Maha Shivarathri: శివరాత్రికి చేసుకునే ఈ 7 స్వీట్స్ తెలుసా?

YouSay Short News App

మహా శివరాత్రికి కొన్ని ప్రత్యేకమైన పిండి వంటలు, తీపి పదార్థాలు ఇంట్లో తయారు చేస్తుంటాం. ప్రాంతాన్ని బట్టి ఈ వంటకాలు మారుతుంటాయి. శివరాత్రికి జాగారాలు ఉండేవారు ఈ ప్రత్యేక వంటకాలను శివుడికి నైవేధ్యంగా సమర్పిస్తుంటారు.

శివరాత్రికి చేసే వంటకాలకు పెద్దగా కష్టపడనక్కర్లేదు. తేలికగా పూర్తయ్యే వంటకాలు ఎన్నో ఉన్నాయి. కాస్త దృష్టి సారిస్తే త్వరగానే వీటిని వండి వార్చొచ్చు. అవేంటో తెలుసుకుందాం.

సత్తి ముద్ద

సత్తి ముద్దలనే మొక్కజన్న లడ్లు అని కూడా పిలుస్తారు. ఎండిన మక్కలను పిండి చేసి, బెల్లంతో కలిపి వీటిని తయారు చేస్తారు.

రవ్వ లడ్డు

శివరాత్రికి రవ్వ లడ్డూలను ప్రత్యేకించి చేస్తారు. చక్కెర, బెల్లం పానకంతో కలిపి ఈ లడ్డూలను చేసుకోవచ్చు.

ప్యాలాలు/బొరుగు ముద్దలు

ప్యాలాల ద్వారా వీటిని తయారు చేస్తారు. బెల్లం పానకంతో చేసిన ముద్దలను తింటుంటే ఆ మజానే వేరు. కొన్నిచోట్ల శివరాత్రికి వీటిని తయారు చేస్తుంటారు.

పోలెలు/ బొబ్బట్లు/ భక్ష్యాలు

ఉగాదికి ప్రతి ఇంటా కనిపించే బొబ్బట్లను కొందరు శివరాత్రి రోజున కూడా చేసుకుంటారు. పప్పు పాకం మధ్యలో పెట్టి చపాతీగా చేస్తారు.

పాయసం

కొందరు శివుడికి నైవేద్యంగా పాయసాన్ని సమర్పిస్తుంటారు. అభిరుచులకు అనుగుణంగా వివిధ రకాలైన పాయసాలను తెలుగు రాష్ట్రాల్లో చేసుకుంటుంటారు.

గుగ్గిళ్లు

శనగలతో ఈ గుగ్గిళ్లను చేస్తుంటారు. చాలామంది వీటిని జాగరణ గుగ్గిళ్లు అని కూడా పిలుస్తారు. తాలింపు వేశాక గుగ్గిళ్లను తింటే ఇక మళ్ళీ మళ్ళీ ఇవే కావాలంటారు.

బూరెలు

ఉడకబెట్టిన శనగపప్పు, బెల్లం మిశ్రమాన్ని కలిపి ఉండలుగా చేస్తుంటారు. అనంతరం వీటిని నూనెలో వేయిస్తారు. దీని రుచి అమోఘం

రట్నపూరి గడ్డ/ చిలగడదుంప

శివరాత్రి రోజున చాలామంది చిలగడదుంపను ఉడకబెట్టుకుని తింటుంటారు. కొంతమంది చిలగడదుంపతో వివిధ రకాలైన వంటకాలు చేస్తుంటారు.