ఫోన్‌ పోయిందా?

YouSay Short News App

ఇలా చేయకుంటే మీ ఖాతా ఖాళీ!

అజాగ్రత్తతోనో ఆదమరుపుతోనో, చోరుడి చేతివాటంతోనో ఒక వేళ మీ ఫోన్‌ పోగొట్టుకుంటే తక్షణమే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే మీ అకౌంట్లలోని డబ్బు కూడా మాయం కావొచ్చు.

ఫోన్‌ పోగొట్టుకున్నవారు కొత్త ఫోన్‌ కొని నంబర్‌ యాక్టివేట్‌ చేసుకునేలోపే సైబర్‌ నేరగాళ్లు ఖాతా ఖాళీ చేస్తున్నారు. ఫోన్‌లో ఉన్న సిమ్‌ కార్డును కూడా సైబర్‌ నేరగాళ్లు వాడుకుంటున్నారు

మీ ఫోన్ పోయిన వెంటనే మరో ఫోన్‌ నుంచి మీది ఆండ్రాయిడ్‌ అయితే ‘గూగుల్‌ ఫైండ్‌ మై డివైజ్‌’ యాపిల్‌ అయితే ‘ఫైండ్‌ మై ఐఫోన్‌’కు లాగిన్‌ అయి లొకేషన్‌ ట్రాక్‌ చేసే ప్రయత్నం చేయండి.

ఫస్ట్ చేయాల్సిన పని ఇదే

ఫైండ్‌ మై డివైజ్‌/ ఫైండ్‌ మై ఐఫోన్‌లోనే ఫోన్‌ను లాక్‌ చేసే ఆప్షన్‌ ఉంటుంది. వెంటనే మీ ఫోన్ లాక్‌ చేయండి. అక్కడే Erase All Data ఆప్షన్‌ ద్వారా మీ డేటాను కూడా రిమోట్‌గా డిలీట్‌ చేయండి.

డేటా డిలీట్‌ చేయండి

మీ పోయిన వెంటనే దగ్గర్లోనే పోలీస్‌ స్టేషన్‌ లేదా ‘హాక్‌ ఐ’ వంటి యాప్స్‌ ద్వారా పోలీసులకు రిపోర్ట్‌ చేయండి. ఒకవేళ మీ ఫోన్‌ చోరీకి గురై ఉంటే..ఇన్సూరెన్స్‌ క్లెయిమ్ చేసుకునేందుకు ఇది పనికొస్తుంది.

ఫోన్‌ పోయినంట్లు రిపోర్ట్ చేయండి

ఫోన్‌లో బ్యాంకు ఖాతా నంబరు, యూపీఐ పిన్‌, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్ పాస్‌వర్డ్‌ వంటిని కాంటాక్ట్‌ లిస్ట్‌లో గానీ, డాక్యుమెంట్‌లో గానీ సేవ్‌ చేయడం చాలామందికి అలవాటు. ఇది అస్సలు చేయొద్దు.

ఈ పని అస్సలు చేయొద్దు

కొందరు పేమెంట్‌ యాప్‌లలో 1234, 0000 వంటి నంబర్లు లేదా పుట్టినతేదీ, వాహన నంబరు లాంటివి పెట్టుకుంటారు. ఇది కూడా అస్సలు మంచిది కాదు. కాస్త కఠినమైన నంబర్‌ను పాస్‌వర్డ్స్‌గా పెట్టుకోవాలి.

సులభమైన పాస్‌వర్డ్‌లు వద్దు

ఫోన్‌ పోయిన వెంటనే తక్షణమే సిమ్‌ బ్లాక్‌ చేయడం మరవొద్దు. లేదంటే మీ సిమ్‌కార్డు ఉపయోగించి సైబర్‌ నేరగాళ్లుకు ఆ నంబర్‌కు లింక్‌ అయి ఉన్న బ్యాంక్‌ ఖాతాలోని నగదు ఖాళీ చేస్తారు.

సిమ్‌ బ్లాక్‌ చేయడం మరవొద్దు

గూగుల్‌పే-18004190157

ఈ నంబర్ల ద్వారా పేమెంట్‌ యాప్స్‌ బ్లాక్‌ చేయండి

ఫోన్‌పే-   08068727374

పేటీఎం- 01204456456

ఒకవేళ మీ ఫోన్‌ పోయాక డబ్బు పోతే వీలయినంత త్వరగా బ్యాంక్‌కు ఫిర్యాదు చేయండి. ట్రాన్సాక్షన్‌ను హోల్డ్‌లో పెట్టి మీ డబ్బు కాపాడే అవకాశముంటుంది.

డబ్బు పోయిన వెంటనే