‘లవ్‌ టుడేరివ్యూ

YouSay Short News App

యూత్ తప్పక చూడాల్సిన సినిమానా?

కేవలం రూ.5 కోట్ల బడ్జెట్‌లో తమిళంలో నవంబర్‌ 4న విడుదలై రూ.70 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతున్న సినిమా ‘లవ్ టుడే’. ఇవాళ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ థియేటర్లలో రిలీజ్‌ అయింది.

దర్శకుడు       : ప్రదీప్‌ రంగనాథన్ నటీ నటులు     : ప్రదీప్‌ రంగనాథన్‌, ఇవానా,                  సత్యరాజ్‌, యోగిబాబు తదితరులు సంగీతం        : యువన్ శంకర్‌ రాజా సిినిమాటోగ్రఫీ   : దినేశ్ పురుషోత్తమన్‌

ప్రదీప్( ప్రదీప్ రంగనాథన్‌), నిఖిత( ఇవానా) ప్రేమికులు. తమ ప్రేమను పెళ్లి అనే బంధంగా మార్చుకోవాలని నిఖిత వాళ్ల నాన్న వేణుశాస్త్రి( సత్యరాజ్‌) దగ్గరకు వెళ్తారు.

కథేంటి?

ఆయన మీ ఇద్దరు ఒకరి ఫోన్లు ఒకరు మార్చుకుని ఒక రోజు  ఒక చిన్న కండిషన్ పెట్టి అది ఓకే అయితే తనకు పెళ్లికి ఏ అభ్యంతరమూ లేదని చెబుతాడు. దీనికి ఇద్దరూ ఒప్పుకుంటారు. ఆ ఒక్కరోజు వారి ప్రేమ, జీవితాలు ఎలా మలుపులు తిరిగాయనే దాని చుట్టే కథ తిరుగుతుంది

ఒక న్యూ ఏజ్‌ కాన్సెప్ట్‌తో ప్రదీప్‌ రంగరాజన్‌ రాసుకున్న కథ, కథనం అద్భుతం. తొలి అర్ధభాగం మంచి కామెడీతో అద్భుతంగా నడిపించాడు. సెకండాఫ్‌లో ఎమోషన్స్‌ చాలా చక్కగా పండాయి

ఎలా ఉంది

వాట్సాప్ లాంటి సోషల్‌ మీడియా యాప్స్‌, ఇతర సాంకేతికతలను యువత వాడుతున్న తీరు వాటివల్ల కలిగే అనర్థాలను ప్రదీప్‌ రంగరాజన్‌ చక్కగా చూపించాడు

ప్రదీప్‌ రంగరాజన్‌ దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ అద్భుతంగా చేశాడు. ఎమోషనల్‌, హిలేరియస్ సీన్స్‌లో పరిణతితో నటించాడు

ఇక ఇప్పటికే సోషల్‌ మీడియాలో మన దగ్గర కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న ఇవానా, హీరోయిన్‌గా అదరగొట్టింది. తన క్యూట్‌ ఫేస్‌ చాలా మందికి నచ్చుతుంది

సత్యరాజ్‌ తన పాత్రకు ప్రాణం పోశాడు. సీనియర్‌ నటి రాధిక చిన్న రోల్‌ అయినా తన పరిధి మేరకు ఆకట్టుకుంది. యోగిబాబు పాత్ర కాస్త సిల్లీగా ఉన్నా బాగుంది

సినిమాలో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది డబ్బింగ్‌. తెలుగులో చాలా మంచి డబ్బింగ్ రాశారు. తమిళ డబ్బింగ్‌ సినిమా చూస్తున్నామని భావన కలగకుండా బాగా మేనేజ్‌ చేశారు.

యువన్ శంకర్ రాజా సంగీతం బాగుంది. BGM కూడా సినిమాకు చక్కగా సరిపోయేలా ఉంది. కెమెరా వర్క్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త బెటర్‌గా ఉండాల్సింది

కొత్త కాన్సెప్ట్‌, కథ, కథనం నటీ, నటులు డబ్బింగ్‌

బలాలు

బలహీనతలు

తొలి 20 నిమిషాల సినిమా

రేటింగ్‌: 3.25

కొత్త కథ, నేటి యువతకు తప్పకుండా నచ్చే సినిమా. ఈ వీకెండ్‌లో ప్రెండ్స్‌తో ప్లాన్‌ చేసుకోండి. తప్పక ఎంజాయ్ చేస్తారు