YouSay Short News App

ఈ వారం (january 25,26,27)  థియేటర్‌/ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు

సంక్రాంతికి భారీ సినిమాలు బాక్సాఫీస్‌ను షేక్‌ చేశాయి. ఆ తర్వాత వారం కూడా ఆ సినిమాల సందడే కొనసాగింది. అయితే చివరి వారంలో మాత్రం బాలివుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’ వస్తోంది.

తెలుగులోనూ ఓ యాక్షన్‌ సినిమా విడుదలకు సిద్ధమైంది. అలాగే ఓటీటీలోనూ కొన్ని సినిమాలు విడుదల కాబోతున్నాయి అవేంటో ఓ సారి చూద్దాం.

షారుఖ్‌ ఖాన్‌, దీపికా పదుకునే, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా బాలివుడ్‌కు మంచి బాక్సాఫీస్ విజయాన్ని అందిస్తుందని ఆశిస్తున్నారు.

పఠాన్‌ - జనవరి 25

థియేటర్‌లో సందడి చేయబోతున్న సినిమాలు

‘వార్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ తెరకెక్కించిన సిద్దార్థ్ ఆనంద్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. షారుఖ్‌ ఖాన్ నాలుగేళ్ల తర్వాత తెరపై కనిపించబోతున్నారు.

సుధీర్ బాబు హీరోగా వస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ హంట్. సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా  ఈ సినిమా ట్రైలర్‌ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమా కూడా అదే స్థాయిలో విజయం సాధిస్తుందని ఆశిస్తున్నారు.

హంట్‌ - జనవరి 26

మాలికాపురం-జనవరి 26 క్రాంతి (కన్నడ)-జనవరి 26 గాంధీ గాడ్సే ఏక్ యుద్ధ్ (హిందీ)-జనవరి 26 ఎలోన్ (మలయాళం)-జనవరి 26 తంకం (మలయాళం)-జనవరి 26

మరికొన్ని చిన్న, పరభాషా సినిమాలు

కార్తికేయ-2 విజయం తర్వాత నిఖిల్‌ సిద్దార్థ్  నుంచి వచ్చిన సినిమా 18 పేజెస్. అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా మెరిసింది. సుకుమార్ కథ అందించిన ఈ సినిమా థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది ఓటీటీలో ఎలా ఆడుతుందో చూడాలి.

ఓటీటీలో రాబోతున్న సినిమాలు

18 పేజెస్‌- జనవరి 27-నెట్‌ఫ్లిక్స్& ఆహా

వెబ్‌ సిరీస్‌లు, పరభాషా సినిమాలు

డియర్‌ ఇష్క్‌- హిందీ వెబ్‌ సిరీస్‌-జనవరి 26 - హాట్‌స్టార్‌ సాటర్‌డే నైట్‌-మలయాళం-జనవరి 27 - హాట్ స్టార్‌ జాన్‌ బాజ్ హిందుస్థాన్‌ కే-హిందీ వెబ్‌ సిరీస్‌-జనవరి 26 అయాలి- తెలుగు,తమిళ వెబ్‌ సిరీస్‌ - జనవరి 26