భారత సినీ చరిత్రలోనే ఖరీదైన  సినిమా తీయబోతున్న  “మైత్రి మూవీ మేకర్స్‌” ప్రస్థానం

YouSay Short News App

దిల్‌ రాజు, అరవింద్‌, దానయ్య ఇలా పెద్ద పెద్ద బ్యానర్లు ఇండస్ట్రీని ఏలుతున్న వేళ… తుపానుకు ముందు వచ్చే నిశ్శబ్దంలా అడుగుపెట్టారు “మైత్రి మూవీ మేకర్స్” .

చిన్నప్పటి నుంచే సినిమాలంటే ప్రేమ, ఇష్టం.  అమెరికా వెళ్లినా అక్కడా సినిమానే. అందుకే సినీ నిర్మాణ రంగాన్ని ఎంచుకున్నారు.

నిశ్శబ్దంగా ఇండస్ట్రీలోకి వచ్చినా తొలి సినిమాతోనే ఇండస్ట్రీలోనే రీసౌండ్‌ వచ్చేలా టాలివుడ్‌లోనే బిగ్గెస్ట్‌ స్టార్‌తో బ్లాక్‌బస్టర్‌ కొట్టారు. ప్రస్తుతం దేశ చలనచిత్ర రంగమమే తమవైపు చూసేలా సినిమాలు ప్లాన్‌ చేస్తున్నారు.

మైత్రి మూవీ మేకర్స్‌ ఆలోచన పుట్టింది నవీన్‌ యేర్నేని మదిలో. విజయవాడకు చెందిన ఈయన అమెరికాలో సెటిలయ్యి అక్కడ మూవీ డిస్ట్రిబ్యూటర్‌గా మారారు. తన స్నేహితులైన రవిశంకర్‌, మోహన్ చెరుకూరికి తన ఆలోచన పంచుకుని 2012 నుంచే తమ ప్రొడక్షన్ బ్యానర్‌ పనులు ప్రారంభించారు.

ఎలా పుట్టింది?

2012లో మిర్చీ తీస్తున్న సమయంలో దర్శకుడు కొరటాల శివతో పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి కథలు వింటూనే ఉన్నారు. అలా 2015లో మైత్రి మూవీ మేకర్స్‌ పేరిట బ్యానర్‌ ఏర్పాటు చేసి   ఓ సినిమా ప్రకటించారు.

అడుగు పెట్టడమే టాలివుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబుతో సినిమా ప్రకటించారు. తమకు అప్పటికే పరిచయమున్న కొరటాల శివతో 2015లో ‘శ్రీమంతుడు’ సినిమా అనౌన్స్ చేశారు.  సుమారు రూ.70 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా రూ.140 కోట్లకు పైగా వసూళ్లు సాధించి  బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

తొలి అడుగే భారీగా

అంత భారీ సినిమాతో ప్రొడక్షన్‌ రంగంలో దిగడానికి భయమేయలేదా అంటే.. భయం ఉండకూడదనే భారీ సినిమా చేశామంటారు నవీన్‌ యేర్నేని. మహేశ్‌ బాబు సినిమా అయితే రిస్క్‌ తక్కువ, అందుకే పెద్ద సినిమాతో ప్రయాణం మొదలుపెట్టామని  చెబుతారు.

భారీగా ఎందుకంటే

నవీన్ యేర్నేని స్వయంగా సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యాన్‌. కానీ ఆ కారణంతో అయితే తాము కలవలేదని చెబుతారు. ‘కొరటాలతో ఉన్న పరిచయంతో మహేశ్‌ను కలిశాం. ఎందుకో తెలియదు ఆయనకు మేం నచ్చాం. ఇదంతా మా లక్‌ అంతే” అంటారు నవీన్‌.

మహేశ్‌తో బంధమెలా?

అచ్చొచ్చిన దర్శకుడు కొరటాలతోనే ఆ మరు సంవత్సరమే  రెండో సినిమా చేశారు.  జూ. ఎన్టీఆర్‌, మోహన్‌ లాల్‌ వంటి అద్భుత నటులతో తెరకెక్కించిన జనతా గ్యారేజ్‌ కూడా  బ్లాక్‌ బస్టర్‌గానే నిలిచింది. రూ.40-50 కోట్లతో తెరకెక్కిస్తే.. దాదాపుగా రూ.140 కోట్లు వసూలు చేసింది.

రెండోదీ బ్లాక్‌బస్టరే

2018లో ఇంటెలిజెంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ దర్శకత్వంలో ‘ రంగస్థలం’ తెరకెక్కించారు. రూ.60 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా రూ. 216 కోట్లతో వసూళ్ల సునామీ సృష్టించింది.

బ్లాక్‌బస్టర్‌ హ్యాట్రిక్‌

నవీన్ యేర్నేని ఆర్నెళ్లు ఇండియాలో ఉంటే ఆర్నెళ్లు అమెరికాలో ఉంటారు. ప్రాజెక్ట్‌ ఓకే చేయడం, ఫైనాన్షియల్‌ పనులు, పోస్ట్‌ ప్రొడక్షన్‌, ఆ తర్వాత సినిమా ప్రమోషన్‌ నవీన్‌ చూసుకుంటారు. ఆయనకు మోహన్‌ సాయపడతాడు. రవిశంకర్ సెట్‌లో పనులు చూసుకుంటారు.

హ్యాట్రిక్‌ కొట్టిన ఈ త్రయంలో ఎవరేం చేస్తారు?

రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్‌ కొట్టిన 2018లోనే ‘మైత్రి’ ఓటమి రుచేంటో కూడా తెలిసింది. చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్యతో తెరకెక్కించిన సవ్యసాచి, శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజా హీరోగా వచ్చిన అమర్‌ అక్బర్‌ ఆంటోనీ బాక్సాఫీస్‌ వద్ బొక్కబోర్లా పడ్డాయి.

ఓటమి రుచి

ఆ తర్వాత 2019లో చిత్రలహరి, డియర్‌ కామ్రేడ్, గ్యాంగ్‌ లీడర్‌, మత్తు వదలరా సినిమాలు చేశారు. ఇందులో మత్తు వదలరా కేవలం రూ.2.1 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి విజయం సాధించారు.

2021లో ‘ఉప్పెన’ వంటి చిన్న సినిమాతో టాలివుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే గాక,‘పుష్ప’ఇండియన్ బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టారు. అల్లు అర్జున్ కెరీర్‌ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడమే గాక, ఒక్కసారిగా ఆయన్ను పాన్ ఇండియా స్టార్‌ను చేసిన సినిమా అది.

పాన్ ఇండియా లెవెల్‌

పుష్పతో ‘మైత్రి’ పేరు దేశంలోనే కాదు ప్రపంచమంతా మార్మోగింది. సుకుమార్‌ డైరెక్షన్‌, అల్లు అర్జున్ నటనకు తోడు ప్రపంచమంతా పాపులర్‌ అయిన దేవీ శ్రీ ప్రసాద్ పాటలు మైత్రికి ఘన విజయాన్ని అందించాయి.

2022లో మహేశ్‌ బాబుతో మరోసారి జతకట్టి సర్కారు వారి పాట తీశారు. ఇది బాక్సాఫీస్‌ వద్ద విజయం సాధించింది. కానీ ఆ తర్వాత ఆ ఏడాది వచ్చిన మిగతా మూడు సినిమాలు అంటే సుందరానికి, హ్యాపీ బర్త్‌డే, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నాయి.

2022 సినిమాలు

ఈ యేడాది  ‘వాల్తేరు వీరయ్య’,‘ వీర సింహారెడ్డి’ రెండూ బాగా ఆడాయి. ‘రంగస్థలం’ టైంలోనే చిరంజీవితో సినిమా చేయాలని ఫిక్స్‌ అయిన ‘మైత్రి’, వాల్తేరు వీరయ్యతో ఆ పని పూర్తిచేసింది.

2023 మైత్రిదే

మరికొద్ది రోజుల్లో కల్యాణ్‌ రామ్ ‘అమిగోస్‌’ రిలీజ్‌కు సిద్ధం కానుండగా… విజయ్‌ దేవరకొండ, సమంత నటిస్తున్న ‘ఖుషీ’ త్వరలో మరో షెడ్యూల్‌ చిత్రీకరణ పూర్తి చేసుకోబోతోంది.

మైత్రికి దిల్‌రాజుతో గొడవలు అయ్యాయని వీరికి చెడిందని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే దిల్‌రాజు మాట్లాడుతూ వ్యాపారంలో చిన్న చిన్న మనస్పర్దలు సహజమేనని తాము బాగానే ఉన్నామని చెప్పారు.

అల్లు అరవింద్‌, దిల్‌ రాజుతో ఎలా?

మైత్రి మూవీ మేకర్స్‌ నుంచి త్వరలో బాక్సాఫీస్‌ను బద్దలుకొట్టే సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.

ఇండస్ట్రీని షేక్‌ చేయబోయే సినిమాలు

‘పుష్ప-2’...! సుకుమార్‌, అల్లు అర్జున్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పుడు ఇండియాలోనే మోస్ట్‌ అవెయిటెడ్‌ సినిమాల్లో ఒకటి. సుకుమార్‌ అత్యంత పక్కాగా ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నాడు. మొదటి పార్ట్‌కు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా కథలో మార్పులు కూడా చేస్తున్నాడు. త్వరలో వైజాగ్‌లో ఈ సినిమా మరో షెడ్యూల్‌ ప్రారంభం కాబోతోంది.

పుష్ప-2

హరీశ్ శంకర్‌, పవన్ కల్యాణ్ క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ‘గబ్బర్‌ సింగ్‌’ 100 రెట్లు ఉంటుందని నవీన్‌ యేర్నేని నమ్ముతున్నాడు. పక్కా కమర్షియల్‌ మూవీగా ఈ సినిమా బాక్సాఫీస్‌ రికార్డులను తిరగరాస్తుందని ధీమాగా ఉన్నారు.

ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌

KGF సినిమాలతో పాన్ ఇండియా డైరెక్టర్‌గా ఎదిగిన ప్రశాంత్‌ నీల్‌, RRRతో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న NTR కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికైతే ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక ఈ సినిమాకు వస్తారు. అలాగే NTR కూడా కొరటాల శివతో సినిమా చేయాల్సి ఉంది.

NTR31

చిన్న బడ్జెట్‌తో అవకాశమిస్తే బ్లాక్‌ బస్టర్‌ విజయమిచ్చి నిరూపించుకున్న బుచ్చిబాబు సానతో మైత్రి ఈ సారి భారీ సినిమా చేయబోతోంది. RRRతో ఎన్టీఆర్‌తో పాటు పేరుతెచ్చుకున్న మరో హీరో రామ్‌చరణ్ ఇందులో హీరోగా నటించబోతున్నారు.

RC16

ప్రభాస్‌, హృతిక్‌ రోషన్‌, దర్శకుడు సిద్దార్థ్‌ ఆనంద్‌.. ఈ కాంబినేషన్‌లో ఇండియన్‌ సినీ చరిత్రలోనే అత్యంత భారీ చిత్రాన్ని మైత్రి తెరకెక్కించబోతోంది. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు గానీ దాదాపుగా ఫిక్స్‌ అయినట్లే తెలుస్తోంది.

భారత సినీ చరిత్రలోనే అతిపెద్ద సినిమా

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తోనూ తాము కచ్చితంగా సినిమా చేస్తామని నవీన్‌ యేర్నేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. అది ఎప్పుడు వస్తుందో… ‘మైత్రి మూవీ మేకర్స్‌’  బాక్సాఫీస్‌ను ఎలా శాసించబోతున్నారో వేచి చూడాలి.

మరిన్ని వెబ్‌స్టోరీస్‌ కోసం లింక్‌పై క్లిక్‌ చేయండి