Lined Circle

ఆలోపు ఈ 10 Sci-Fi సినిమాలు చూసేయండి

అవతార్-2 కోసం ఎదురుచూస్తున్నారా?

1. ఏలియన్ ( 1979 )

సైన్స్ ఫిక్షన్ కథా చిత్రాలకు నాంది పలికిన చిత్రం ఏలియన్. రిడ్లే స్కాట్ దర్శకత్వం వహించారు.  ఈ సినిమా ప్రధానంగా అంతరిక్ష నౌక చుట్టూ తిరుగుతుంది. 45 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటికీ ఆ సినిమా విజువల్స్ మనల్ని కట్టిపడేస్తాయి.

Lined Circle
Lined Circle

2. టర్మినేటర్ ( 1984 )

ఇందులో ఆర్నాల్డ్ శ్వాస్జ్ నెగ్గర్ ప్రధాన పాత్రలో నటించాడు. తన ప్రపంచానికి ముప్పుగా భావించే ఓ వ్యక్తిని 2029 నుంచి 1984 లోకి వెళ్లి చంపే నేపథ్యంలో సాగే కథ. జేమ్స్ కేమెరాన్ తనదైన శైలి కథనంతో తెరకెక్కించాడు.

Lined Circle

3. మ్యాట్రిక్స్( 1999 )

సైన్స్ ఫిక్షన్ చిత్రాల్లో మరో అద్భుతమైన చిత్రం మ్యాట్రిక్స్. కంప్యూటర్ ప్రోగ్రామర్ అయిన థామస్ అండర్ సన్ చుట్టూ కథ నడుస్తోంది. మ్యాట్రిక్స్ ఫ్రాంచైజ్ లో మెుత్తం మూడు సినిమాలు వచ్చాయి. అన్ని విజయం సాధించాయి.

Lined Circle

4. ఐ రోబో( 2004 )

మానవుల కంటే  AI, రోబో అతి తెలివైనవి అయితే ఎలా ఉంటుందనేది కథాంశం. ఇందులో VFX సన్నివేశాలకు విజిల్స్ వేయకు తప్పదు. ఈ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ కావొద్దు..

Lined Circle

5.డ్యూన్ ( 2021 )

పాల్ అట్రైడ్స్ అనే వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఓ ఏడారి గ్రహానికి వెళతాడు. ఇందుకోసం తను ఎవరెవరితో పోరాటం చేశాడనే  కథాంశంతో అద్భుతంగా తీశారు. అవతార్-2 వచ్చే కన్నా ముందు ఈ సినిమాను చూసేయండి.

Lined Circle

6. ప్రొమేథియస్ ( 2012 )

సైన్స్ ఫిక్షన్ హర్రర్ చిత్రాల్లో తక్కువ పేరుపొందిన చిత్రం. రిడ్లే స్కాట్ దర్శకత్వంలో తెరకెక్కిన మరో అద్భుతం. ఓ జాతి కోసం అంతరిక్షంలోకి ప్రయాణించిన శాస్త్రవేత్తల బృందం ఊహించని ప్రమాదాలను ఎదుర్కొంటుంది.

Lined Circle

7. ది అరైవల్ (2016 )

ఇటీవల కాలంలో వచ్చిన మంచి చిత్రాల్లో ఒకటి. భూమిపై ఏలియన్స్ తలపెట్టిన యుద్ధాన్ని ఆపేందుకు ఓ భాషా శాస్త్రవేత్త వాటితో మాట్లాడేందుకు ప్రయత్నించే కథాంశంతో తెరకెక్కింది. మనుషులు భయాలు వదిలేసి అవసరమైన సమయాల్లో కలిసికట్టుగా ఉండాలనే సందేశం ఇచ్చారు.

Lined Circle

8. స్టార్ వార్స్ ఎపిసోడ్  V- ది అంపైర్ స్ట్రైక్స్ బాక్ ( 1980 )

స్టార్ వార్ చిత్రాల్లో ఇది అత్యుత్తమని సినీ విశ్షేషకుల అభిప్రాయం. మంచు గ్రహం హాత్ పై తిరుగుబాటుదారులకు పూర్తి అధికారాలు సాధించిన తర్వాత ల్యూక్ స్కైవాకర్, జెడైకి యోధతో కలిసి శిక్షణ ఇస్తాడు. వారందరినీ డార్త్ వాడర్, బౌంటీ హంటర్ బోబా ఫెట్ గెలాక్సి అంతటా వెంబడిస్తారు.

Lined Circle

9. బ్లేడ్ రన్నర్ ( 1982 )

బ్లేడ్ రన్నర్ సినిమా కథ, అందులో పాత్రలు, నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సినిమా చూడాలనే ఆసక్తిని రేకెత్తిస్తోంది. సైన్స్ ఫిక్షన్ లో ఇదొక మైలురాయి. ఇది 1982లో విడుదలైన ఈ సినిమా కథ 2019లో నడుస్తుంది. కానీ అప్పట్లోనే 2019 పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు

Lined Circle

10. ఎక్స్ మెషిన్ ( 2014 )

ఈ సినిమా కథనం మనల్ని ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఒక పెద్ద టెక్ సంస్థలో పనిచేస్తున్న ప్రోగ్రామర్ చుట్టూ నడిచే కథ. అతడు హ్యూమన్ ఆండ్రాయిడ్ ను పరీక్షిస్తుంటాడు. ఆండ్రాయిడ్, ప్రోగ్రామర్ తారుమారై కథ మలుపు తిరుగుతుంది.

మరికొన్ని సినిమాలు

బాక్ టూ ఫ్యూచర్ ( 1985 )

జురాసిక్ పార్క్ ( 1993 )

ప్రీడేటర్ ( 1987 )

ఆనిహిలేషన్ ( 2018 )

గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ vol.1 (2014 )

2001: ఏ స్పేస్ ఒడిస్సే ( 1968 )