ws_Snapinsta.app_1080_314901328_140766731791657_8447805865773957632_n

YouSay Short News App

పాన్ ఇండియా సినిమాలో హీరోయిన్‌గా మంగ్లీ... ఆరు రాష్ట్రాలతో కథ లింక్

ws_Snapinsta.app_1080_320797754_206036568484485_2541632597763784580_n

సింగర్ మంగ్లీ పాన్‌ ఇండియా చిత్రంలో నటించబోతోంది. కన్నడ డైరెక్టర్ చక్రవర్తి చంద్రచూడ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పాదరాయ’తో మంగ్లీ హీరోయిన్‌గా మెరవనుంది.

ws_Snapinsta.app_1080_313846695_1190374508501270_3613673347389048194_n

తెలుగుతో పాటు శాండల్‌వుడ్‌లోనూ అనేక సినిమాల్లో పాటలు పాడిన మంగ్లి కన్నడిగుల అభిమానాన్ని కూడా ఆమె పొందింది.

ws_Snapinsta.app_1080_313821473_5717743235007960_1031070640697545357_n

2013-14లో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా నిర్మిస్తున్నట్లు మూవీ మేకర్స్ తెలిపారు. ఆరు రాష్ట్రాలతో కథ లింక్ అయి ఉందని పేర్కొన్నారు.

సినిమా కథ

ఈ సినిమాలో  హీరోగా  కన్నడ డైరెక్టర్, నటుడు  నాగశేఖర్‌ నటిస్తున్నారు. ఆయన కన్నడంలో సంజూ వెడ్స్ గీత, మైనా వంటి హిట్‌ సినిమాలు తీశారు.

ప్రస్తుతం పాదరాయ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా  జరుగుతున్నాయని  డైరెక్టర్ చంద్రచూడ్ తెలిపారు

సినిమా స్టేటస్

త్వరలోనే సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుందని ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోందని చెప్పుకొచ్చారు.

సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై ఆర్‌ చంద్రు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పాదరాయ సినిమాకు అజనీశ్‌ లోకనాథ్ సంగీతాన్ని అందిస్తున్నారు

ఇప్పటికే సింగర్‌గా తన ప్రతిభ చాటిన మంగ్లీ.. హీరోయిన్‌గా కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని YouSay ఫ్యామిలీ కోరుకోంటోంది.