Manoj Weds Mounika:  పెళ్లిలో ఎమోషనలైన మంచు మనోజ్.. అక్కా నువ్వు లేకుంటే…

YouSay Short News App

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌, భూమ మౌనిక రెడ్డి జంట పెళ్లి బంధంతో ఒక్కటైంది.

హైదరాబాద్ ఫిలిం నగర్‌లోని మంచు లక్ష్మీ నివాసంలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు వీరి వివాహం ఘనంగా జరిగింది.

మంచు- భూమ కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో మౌనిక మెడలో మనోజ్ మూడు ముళ్లు వేశాడు

మనోజ్-మౌనికల వివాహ వేడుకను ఇరు బంధువర్గాలు చాలా రహస్యంగా ఉంచారు. పెళ్లి అంత సిద్ధమై, ముహుర్తం ఫిక్స్‌ అయ్యేవరకు  ఈ విషయం ఎక్కడా బయటకు రాలేదు

పెళ్లి తంతులో భాగంగా ఒక్కొ ఫొటో షేర్‌ చేస్తూ అందర్నీ ఆశ్యర్చపరిచారు

అన్నీతానైన లక్ష్మి

మనోజ్‌ అంటే మంచు లక్ష్మికి ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. అందుకే మంచు మనోజ్‌ పెళ్లి బాధ్యతను స్వయంగా పర్యవేక్షించింది

ఈ పెళ్లిని తన ఇంట్లోనే జరిపించింది. పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంది

మెహందీ, హల్దికి సంబంధించిన ఫొటోలను మంచు లక్ష్మి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది

హల్ది, మెహందీ నుంచి మనోజ్‌ను పెళ్లి కొడుకుగా చేసే వరకు అన్నింటిని మంచు లక్ష్మి దగ్గరుండి చూసుకుంది

మనోజ్ ఎమోషనల్

మంచు లక్ష్మీ గురించి మనోజ్‌ ఎమోషనల్  పోస్ట్ షేర్ చేశాడు

‘అక్కా.. ఏ జన్మ పుణ్యమో నాది. లవ్‌ యు అక్క. థ్యాంక్స్‌ ఫర్‌ ఎవ్రీథింగ్‌. లవ్‌ యూ అక్క’ అంటూ పోస్ట్‌ చేశాడు

మనోజ్ పెళ్లి వేడుకలో మంచు ఫ్యామిలీ మొత్తం సందడి చేసింది. మోహన్‌ బాబు, లక్షి ప్రసన్న, విష్ణు, ఆయన భార్య విరానిక అంతా దగ్గరుంచి మనోజ్- మౌనికల పెళ్లి జరిపించారు.

అథితులు వీళ్లే

పెళ్లి వేడుకకు వైఎస్ విజయమ్మ,  టి జి వెంకటేష్,  కోదండరామిరెడ్డి, పరుచూరి గోపాలకృష్ణ, నిక్కీ గర్లని, దేవినేని అవినాష్ ముఖ్యఅతిథిలుగా పెళ్లికి హాజరయ్యారు.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.