REVIEW: ”మట్టి కుస్తీ”   ఓ కుటుంబ కథా చిత్రం ?

YouSay Short News App

మట్టి కుస్తీ.పేరు వింటేనే కచ్చితంగా క్రీడా నేపథ్యం సాగే చిత్రం అనిపిస్తుంది. అలా అనుకుంటే పెద్ద పొరపాటే. ఇది పక్కా కుటుంబ కథా చిత్రం.

ఎఫ్‌ఐఆర్‌, అరణ్య చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన విష్ణు విశాల్ మరోసారి ఆకట్టుకున్నాడా ? అమ్ము, పొన్నియన్‌ సెల్వన్‌తో హిట్ కొట్టిన ఐశ్వర్య లక్షి మళ్లీ విజయం సాధించిందా ? హీరో రవితేజ నిర్మాతగా సక్సెస్‌ అయ్యాడో? లేదో ? చూసేద్దాం.

అమ్మ,నాన్నలు చనిపోవటంతో మామయ్య దగ్గర పెరిగి బలాదూర్‌గా తిరుగుతూ కాబోయే భార్య ఇలాగే ఉండాలని కండిషన్లు పెట్టుకొని ఉండే హీరో. ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకున్నా కుస్తీ పోటీలంటే ప్రాణమని భావించే హీరోయిన్. ఇద్దరికీ అబద్ధాల కారణంగా జరిగే వివాహం? నిజాలు తెలిశాక ఏమయ్యిందనేది పూర్తి కథ.

కథ

సినిమా పాత్రలను పరిచయం చేయటానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఇందుకోసం అల్లుకునే సన్నివేశాలు ప్రేక్షకులను ఇబ్బంది పెడతాయి. సాగదీత సీన్స్‌తో బోర్ కొడుతుంది.

ప్రేక్షకులకు పరీక్ష

దాదాపు 20 నిమిషాల తర్వాత కథలోకి తీసుకెళ్లిన దర్శకుడు అక్కడ్నుంచి వేగం పెంచుతాడు. హీరోయిన్‌ గురించి అబద్ధాలు చెప్పి హీరోకు పెళ్లి చేస్తారు. ఆమె ముందు హీరోయిజం చూపించడానికి చూపించేందుకు విష్ణు విశాల్ పడే పాట్లు నవ్వులు పూయిస్తాయి.

కొంచెం బెటర్

ఇంటర్వెల్ బ్యాంగ్‌లో వచ్చే ఓ పోరాట సన్నివేశంలో హీరోయిన్‌ ఫైట్‌ చేయడం అసలు విషయం బయటపడటంతో హీరోకు షాక్‌ తగులుతుంది. దీంతో ఏం జరుగుతుందో అని రెండోభాగం కోసం వేచి చూస్తారు.

హీరోకు షాక్‌

ఐశ్వర్య గురించి నిజం తెలిసిన తర్వాత విష్ణులో వచ్చే మార్పు. ఊర్లో జరిగే సన్నివేశాలు కామెడీ పండిస్తాయి. కానీ, భార్యపై పైచేయి సాధించాలని విష్ణు కుస్తీ నేర్చుకోవటం, 15 రోజుల్లోనే పూర్తి చేయడం వంటివి లాజిక్‌కు దూరంగా ఉంటాయి.

కుస్తీ పట్టు

అప్పటికీ దాకా నవ్వులు పూయించిన సినిమాకు రొట్ట రొటీన్‌గా క్లైమాక్స్ తీర్చిదిద్దారు. పూర్తిగా ప్రేక్షకులు ముందుగానే ఊహించేస్తారు.

పాత కథే

సమాజంలో ఆడవారికి మగవాళ్లతో సమాన గౌరవం ఉండాలి. వారి ప్రతిభను ప్రోత్సహించాలనే సందేశమిచ్చారు.

సందేశం

నాయిక ప్రాధాన్యం ఉండే కథ అయినప్పటికీ విష్ణు విశాల్ ఒప్పుకొని తన నటనతో మెప్పించాడు. ఐశ్వర్య లక్ష్మి మరోసారి తన పాత్రలో ఒదిగిపోయింది. మిగతవాళ్లు పరిధి మేరకు నటించారు.

ఎవరెలా?

కథా నేపథ్యం విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి నటన కామెడీ

ప్లస్‌

ఊహించే కథనం పాటలు క్లైమాక్స్

మైనస్‌

రేటింగ్ - 2.5/5

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.