ఇంట్లో వదిన,మరదళ్ల పోరు?

YouSay Short News App

రవీంద్ర జడేజా సతీమణికి MLA టికెట్‌

టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబ జడేజా ( రివాబా సోలంకి)కి గుజరాత్‌ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా జామ్‌నగర్‌ నార్త్‌లో  BJP నుంచి MLA టికెట్‌ దక్కింది.

అయితే ఇదే స్థానంలో కాంగ్రెస్‌ పార్టీలో ఉన్న జడేజా సోదరి నైనా జడేజా కూడా పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో వీరిద్దరిలో జడేజా ఎటువైటు ఉంటాడో అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు

అసలు రివాబాకు రాజకీయాలకు సంబంధం ఏంటి? జడేజాతో ఈమెకు ప్రేమ, పెళ్లి ఎలా కుదిరింది? నైనాతో రివాబాకు సంబంధం ఎలా ఉంది?

రివాబా జడేజా సంపన్న కుటుంబం నుంచి వచ్చిన రాజకీయ నాయకురాలు. 1990లో వ్యాపారవేత్త హర్దేవ్‌ సింగ్‌ సోలంకి, ప్రఫుల్లభ సోలంకి దంపతులకు రివాబా జన్మించింది.

సంపన్న కుటుంబంలో జననం

ప్రముఖ రాజకీయ నాయకుడు కాంగ్రెస్‌ నేత  హరి సింగ్‌ సోలంకి, రివాబా కుటుంబానికి దగ్గరి బంధువు. వీరు రాజ్‌పుత్‌ సామాజిక వర్గానికి చెందినవారు

రాజకీయ నేపథ్యం

రాజ్‌కోట్‌లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చేసిన రివాబా 2019లో జామ్‌నగర్‌లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత కర్ణిసేన మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎదిగారు. అప్పటికి జడేజా కుటుంబంలో చాలా మంది కాంగ్రెస్‌లో ఉన్నారు.

రాజకీయ రంగప్రవేశం

మహిళలు తమను తాము రక్షించుకోగలిగేలా, కామవాంఛతో అల్లాడే పురుషులను ఎదుర్కొనేలా మహిళలను చైతన్యవంతం చేసేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని రివాబా చెప్పారు.

లక్ష్యాలు, ఆశయాలు

రాజకీయాల్లోకి రాకముందే రివాబా సామాజిక బాధ్యతతో ఉండేవారు. 2018లో మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ కానిస్టేబుల్‌పై రివాబా న్యాయపోరాటం చేశారు. ఇందుకోసం కోర్టుల చుట్టూ తిరిగారు.

సామాజిక సేవ

రివాబా సోలంకి జడేజా ఓ పార్టీలో కలిశారు. జడేజా సోదరి నైనా, రివాబా అంతకు ముందే స్నేహితులు. తన ద్వారా వీరి మధ్య స్నేహం చిగురించింది. అది ప్రేమగా మారింది.

జడేజాతో పరిచయం

ప్రేమలో పడిన కొద్ది రోజులకో 2016 ఫిబ్రవరి 5న ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నారు. జడేజా సొంత రెస్టారెంట్‌ ‘జడ్డూ’స్‌ ఫుడ్‌ కోర్ట్‌’లో స్నేహితులు సన్నిహితుల నడుమ వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది.

ఎంగేజ్‌మెంట్‌

ఎంగేజ్‌మెంట్‌ అయిన కొద్ది నెలల్లోనే రాజ్‌కోట్‌లో సన్నిహుతుల నడుమ ఈ జంట అంగ రంగ వైభవంగా వివాహ బంధంతో ఒక్కటైంది. ఏప్రిల్‌ 17న జడేజా, రివాబా వివాహం జరిగింది.

పెళ్లి

2017లో జడేజా దంపతులకు కుమార్తె జన్మించింది. కానీ తమ గారాలపట్టిని ఎవరి కంటా పడకుండా సోషల్‌ మీడియాకు చిక్కకుండా ఈ జంట జాగ్రత్త పడుతోంది.

రివాబా కుటుంబం

మూడు దశాబ్దాలుగా గుజరాత్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి కూడా అక్కడ అధికారం నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఆప్‌ వారికి గట్టి పోటీనిస్తోంది. ఇలాంటి చోట వదిన, మరదళ్ల పోరులో విజయమెవరిదో చూడాలి.