LTTE Chief Prabhakaran:  శ్రీలంకకు నిద్ర లేకుండా చేసిన ప్రభాకరన్ బతికే ఉన్నాడా.. ఎవరీ తిరుగుబాటు నేత?

YouSay Short News App

ఎల్‌టీటీఈ అధినేత వెలుపుళ్లై ప్రభాకరన్ బతికే ఉన్నాడంటూ తమిళ రాజకీయ నేత నెడుమారన్ వెల్లడించి సంచలన ప్రకటన చేశారు. దీంతో ప్రభాకరన్ ఉనిఖిపై ఒక్కసారిగా చర్చ ఊపందుకుంది.

నేటి తరానికి ప్రభాకరన్ గురించి తెలియకపోవచ్చు. అయితే, తాజాగా వైరల్ అవుతుండటంతో నెట్టింట ప్రభాకరన్ ఎవరంటూ శోధనలు మొదలయ్యాయి.

భారత దివంగత ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితులలో ‘ప్రభాకరన్’ ఒకరు.

ప్రధాన నిందితుడు

శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక దేశం కోసం సాయుధ పోరాటంతో దాదాపు మూడున్నర దశాబ్దాల పాటు శ్రీలంకకు నిద్ర లేకుండా చేశారు.

టార్గెట్ శ్రీలంక

శ్రీలంకలో తమిళులపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ‘ప్రభాకరన్’ పోరాడారు. తమిళుల స్వేచ్ఛ కోసమే సాయుధ పంథాను ఎంచుకున్నట్లు ప్రభాకరన్ పలుమార్లు చెప్పారు.

వివక్షపై పోరాటం

1954 నవంబర్ 26న శ్రీలంకలోని జాఫ్నా ద్వీపంలో ప్రభాకరన్ జన్మించారు. ఆయన తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. నలుగురు సంతానంలో ప్రభాకరన్ అందరికన్నా చిన్నవాడు.

జననం

తమిళులపై వివక్షను తట్టుకోలేక చిన్నప్పుడే చదువు మానేసి రాజకీయ సమావేశాలకు వెళ్లేవారు ప్రభాకరన్. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని క్రమంగా తిరుగుబాటు నేతగా ఎదిగారు.

చదువుకి దూరం

1972లోనే తమిళ్ న్యూటైగర్స్(TNT) పేరిట సంస్థను స్థాపించారు. కాలక్రమేణా తమిళ్ న్యూటైగర్స్‌ని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం(LTTE)గా మార్చారు.

LTTE ఏర్పాటు

LTTEని శక్తివంతమైన తిరుగుబాటు సంస్థగా తీర్చిదిద్దారు. టైగర్స్, సీ టైగర్స్, ఎయిర్ టైగర్స్ అంటూ త్రివిధ దళాలను నడిపించారు. బ్లాక్ టైగర్స్ పేరిట ఆత్మాహుతి దళాలు కూడా ఉండేవి.ఇలా ప్రపంచంలో త్రివిధ దళాలు కలిగిన ఏకైక తీవ్రవాద సంస్థగా LTTE గుర్తింపు పొందింది.

ప్రత్యేక దళాలు

బ్లాక్ టైగర్స్‌లో ఎక్కువగా మహిళలే ఉండేవారు. శత్రువుకి చిక్కితే వీరమరణం పొందేలా మెడలో సైనేడ్ గుళికలను వేసుకునేవారు. ‘ఫ్యామిలీమ్యాన్’ సిరీస్‌లో సమంత పాత్ర చిత్రీకరణకు ఎల్‌టీటీఈ దళ సభ్యుల క్యారెక్టరే ఆధారం.

మహిళలే ఎక్కువ

ప్రభాకరన్ చేసిన తొలి రాజకీయ హత్య.. తాను పుట్టిపెరిగిన జాఫ్నా మేయర్‌ని కాల్చి చంపారు. దీంతో హంతకుడిగా ప్రభాకరన్‌పై ముద్ర పడింది

తొలి హత్య

రాజీవ్‌గాంధీతో సహా దేశాధినేతలను ప్రభాకరన్ మట్టుపెట్టారు. నాటి శ్రీలంక అధ్యక్షుడు ప్రేమదాస, మంత్రులు రంజన్ విజయరత్నే, లక్ష్మణ్ కదిర్‌గమర్‌లను ప్రభాకరన్ హత్య చేశాడు.

ఎవ్వరినీ వదల్లేదు

తమతో బలవంతంగా శాంతి ఒప్పందం చేయించడం, ఎల్‌టీటీఈపై దాడులకు భారత సైన్యాన్ని పంపించడమే రాజీవ్‌గాంధీ హత్యకు కారణమని తేలింది.

అందుకే రాజీవ్ హత్య

1996లో కొలొంబోలో ఓ సెంట్రల్ బ్యాంకు పేల్చివేయడంతో అక్కడి కోర్టులో ప్రభాకరన్‌కు 200ఏళ్ల పాటు శిక్ష పడింది.

200ఏళ్లు శిక్ష

ఎల్‌టీటీఈ సంస్థతో ప్రభాకరన్ సాయుధ పోరాటాన్ని సాగించారు. దాదాపు 30ఏళ్లకు పైగా సాగించిన పోరాటంలో 70వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

30ఏళ్లకు పైగా పోరాటం

2009లో మే 18న శ్రీలంక ఆర్మీ ప్రభాకరన్‌ని మట్టుపెట్టినట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని ఫొటోలను కూడా విడుదల చేసింది. కానీ, వాటిపై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

2009లో హతం

కాంగ్రెస్ మాజీ నేత నెడుమారన్ తాజా వ్యాఖ్యలతో మరోసారి ప్రభాకరన్ గురించి చర్చ మొదలైంది. ఆయన బతికే ఉన్నట్లు కుటుంబ సభ్యులే ధ్రువీకరించారని నెడుమారన్ చెప్పారు

బతికే ఉన్నారా?..

తమిళులు ప్రభాకరన్‌ని ముద్దుగా ‘పెద్ద పులి’ అని పిలుచుకుంటుంటారు.

పెద్ద పులి

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.