మన దగ్గరా ఈ జాగ్రత్తలు తీసుకోండి

తమిళనాడును వణికిస్తున్న ‘మద్రాస్‌ ఐ’(MADRAS EYE)

చలికాలంలో వచ్చే సాధారణ అంటువ్యాధి మద్రాస్‌ ఐ  ( కళ్ల కలక). సీజనల్‌గా వచ్చే వ్యాధి అయినా…ప్రస్తుతం  తమిళనాడులో కాస్త కలవర పెడుతోంది. ఇప్పటివరకు 1.5 లక్షల కేసులు వెలుగుచూశాయి. హైదరాబాద్‌లోనూ అడపాదడపా బయటపడుతున్నాయి. కళ్లకలక సోకితే ఏం అవుతుంది. ఎలా జాగ్రత్త పడాలో తెలుసుకుందాం.

కళ్ల కలక సాధారణంగా కంటికి వచ్చే వ్యాధి. దీనివల్ల కనురెప్పలు దాదాపు మూసుకుపోతాయి. దీన్ని తెలంగాణ లాంటి ప్రాంతాల్లో ‘కళ్లు రావటం’ అని కూడా అంటారు.

కళ్ల కలక అంటే

బ్యాక్టీరియా లేదా వైరస్ కారణంగా కళ్ల కలక వస్తుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాప్తి చెందుతుంది. కంటి నుంచి వచ్చే స్రావాల ద్వారా విస్తరిస్తుంది. దీనివల్ల ఎలర్జీ సహా మరికొన్ని వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

ఎలా వస్తుంది

కనులు రెండు ఎర్రగా మారిపోతాయి. కనురెప్పలు  దాదాపు మూసుకుపోతాయి. ఎక్కువగా ఊసిళ్లు వస్తుంటాయి. కంటి నుంచి నీరు కారడంతో పాటు దురదపెడుతూ ఉంటుంది.

లక్షణాలు

కళ్లకలకకు ఎలాంటి చికిత్స అవసరం లేదు. దాదాపు ఒకటి నుంచి రెండు వారాల్లోగా దానికదే నయం అవుతుంది. ఒకవేళ బ్యాక్టీరియా ద్వారా వచ్చి ఉంటే యాంటీ బయాటిక్స్ వాడాలి.

చికిత్స

ఇది సాధారణమైన వ్యాధి కావచ్చు కానీ, ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. రోజుకు కనీసం 4000 నుంచి 5000 కేసులు వెలుగు చూస్తున్నాయి. దాదాపు 1,50,000 మంది కళ్లకలక బారిన పడ్డారు. కనీసం 80 నుంచి 100 మందికి చికిత్స అందించాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇప్పుడెందుకు?

తమిళనాడులో వాతావరణ పరిస్థితుల మార్పు కారణంగానే మద్రాస్‌ ఐ వ్యాప్తి చెందింది. కొద్దిరోజులుగా వర్షాలు పడటంతో పాటు కనీస ఉష్ణోగ్రతలు 22 డిగ్రీల కన్నా తక్కువకు పడిపోవటంతో ఎక్కువ మందికి వ్యాధి సోకుతుంది.

వేగంగా వ్యాప్తి

హైదరాబాద్ లోనూ అక్కడక్కడ కళ్ల కలక కేసులు వెలుగు చూస్తున్నాయి. ఎక్కడైనా వ్యాధి సోకుతున్న వారిలో చిన్నారులే అధికంగా ఉన్నారు.

హైదరాబాద్‌లోనూ కేసులు

కనీస జాగ్రత్తలు తీసుకోవటం వల్ల వ్యాధి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయవచ్చు. ఇతరుల వస్తువులు, కర్చీఫ్, టవల్స్, ఆహారం వంటివి తీసుకోవద్దు. కళ్లకలక వచ్చిన వారికి కాస్త దూరంగా ఉండాలి. కళ్లు అతిగా నలపడం వల్ల మరో కంటికి వేగంగా వ్యాప్తి చెందుతుంది.

జాగ్రత్తలు

చిన్నారుల్లో ఎక్కువగా వస్తుండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తల్లిదండ్రులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ వచ్చినా తీవ్ర ఇబ్బందేమీ ఉండదు కానీ, రాకుండా జాగ్రత్త పడటం మంచిది.

అప్రమత్తత