Lithium Reserves J&K:  భారత్‌కు అతిపెద్ద జాక్‌పాట్.. ఇక అత్యంత చౌకగా ఎలక్ట్రిక్ వాహనాలు

YouSay Short News App

దేశంలో తొలిసారి లిథియం నిల్వలను జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. జమ్మూకశ్మీర్‌- రేసి జిల్లాలోని సలాల్ హైమానా ప్రాంతంలో ఏకంగా 5.9 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను గుర్తించినట్లు ప్రకటించింది.

నాన్ ఫెర్రస్ మెటల్ లిథియంను ఎలక్ట్రిక్ వాహనాల్లో బ్యాటరీల్లో వాడుతారు. ఇది బ్యాటరీల తయారీకి అత్యంత కీలకమైన మూలకం.

లిథియం ప్రాముఖ్యం

లిథియం అయాన్ బ్యాటరీ అనేది మళ్ళీ మళ్ళీ రీచార్జ్ చేసుకోగల బ్యాటరీ. ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.

రక్షణ రంగం, సైన్యం అవసరాల్లోనూ, ఏరోస్పేస్ రంగాల్లోనూ వీటి అవసరం రోజు రోజుకు పెరిగిపోతోంది

అత్యంత కీలకం

ప్రపంచంలోని లిథియం-అయాన్ బ్యాటరీల తయారీ మార్కెట్‌లో చైనా ఆధిపత్యం చెలాయిస్తోంది. 2021 ఏడాది ఓ నివేదిక ప్రకారం ప్రపంచ మార్కెట్‌లోకి ప్రవేశించిన మొత్తం లిథియం-అయాన్ బ్యాటరీలలో చైనా దాదాపు 79 శాతం ఉత్పత్తి చేసింది.

చైనా గుత్తాధిపత్యం

8 మిలియన్ టన్నులతో చిలీ ప్రపంచంలోనే అతిపెద్ద లిథియం నిల్వలను కలిగి ఉంది. ఆస్ట్రేలియా 2.7 మిలియన్ టన్నులు, అర్జెంటీనా 2 మిలియన్ టన్నులు, చైనా 1 మిలియన్ టన్నుల లిథియం నిక్షేపాలను కలిగి ఉన్నాయి.

రెండో స్థానంలో భారత్?

తాజాగా బయటపడిన 5.9 మిలియన్ టన్నుల లిథియం నిల్వలతో భారత్ రెండో స్థానానికి చేరినట్లైంది.

దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించాలని ప్రభుత్వాలు భావిస్తున్న నేపథ్యంలో లిథియం నిల్వలు బయటపడటం నిజంగా శుభవార్తే

భారత్‌కు ఏం లాభం?

భవిష్యత్‌ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే కానున్న తరుణంలో  పెద్ద మొత్తంలో లిథియం నిల్వలు బయటపడటం దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీలకు పెద్ద ఊరట

ఇప్పటి వరకు దేశీయ కంపెనీలు ముడి సరుకు లిథియం కోసం చైనా ఇతర దేశాలపై ఆధారపడాల్సి వస్తోంది.

చైనాకు చెక్

దేశంలో ఒక్కసారి లిథియం మైనింగ్ స్టార్ట్‌ అయితే లిథియం అయాన్ బ్యాటరీలు అత్యంత చౌకగా లభిస్తాయి.

తద్వారా లిథియం బ్యాటరీల తయారీలో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్న చైనాకు భారత్ చెక్‌ పెట్టొచ్చు

లిథియం అయాన్ బ్యాటరీలు చౌకగా లభించడం వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు మరింత తగ్గే అవకాశం ఉంటుంది.

చౌకగా ఎలక్ట్రిక్ వాహనాలు

రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల భారం నుంచి సామాన్యులకు ఉపశమనం లభించనుంది.పెట్రోల్, డీజిల్ వాహనాలు తగ్గి వాయు కాలుష్యం అదుపులోకి రానుంది.

Loom Solar     – Energy Storage Reliance         – EV( ఎలక్ట్రిక్ వాహనాలు) Mahindra       – EV Hyundai         – EV Ola                 – EV Amarraja (Amaron)  – EV Exide              – EV Panasonic        – Telecom.

దేశంలో ఇప్పటివరకు లిథియం అయాన్ బ్యాటరీలు తయారు చేస్తున్న కంపెనీలు

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.