pretty ethnic indian woman, breathe fresh air, calm millennial ethnic lady take a deep breath with closed eyes meditate feel good zen

YouSay Short News App

మహిళల భద్రతకు తప్పక ఉండాల్సిన గ్యాడ్జెట్స్

testUpload1668230631420

డిజిటల్ యుగంలో టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ మహిళలపై దాడులు తగ్గడం లేదు. ఎవరో వచ్చి కాపాడాలి అని వేచిచూడకుండా తమని తాము రక్షించుకోవడానికి కొన్ని డిజిటల్ పరికరాలున్నాయి. అవేంటో చూద్దాం.

81s7bAVYxXL._UY550_

సొనాటా యాక్ట్ వాచ్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని అందులో మన గార్డియన్ నెంబర్‌, తదితర వివరాలు రిజిస్టర్ చేసుకోవాలి. బ్లూటూత్ ద్వారా ఇది పనిచేస్తుంది. ఒత్తిడిలో ఉన్నప్పుడు గమనించి ఈ వాచ్ గార్డియన్ ఫోన్‌కి అలర్ట్‌ని పంపిస్తుంది. యూజర్ లొకేషన్‌ని కూడా అందులో చూపిస్తుంది. దీని ధర రూ.1,215.

యాక్ట్ సొనాటా వాచ్..

41zFZq9wgFL

చూడడానికి ఇది టార్స్ లైట్ మాదిరి ఉంటుంది. ఈ పరికరం ద్వారా ఎదుటివారికి మనం విద్యుత్ షాక్ కలిగించొచ్చు. దీని నుంచి వచ్చే వెలుగుతో పాటు విద్యుత్ కూడా ప్రసారమవుతుంది. దీని ధర రూ.549. అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

షాకిచ్చే టార్చ్‌లైట్..

ఇవి కత్తిపోటు నుంచి మన చేతుల్ని కాపాడుతాయి. చేతులకు వీటిని తొడుక్కుంటే కత్తి గాయం నుంచి తప్పించుకోవచ్చు. కూరగాయలు కోసేటప్పుడూ రక్షిస్తాయి. ధర. రూ.299 మాత్రమే. అమెజాన్‌లో ఉంటుంది. వీటితో పాటు స్లీవ్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

కట్ రెసిస్టెంట్ గ్లోవ్స్..

మనం ఆపదలో ఉన్నప్పుడు ఈ అలారం కీ చైన్‌ని అన్‌లాక్ చేస్తే సైరన్ మోగుతుంది. దీంతో చుట్టుపక్కల వాళ్లకు తెలుస్తుంది.. దీనికొక ఇన్‌బిల్ట్ టార్చ్ లైట్ కూడా ఉంది. ఖాళీ సమయంలో పాటలు వినేందుకూ వీలుంది. ధర: రెండింటికి కలిపి రూ.2,813 మాత్రమే.

అలారం కీచైన్..

ఈ ట్రాకర్‌కి స్మార్ట్ ఫోన్‌తో పనిలేదు. ఇందులో ఒక సిమ్‌ని ఇన్‌సర్ట్ చేస్తే చాలు. మీ ఫోన్‌లో ‘AIBEILE’ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసి ఎమర్జెన్సీ నెంబరుని యాడ్ చేయాలి. మనం సురక్షితంగా లేనప్పుడు ట్రాకర్ బటన్‌ని ప్రెస్ చేస్తే ఎమర్జెన్సీ నెంబరుకి కాల్ వెళ్తుంది. మన లైవ్ లొకేషన్‌ని ఎదుటి వ్యక్తికి పంపిస్తుంది. దీని ధర రూ.3,739 మాత్రమే.

జీపీఎస్ ట్రాకర్..

మహిళలు ఆత్మరక్షణలో పడటమే కాదు. అవసరమైన సమయంలో దాడి కూడా చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ఉపయోగపడేదే పెప్పర్ పిస్టోల్. పెప్పర్ స్ప్రే చేసి దుండగుల బారి నుంచి తప్పించుకోవచ్చు. దీని ధర. రూ. 8,538

పెప్పర్ స్ప్రే పిస్తోల్..

ఇతరుల నుంచి తప్పించుకోవడానికి ఉన్న మరో సాధనమిది. దీంతో కొడితే యమ నొప్పి కలుగుతుంది. అంతే కాక షాక్ ఇచ్చినట్టు కూడా అనిపిస్తుంది. అయితే, కేవలం ఇది ఆత్మరక్షణలో భాగంగా మాత్రమే వాడాలి. దీని ధర రూ.349.

సేఫ్టీ రాడ్..

ఈ సాధనాలే కాకుండా భద్రతనిచ్చే ఎన్నో యాప్‌లు మనకు అందుబాటులో ఉన్నాయి.  తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ‘హాక్ ఐ’, ‘దిశ’ యాప్‌లను తీసుకొచ్చాయి. ఇవే కాకుండా ఎస్ఓఎస్ వంటి యాప్‌లూ అందుబాటులో ఉన్నాయి. వీటిని డౌన్‌లోడ్ చేసుకుంటే ధీమాగా ఉండొచ్చు.

డిజిటల్ యాప్స్..