ఈ వారం (February 9,10) థియేటర్‌/ఓటీటీలో విడుదల కాబోతున్న సినిమాలు

YouSay Short News App

కొత్త ఏడాదిలో రెండో నెలలోకి సినిమా అడుగుపెట్టింది. గతవారం థియేటర్లు, ఓటీటీల్లో సినిమాల సందడి కాస్త తక్కువగానే ఉంది. కానీ ఈ వారం మళ్లీ చాలా సినిమాలు హల్‌చల్‌ చేయబోతున్నాయి. థియేటర్‌తో పాటు ఓటీటీలో బాగానే సినిమాలు రాబోతున్నాయి. అవేంటో  ఓ సారి చూద్దాం

డోపుల్‌ గ్యాంగర్‌ కాన్సెప్ట్‌తో ఎమోషనల్‌ థ్రిల్లర్‌గా వస్తున్న సినిమా ‘అమిగోస్‌’. నందమూరి కల్యాణ్‌ రామ్ త్రిపాత్రాభినయం చేశారు. బింబిబిసార వంటి కమర్షియల్ హిట్‌ కొట్టాక, మరోసారి ప్రయోగంతో ముందుకొస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సినిమాను నిర్మించింది. ఈ నెల 10న విడుదల చేయబోతున్నారు.

కల్యాణ్‌రామ్‌ అమిగోస్- ఫిబ్రవరి 10

థియేటర్లలో రాబోతున్న సినిమాలు

కన్నడ సినీ ప్రేక్షకులు శివన్న అని పిలుచుకునే స్టార్ హీరో శివ రాజ్‌కుమార్‌ 125వ సినిమా శివ వేద. తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. శివరాజ్‌ కుమార్‌ భార్య సంస్థ గీతా పిక్చర్స్‌లో నిర్మించిన తొలి సినిమా ఇది. ఇప్పటికే కన్నడలో విడుదలై సంచలనం సృష్టించిన సినిమా తెలుగులోనూ రాబోతోంది. ఎమోషనల్ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఫిబ్రవరి 9న విడుదల కాబోతోంది.

శివ వేద - ఫిబ్రవరి 9

ఆవికా గోర్‌, సాయి రోనక్‌ జంటగా నటించిన సినిమా పాప్ కార్న్. మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించబోతోంది. శ్రవణ్‌ భరద్వాజ్‌ సంగీతం అందించగా… భోగేంద్రగుప్త నిర్మించారు. 10న థియేటర్లలో సినీప్రియులను పలకరించనుంది.

పాప్‌కార్న్‌ - ఫిబ్రవరి 10

విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం IPL. సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించగా బీరం శ్రీనివాస్‌ నిర్మించారు.

IPL: ఇట్స్‌ ప్యూర్‌ లవ్‌- ఫిబ్రవరి 10

రవీంద్ర గోపాల, రాఘవ, మనోహర్‌, జీవా, సుధ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా దేశం కోసం భగత్‌ సింగ్‌.రవీంద్ర గోపాల  దర్శకత్వం వహించారు.  ఈనెల 10న థియేటరల్లో సందడి చేయనుంది.

దేశం కోసం భగత్‌ సింగ్‌ - ఫిబ్రవరి 10

వెంకట్‌ గ్యాంగ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా చెడ్డిగ్యాంగ్‌ తమాషా. అబుజా ఎంటర్‌టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదల కాబోతోంది.

చెడ్డి  గ్యాంగ్ తమాషా

సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘తునివు’  ఈ నెల 8న నెట్‌ఫ్లిక్స్ వేదికగా  ప్రసారం కానుంది. తమిళనాట ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది.

తునివు/ తెగింపు- ఫిబ్రవరి 8-నెట్‌ఫ్లిక్‌

ఈ వారం ఓటీటీ చిత్రాలు/ వెబ్‌సిరీస్‌లు

తెలుగులో ‘తెగింపు’గా వచ్చింది. అజిత్ హీరోగానటించిన ఈ సినిమాలో మంజు వారియర్ ప్రధాన పాత్ర పోషించింది. జిబ్రాన్ సంగీతం అందించాడు. హెచ్ వినోద్ డైరెక్ట్ చేయగా.. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించారు.

సంక్రాంతికి స్టార్‌ హీరోల సినిమాలకు పోటీగా విడుదలైన సినిమా ‘కల్యాణం కమనీయం’, సంతోష్‌ శోభన్‌, ప్రియా భవానీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఫిబ్రవరి 10న ఆహాలో విడుదల కాబోతున్న ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

కల్యాణం కమనీయం- ఫిబ్రవరి 10 - ఆహా

డిస్నీ+హాట్‌స్టార్‌ రాజయోగం- ఫిబ్రవరి 09 నాట్‌ డెడ్‌ ఎట్‌ (వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 09 హన్సిల లవ్ షాదీ డ్రామా ( మ్యారేజ్‌ వీడియో) - ఫిబ్రవరి 10

OTTల్లో రాబోతున్న మరికొన్ని సినిమాలు& సిరీస్‌లు

అమెజాన్‌ ప్రైమ్‌ ఫర్జీ- ఫిబ్రవరి 10

నెట్‌ఫ్లిక్స్‌ బిల్‌ రస్సెల్‌: లెజెండ్‌(వెబ్‌సిరీస్‌)- ఫిబ్రవరి 8 ద ఎక్స్ఛేంజ్‌ (హాలీవుడ్‌)- ఫిబ్రవరి 8 యు (వెబ్‌సిరీస్‌-4)- ఫిబ్రవరి 9 డియర్‌ డేవిడ్‌ (హాలీవుడ్‌)- ఫిబ్రవరి 9 యువర్‌ ప్లేస్‌ ఆర్‌ మైన్‌ (హాలీవుడ్‌)-ఫిబ్రవరి 10 టెన్‌ డేస్‌ ఆఫ్‌ ఎ గుడ్‌మాన్‌ (హాలీవుడ్‌)-ఫిబ్రవరి 10

సోనీలివ్‌ నిజం విత్‌ స్మిత (టాక్‌ షో)-ఫిబ్రవరి 10

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.