Manushi Chillar: ‘ఆపరేషన్‌ వాలెంటైన్‌’ భామ గురించి ఈ సీకెట్స్‌ తెలుసా?

YouSay Short News App

అందాల పోటీల్లో విజేతలుగా నిలిచి హీరోయిన్‌గా మారిన వారిలో నటి ‘మానుషి చిల్లర్‌’ ఒకరు.

ఇందులో రాడార్‌ ఆఫీసర్‌గా కనిపించిన మానుషి.. తన నటనతో ఆడియన్స్‌ను ముగ్దుల్ని చేసింది.

ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపింది.

హరియాణాకు చెందిన మానుషి.. డాక్టర్‌ చదివింది. ఆమె పేరెంట్స్‌ కూడా వైద్యులే కావడం విశేషం.

మోడలింగ్‌పై ఆసక్తితో మానుషి ఆ దిశగా ప్రయాణించింది. అందుకు శరీరాన్ని అనువుగా మార్చుకుంది.

2017లో ‘ఫెమినా మిస్‌ ఇండియా’, ‘మిస్‌ వరల్డ్‌’ కిరీటాలు గెలుచుకొని అందరి దృష్టిలో పడింది.

ప్రపంచ సుందరిగా నిలిచిన ఆరో భారతీయురాలిగా మానుషి చిల్లర్‌ రికార్డుల కెక్కింది.

తర్వాత బాలీవుడ్‌పై ఫోకస్‌ పెట్టిన మానుషి.. ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’తో తెరంగేట్రం చేసింది.

అక్షయ్‌ కుమార్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2022లో విడుదలైంది.

మానుషి నటించిన రెండో చిత్రం: ‘ది గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’ (హిందీ). విక్కీ కౌశల్‌ హీరో.

ప్రస్తుతం ‘బడే మియా ఛోటే మియా' అనే సినిమాలో నటిస్తూ మానుషి బిజీగా ఉంటోంది.

ఇందులో బాలీవుడ్‌ స్టార్స్‌ అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ హీరోలుగా నటిస్తున్నారు.

జాన్‌ అబ్రహం నటించే 'టెహ్రాన్‌' అనే చిత్రంలోనూ మానుషి చిల్లర్ భాగం కానుంది.

మానుషి వ్యక్తిగత విషయాలకు వస్తే ఆమెకు స్కూబా డైవింగ్‌, బంగీ జంప్ అంటే ఇష్టమట.

కూచిపూడిలో మానుషికి ప్రావీణ్యం ఉంది. గతంలో ఆమె శిక్షణ కూడా తీసుకున్నారు.

ఈ బ్యూటీకి రోస్టెడ్‌ చికెన్, గ్రిల్డ్‌ వెజిటేబుల్స్‌తో చేసిన సూప్‌ అంటే చాలా ఇష్టమట.

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ నటన కూడా తనకు బాగా నచ్చుతుందని మానుషి చెప్పింది.

మానుషి ఎత్తు విషయానికి వస్తే ఆమె చాలా పొడగరి. ఆమె హైట్ 5 అంగుళాల 9 సెంటీమీటర్లు.

ఈ భామకు పర్యాటనలంటే చాలం ఇష్టం. మాల్దీవ్స్‌ తన ఫేవరేట్‌ ప్లేస్‌ అని మానుషి తెలిపింది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran