దాదాపు రెండేళ్లు కరోనా ప్రపంచాన్ని వణికించింది. ఏడాదిగా కాస్త తగ్గుముఖం పట్టినా చైనాలో మాత్రం ఇప్పటికీ దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరో వైరస్ కలవరం మొదలైంది. అదే రష్యాలో కనుగొన్న ‘జాంబీ వైరస్’. మరి ఇండియాకు భయమెందుకో తెలుసుకోవాలంటే పూర్తి వెబ్‌స్టోరీ చూడండి.
ఎన్నో ఏళ్లపాటు బాహ్య జీవితంతో సంబంధం లేకుండా సుప్తావస్థలో ఉండే వైరస్‌లనే జాంబీ వైరస్‌లు అంటారు. అలాంటిదే ఇప్పుడు కనుగొన్న ‘పాండోరా వైరస్ యెడోమా’. 48,500 ఏళ్ల నుంచి ఇది నిద్రాణ స్థితిలోనే ఉంది.
జాంబీ వైరస్ అంటే?
మనుషులు చేస్తున్న పాపాలే వారికి శాపాలుగా మారుతున్నాయి. కాలుష్యం కారణంగా వస్తున్న వాతావరణ మార్పులతో మంచు కొండలు కరిగిపోతున్నాయి. రష్యాలో సైబీరియాలోని పెర్మాఫ్రోస్ట్ ప్రాంతంలో కరుగుతున్న మంచులోంచి బయటపడిందే ఈ జాంబీ వైరస్
మళ్లీ ఎలా పుట్టింది?
సైబీరియన్ పెర్మాఫ్రోస్ట్ ప్రాంతంలోనే 7 వేర్వేరు శాంపిళ్లలో శాస్త్రవేత్తలు 13 రకాల వైరస్‌లను గుర్తించారు. ఇవన్నీ మానవాళికి ఎంతటి ప్రమాదాన్ని కలిగిస్తాయో కూడా ఎవరికీ తెలియదు
ఇంకా ఎన్ని ఉన్నాయి?
వేల సంవత్సరాలు నిద్రావస్థలో ఉన్నప్పటికీ ‘జాంబీ వైరస్’లు అంటు వ్యాధి కారకాలుగానే ఉంటాయని సైంటిస్టులు చెబుతున్నారు. 50వేల సంవత్సరాలు సుప్తావస్థలో ఉన్న వైరస్ కూడా సులభంగా జీవ కణాలపై దాడి చేయగలదని చెబుతున్నారు.
ఇలాంటి పురాతన వైరస్‌లు ఒకవేళ మొక్కలు, జంతువులు లేదా మనుషులకు వ్యాధులను కలగజేస్తే అది ఎంతటి వినాశనానికి దారి తీస్తుందో కనీసం ఊహించలేం
ప్రస్తుతం కనుగొన్న వైరస్ ప్రపంచంలోనే అతి పురాతనమైనది. అంతకుముందు 2013లో ఇదే శాస్త్రవేత్తల బృందం 30 ఏళ్ల పురాతన వైరస్‌ను కనుగొంది
అత్యంత పురాతనం
ఇలాంటి పురాతన వైరస్‌లన్నీ హిమానీ నదాల నుంచే పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ కారణంగా భారత్‌కు రక్షణ గోడలా వ్యాపించి ఉన్న హిమాలయాలు ఏటికేడు కరిగిపోతున్నాయి.
మనకున్న ముప్పేంటి?
వచ్చే 80 ఏళ్లలో లక్ష టన్నులకు పైగా సూక్ష్మజీవులు హిమాని నదాల నుంచి వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇందులో ప్రమాదకమైన బ్యాక్టీరియాలు, వైరస్‌లు ఉంటాయని చెబుతున్నారు.
గ్రీన్ హౌజ్ ఉద్గారాలు తగ్గించాలి. పునరుత్పాదక ఇంధన వనరులపై దృష్టి సారించాలి. అటవీ విస్తీర్ణం పెరగాలి. కర్బన ఉద్గారాలను తగ్గించే దిశగా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి
ఇప్పుడేం చేయాలి?
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.