క్రైం థ్రిల్లర్‌ జానర్‌లో

YouSay Short News App

తెలుగులో తప్పక చూడాల్సిన సినిమాలు ఇవే!

తారకరత్న, భూమిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అమరావతి’. ఈ సైకోత్రిల్లర్‌కి రవి బాబు దర్శకత్వం వహించాడు. ‘హెచ్’ అనే కొరియన్ సినిమాకు రీమేక్‌గా దీన్ని తీసుకొచ్చినా.. తెలుగుదనాన్ని జోడించి రవిబాబు తెరకెక్కించాడు. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

అమరావతి - Zee 5

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వ ప్రతిభను నిరూపించే సినిమా ఇది. 2004లో విడుదలైనా, ఇప్పటికీ ఈ సినిమాను చూస్తే ఔరా అనాల్సిందే. తెలుగులో క్రైం త్రిల్లర్స్ జానర్‌లో తెరకెక్కిన సినిమాల్లో ‘అనుకోకుండా ఒకరోజు’ చెప్పుకోదగినది.

అనుకోకుండా ఒక రోజు  - Prime Video

రవిబాబు స్వీయ దర్శకత్వంలో వచ్చిన మరో క్రైం త్రిల్లర్ మూవీ ‘అనసూయ’. భూమిక, నిఖితలతో పాటు రవిబాబు కూడా ఇందులో నటించాడు. ఓ సీరియల్ కిల్లర్‌ని కనిపెట్టిన జర్నలిస్టు చుట్టూ కథ తిరుగుతుంటుంది.

అనసూయ - Zee 5

డా.శైలేష్ కొలను చేపడుతున్న హిట్‌వర్స్‌లో భాగంగా వచ్చిన మొదటి సినిమా ఇది. ఓ యువతి మర్డర్ మిస్టరీని ఛేదించే క్రమంలో ఓ అధికారికి ఎదురయ్యే సవాళ్లేంటి? అనేదే ఈ సినిమా. ఇందులో హిట్ ఏజెంట్‌గా విశ్వక్‌సేన్ నటించాడు. రుహాని శర్మ కథానాయిక.

హిట్: The First Case - Prime Video

టాలీవుడ్‌లో ఆల్‌టైం క్రైం త్రిల్లర్ సినిమాలలో ఒకటిగా నిలిచింది ‘క్షణ క్షణం’. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాను తెరకెక్కించాడు. వెంకటేశ్, శ్రీదేవి ప్రధాన పాత్రలు పోషించారు.

క్షణ క్షణం - Prime Video

అడివి శేష్, రెజీనా కసాండ్రా కలిసి నటించిన చిత్రం ‘ఎవరు’. ఓ పోలీసు అధికారిని క్రూరంగా చంపిన నేరస్థుడిని ఎలా పట్టుకున్నారనేదే ఈ సినిమా కథ. ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

ఎవరు - Prime Video

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘యు టర్న్’. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రేక్షకుడిని కుర్చీలకు కట్టేపడేసే సన్నివేశాలు, ట్విస్టులతో ఈ క్రైం త్రిల్లర్ రూపొందింది. కొన్ని సీన్లను చూస్తే చెమటలు పట్టేస్తాయి. తప్పకుండా ఈ సినిమాను చూడండి.

యు టర్న్ - Prime Video

మృతదేహాల చేతివేళ్లను కత్తిరించి, వేలిముద్రలను విక్రయించుకునే మాఫియా కథే ఇది. ఇది ఎవరు చేస్తున్నారు? డిటెక్టివ్ అయిన హీరో ఈ గుట్టును ఎలా ఛేదించాడనేది సర్వత్రా ఆసక్తికరం. కొన్ని సీన్లు భయపెట్టిస్తాయి.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ - Prime Video

సరోగసి, మెడికల్ మాఫియా కథాంశంగా తెరకెక్కిన చిత్రం ఇది. ఓ ప్రైవేటు నర్సింగ్ హోంలో సరోగసి పేరిట జరిగే ఆకృత్యాలను కళ్లకు కట్టేలా చూపించారు. ఓ సరోగసి మహిళగా ఆ నర్సింగ్ హోంలో చేరి నిజానిజాలను భయటపెట్టే పాత్రలో సమంత నటించింది.

యశోద -  Prime Video

గూఢచారి ఉత్కంఠగా సాగే సినిమా ఇది. అడివి శేష్ ఇందులో ‘రా ఏజెంట్’గా నటించాడు. శోభిత ధూళిపాళ్ల హీరోయిన్‌గా చేసింది. శశి కిరణ్ టిక్కా ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

గూఢచారి - Prime Video