ఈ వారం(FEB 13-19) థియేటర్లు/ OTT వేదికల్లో సందడి చేయనున్న సినిమాలు

YouSay Short News App

స్టార్ హీరోయిన్ సమంత నటించిన శాకుంతలం మూవీ విడుదల వాయిదా పడటంతో చాలా సినిమాలకు అడ్డులేకుండా పోయింది. కావాల్సినన్ని థియేటర్లు దక్కించుకున్నాయి. థియోటర్లలో రిలీజయ్యే సినిమాలు ఓసారి చూద్దాం

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ‘సార్’ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్‌లలో సందడి చేయనుంది. ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది.

సార్

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలోని మాస్టారు.. మాస్టారు నా మనసుసు గెలిచారు సాంగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ముఖ్యంగా లెడీ ఫాలోయింగ్‌ను సంపాదించింది.

విద్యా వ్యవస్థలో నెలకొన్న సమస్యలే ఇతివృత్తంగా  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

‘వినరో భాగ్యము విష్ణుకథ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.  ఈ సినిమా ఫిబ్రవరి 18న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కిరణ్ సరసన కశ్మీరా హీరోయిన్‌గా నటిస్తోంది. మురళి డైరెక్ట్ చేశారు. గీతా ఆర్ట్స్ నిర్మించింది.

వినరోభాగ్యము విష్ణుకథ

తన ఫొన్ నెంబర్‌కు అటూ ఇటూ ఉన్న నెంబర్లు కలిగిన వారితో స్నేహం చేయాలనుకున్న యువకుడి జీవితం ఎలాంటి మలుపులు తిరిగింది? అనేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌పై మంచి స్పందన వస్తోంది.

జబర్దస్ట్ రాకేష్ నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి  18న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని రేలంగి నరసింహరావు డైరెక్ట్ చేయగా.. తుమ్మల ప్రసన్నకుమార్ ప్రొడ్యూస్ చేశారు.

ఊఅంటావా మావ ఉఊ అంటవా మావా

అల్లు అర్జున్  బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘అల వైకుంఠపురములో’మూవీని హిందీలో  'షెహ్‌జాదా'గా రీమేక్ చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదల కానుంది.

'షెహ్‌జాదా'

కార్తిక్‌ ఆర్యన్‌ హీరోగా, కృతి సనన్‌  హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో హిట్‌ అయినా ఈ చిత్రాన్ని హిందీ నెటివిటీకి అనుగుణంగా తగిన మార్పులు చేసి తెరకెక్కించారు.

కళ్యాణం కమనీయం (తెలుగు) ఫిబ్రవరి 17

ఆహా

ఈ వారం ఓటీటీ చిత్రాలు

కార్నివాల్ రో(వెబ్‌సిరీస్) ఫిబ్రవరి 15

అమెజాన్ ప్రైమ్

– స్క్వేర్డ్‌ లవ్‌ ఆల్‌ ఓవర్‌ ఎగైన్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 13 – ది రొమాంటిక్స్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 14 – పర్ఫెక్ట్‌ మ్యాచ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 14 – ఏ సండే ఎఫైర్‌ (హాలీవుడ్‌) ఫిబ్రవరి 14 – రెడ్‌ రోజ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15 – ఫుల్‌ స్వింగ్‌ (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15 – ఆఫ్రికన్‌ క్వీన్స్‌: జింగా (వెబ్‌సిరీస్‌) ఫిబ్రవరి 15 – సర్కస్‌ (హిందీ) ఫిబ్రవరి 17 – గ్యాంగ్‌లాండ్స్‌ (వెబ్‌సిరిస్‌) ఫిబ్రవరి 17 – అన్‌లాక్‌ (కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 17

నెట్‌ఫ్లిక్స్‌

– మాలికాపురం- తెలుగు- ఫిబ్రవరి 15 – సదా నన్ను నడిపే (తెలుగు) ఫిబ్రవరి 16 – జె-హోప్‌ ఇన్‌ ది బాక్స్‌(కొరియన్‌ సిరీస్‌) ఫిబ్రవరి 17 – ద నైట్‌ మేనేజర్‌ (హిందీ సిరీస్‌) ఫిబ్రవరి 17

డిస్నీ హాట్ స్టార్

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.