కోలీవుడ్‌లో గుర్తుండిపోయే ప్రేమకథా చిత్రాలు

YouSay Short News App

కోలీవుడ్‌లో అద్భుతమైన రొమాంటిక్ ప్రేమకథా చిత్రాలు విడుదలయ్యాయి. ఇందులోనూ కొన్నితరాలపాటు గుర్తుండిపోయే సినిమాలు ఉన్నాయి. అవేంటో చూడండి.

రోజా (1992)

మణిరత్నం క్లాసిక్స్‌ నుంచి జాలువారిన అత్యద్భుతమైన ప్రేమకథా చిత్రం రోజా. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన భర్త గురించి ఓ మహిళ వెతుకులాటను జోడించి తెరకెక్కించారు.  ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన పాటలు ఇప్పటికీ మార్మోగుతుంటాయి.

నటీనటులు  : అరవింద్ స్వామి, మధుబాల దర్శకుడు    : మణిరత్నం సంగీతం     : ఏ.ఆర్.రెహమాన్

బాంబే (1995)

హిందూ అబ్బాయి, ముస్లిం అమ్మాయి మధ్య ప్రేమ చిగురించి ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకునే సంఘటన ఆధారంగా తెరకెక్కింది బాంబే చిత్రం. వారిద్దరూ ముంబయి వెళ్లిన తర్వాత జరిగిన మతపరమైన అల్లర్ల గురించి చూపిస్తూ అద్భుతంగా తీశారు మణిరత్నం. ఇది అప్పట్లో సెన్సేషన్

నటీ నటులు : అరవింద్ స్వామి, మనీషా                   కొయిరాల, సోనాలీ బింద్రే దర్శకుడు    : మణిరత్నం సంగీతం     : ఏ.ఆర్. రెహమాన్‌

ప్రేమ దేశం  (1996)

ఒకే అమ్మాయిని ఇద్దరు స్నేహితులు ప్రేమించడం  ఈ సినిమా కథ. ట్రయాంగిల్ లవ్‌స్టోరి ఆధారంగా కతీర్ దర్శకత్వం వహించిన ప్రేమ దేశం యువతకు బాగా నచ్చింది.

నటీ నటులు : అబ్బాస్, టబు, వినీత్ దర్శకుడు    : కతీర్ సంగీతం    : ఏ.ఆర్. రెహమాన్‌

ప్రేమికుల రోజు (1999)

సినీ చరిత్రలో నిలిచిపోయే ప్రేమకథా చిత్రం ప్రేమికుల రోజు. ఓ జంట ఆన్‌లైన్‌లో కలుసుకొని ప్రేమలో పడతారు కానీ, అతడి లవ్‌ను చెప్పటానికి ఇబ్బందులు తలెత్తుతాయి. ఆమెకు చెప్పేలోపు పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది.

నటీనటులు  : సోనాలీ బింద్రే, కునాల్ దర్శకుడు    : కతీర్ సంగీతం     : ఏ.ఆర్.రెహమాన్‌

సఖి

చెన్నైకి చెందిన కార్తీక్, శక్తి అనే జంట పెద్దలను ఎదురించి ప్రేమించుకోవటంతో పాటు పెళ్లి చేసుకుంటారు. వివాహం అనేది వారు ఊహించిన దానికంటే చాలా కష్టమని త్వరలోనే తెలుసుకునే ఇతివృత్తంతో తెరకెక్కించారు సఖి.

నటీనటులు  : మాధవన్, శాలిని దర్శకుడు    : మణిరత్నం సంగీతం     : ఏ.ఆర్.రెహమాన్

ప్రియురాలు పిలిచింది (2000)

ఇది రాజీవ్ మీణన్ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం. సౌమ్య, మీనాక్షి అనే ఇద్దరు యువతులకు చెందిన క్లిష్టమైన ప్రేమకథా ఆధారంగా తీశారు.

నటీనటుల  : అజిత్, టబు, ఐశ్వర్య రాయ్,                   అబ్బాస్, మమ్ముట్టి దర్శకుడు   : రాజీవ్ మీనన్ సంగీతం    : ఏ.ఆర్. రెహమాన్‌

7G బృందావన్ కాలనీ (2004)

లక్ష్యం అంటూ లేకుండా పనిపాటలేని ఓ కుర్రాడు తన పొరుగింట్లో ఉండే నార్త్ ఇండియా యువతి ప్రేమలో పడతాడు. ఆమెను ప్రేమలో పడేసేందుకు చాలా ప్రయత్నాలు చేస్తాడు. అవన్నీ బెడిసికొడుతూనే ఉంటాయి.

నటీనటులు   : రవికృష్ణ, సోనియా అగర్వాల్ దర్శకుడు     : సెల్వ రాఘవన్ సంగీతం      : యువన్ శంకర్ రాజా

ప్రేమిస్తే (2004)

డబ్బున్న విద్యార్థి, మెకానిక్‌ మధ్య జరిగే ప్రేమ కథా చిత్రం ఇది. వారు ఇద్దరూ పారిపోయి వివాహం చేసుకుంటారు. కానీ, అనుకోకుండా వారి జీవితాలు మారిపోతాయి.

నటీనటులు  : భరత్, సంధ్య దర్శకుడు    : బాలాజీ శక్తివేల్ సంగీతం     : జోషువా శ్రీధర్

సూర్య s/o కృష్ణన్ (2008)

NSG అధికారి సూర్య, అతడి తండ్రి మధ్య మంచి రిలేషన్ ఉంటుంది. తండ్రి చనిపోయిన తర్వాత అతడి జీవితంతో పాటు తల్లి,తండ్రి మధ్య ప్రేమ గురించి తెలుసుకుంటాడు. మరోవైపు తన జీవితంలో ప్రేమ, బ్రేకప్స్ గురించి చెబుతుంటాడు.

నటీనటులు  : సూర్య, సిమ్రాన్, సమీరారెడ్డి,                   దివ్య స్పందన దర్శకుడు    : గౌతమ్ మీనన్‌ సంగీతం     : హరీస్ జయరాజ్

ఎటో వెళ్లిపోయింది మనసు (2012)

ఆకర్షణ మెుదలుకొని మెచ్యూరిటీ వరకు వరుణ్, నిత్య అనే ఇద్దరి బంధంలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఇది ఎన్నో సమస్యలు, గొడవలకు దారితీస్తుంది. తెలుగులో నాని, సమంత నటించగా.. తమిళ్‌లో సమంత, జీవా హీరో, హీరోయిన్లుగా చేశారు.

నటీనటులు    : నాని, సమంత దర్శకుడు      : గౌతమ్ మీనన్‌ సంగీతం       : ఇళయరాజా

3 (2012)

పదోతరగతి నుంచి రామ్, జనని మధ్య ప్రేమ చిగురించి వారు వివాహం చేసుకుంటారు. ఊహించని విధంగా రామ్‌కు బైపోలార్ డిసార్డర్ అనే వ్యాధి ఉండటంతో మలుపు తిరుగుతుంది. దాని నుంచి జనని రక్షించటానికి ఆమెకు దూరంగా వెళ్లిపోతాడు.

నటీనటులు    : ధనుష్, శృతి హాసన్ దర్శకుడు      : ఐశ్వర్య రజినీకాంత్ సంగీతం       : అనిరుధ్ రవిచందర్

రాజ రాణి (2013)

ఎటువంటి ప్రేమ, ఆకర్షణ లేకుండా జాన్, రెజినా పెళ్లి జరుగుతుంది. ఇద్దరి జీవితంలో జరిగిన విషాద ఘటనలు తెలుసుకొని తర్వాత కలుసుకుంటారు.

నటీ నటులు  : ఆర్య, నయనతార, నజ్రియా, జై దర్శకుడు     : అట్లీ సంగీతం      : జి.వి. ప్రకాశ్ కుమార్

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి