జాతీయ రాజకీయాల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు సంసిద్ధమైన టీఆర్ఎస్ అందుకు మునుగోడు ఉపఎన్నికను కార్యస్థలంగా ఎంచుకుంది.
సామ,దాన, భేద, దండోపాయాలతో ఉపఎన్నికలు వెళ్లి టీఆర్ఎస్ విజయం సాధించింది.తొలుత టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చడం ద్వారా కేసీఆర్ ప్రజల్లో ఓరకమైన ఉద్విగ్నతను కలిగించారు
సామ, దాన, భేద, దండోపాయం
మునుగోడు ఒకప్పుడు సీపీఐ, సీపీఎంలకు కంచుకోట. ఈ విషయాన్ని గమనించిన కేసీఆర్ అక్కడి సీపీఎం సాంప్రాదాయ ఓటు బ్యాంకును పొత్తుతో తనవైపుకు తిప్పుకోగలిగారు.
సీపీఐ, సీపీఎంలతో పొత్తు
మునుగోడు ఉపఎన్నిక నోటిఫికేషన్ రాగానే గులాబీ దండు మొత్తం మునుగోడులోనే మకాం వేసింది.
మునుగోడులోనే మకాం:
బూత్‌లు వారీగా ఇంఛార్జ్‌లుగా ఏర్పడి.. ప్రతి ఓటర్‌కు ప్రభుత్వ పథకాలు వివరించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లో మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ ప్రత్యేక బాధ్యతలు స్వీకరించారు.
మునుగోడులో ప్రధానంగా ఫ్లోరైడ్ సమస్యను పారద్రోలుతామని, అందుకు మునుగోడుని దత్తత తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించడం సానుకూలంగా మారింది.
చివర్లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం టీఆర్ఎస్‌కు ప్రజల నుంచి సానుభూతి లభించింది. అంతిమంగా ఇవన్నీ టీఆర్ఎస్ గెలుపుకు బాటలు వేశాయి.
బీజేపీకి రూ.18వేల కోట్లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయారనే అంశాన్ని జనాల్లోకి టీఆర్ఎస్ బలంగా తీసుకెళ్లగలిగింది.
బీజేపీ ఓటమికి కారణాలు
ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు పదేపదే ఈ విషయంపై నిలదీస్తూ చివరకు రాజగోపాల్ రెడ్డిని ఓడించడంలో సక్సెస్ అయ్యారు
TRS ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కూడా బీజేపీకి పెద్ద మైనస్ అయింది. ఈ అంశాన్ని సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం చేసి టీఆర్ఎస్ లాభం పొందింది
రాజగోపాల్ రెడ్డి ఓటమికి తన సోదరుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కూడా ఓ కారణంగా తెలుస్తోంది.
ప్రచార సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో కాల్ లీక్ కావడం, పార్టీలకు అతీతంగా బీజేపీకి ఓటు వేయాలని కోరడం దెబ్బతీసింది.
కాంగ్రెస్ సిట్టింగ్ స్థానాన్ని చేజార్చుకోవడంతో పాటు డిపాజిట్ కూడా కోల్పోయింది.
కాంగ్రెస్ ఓటమికి కారణాలు:
కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతికి 23,906 ఓట్లు మాత్రమే వచ్చాయి.
2014 అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన స్రవంతికి 27,441 ఓట్లు వచ్చాయి
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగంగా బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లను కోరడం పార్టీ విజయవకాశాలను దెబ్బతీసింది
అంతర్గత కుమ్ములాటలు
తొలి నుంచి కాంగ్రెస్‌కు పట్టం కట్టిన మునుగోడు ఓటర్లు ఈసారి రెండుగా చీలారు. పార్టీ కేడర్‌లో కొంతమంది నాయకులు రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్లడం కాంగ్రెస్‌కు నష్టం తెచ్చింది
పోలింగ్‌కు ముందు కీలకమైన వారం రోజుల్లో రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం మునుగోడు ప్రచారాన్ని లైట్ తీసుకుంది
కొంప ముంచిన రాహుల్ జోడో యాత్ర
రాహుల్ పాదయాత్రకు ఎక్కువ సమయం కేటాయించారు. దీంతో క్యాడర్‌లో దిశానిర్దేశం లేకుండా పోయింది.
ఏదిఏమైన మరో 6-8 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. ఈ ఓటమి గెలుపులు తాత్కాలిక కాలమేనని అన్ని పార్టీలు ఇప్పటికే గమనించి ఉంటాయి.