత. తెరపై తన అందం,నటనతో ప్రేక్షకులకు కనువిందు చేసే సమంత తన నిజ జీవితంలో చెప్పిన మాటలు ఎందరికో జీవిత పాఠాలు.. అవేంటో చూద్దాం

కోపం, ఉద్రేకం మనిషి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. నాకు కోపం వచ్చినప్పుడల్లా జిమ్‌కు వెళ్లి, పిచ్చిపిచ్చిగా కసరత్తులు చేస్తా. నా కోపం తగ్గిపోతుంది.

కోపం వద్దు

చేసే పనిని ప్రేమించలేకుంటే దాంతో ఎంత సంపాదించినా సంతోషం, ప్రయోజనం ఉండవు

పనిని ప్రేమించు

మన తప్పుల్ని మనం తెలుసుకోవాలి. మనకు మనమే విమర్శకులుగా ఉన్నపుడు కెరియర్‌లో రాణిస్తాం

ఆత్మవిమర్శ చేసుకో

కొన్నిసార్లు కాలం మనకు అనుకూలించదు. అప్పుడు బాధపడుతూ కూర్చోను. ఆలోచించడం మానేసి నిద్రపోతా

కాలం ఎప్పటికీ కలిసి రాదు

ఈ భూమి మీదకు నువ్వొచ్చింది నీకోసం. ఇతరులను మెప్పించడానికి, సంతోషపెట్టడానికి కాదు. నీకు నచ్చినట్టు నువ్వుండు

నీకు నువ్వే

మనకు ఉన్నవాటిని మనం ఇష్టపడితే, మనకు అవసరమైనవి అవే వస్తాయి.

ఉన్నదాంట్లో సంతృప్తి పొందు

బయట అందమైన వాళ్లు ఎంతోమంది ఉన్నారు. ఇంతకాలం నేను ఇక్కడ ఉన్నానంటే కారణం అందం మాత్రమే కాదు. టాలెంట్‌ ఉండాల్సిందే

ప్రతిభ పెంచుకో

నలుగురి కోసం బతకడం, నలుగురిలో నవ్వులపాలు కావడం ఈ రెండింటికీ చిన్న గీత ఉంటుంది. అందులోనే నేను నడవాలనుకుంటా

నవ్వులపాలు కావొద్దు

నా ముగింపు సమయం వచ్చినపుడు నాకు తెలిసిపోతుంది. అప్పుడు గౌరవంగా వెళ్లిపోతా. అంతేగానీ నన్ను తన్ని తరిమేసేదాకా వెయిట్‌ చెయ్యను

పట్టుకుని వేలాడకు

నాకు పని చేసుకునే తల్లులంటే అమితమైన గౌరవం.

తల్లిని గౌరవించు