NAATU NAATU  జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్ గతంలో వేసిన ‘నాటు’ స్టెప్పులు తెలుసా!

YouSay Short News App

ఆర్ఆర్ఆర్ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కడంతో సినీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.  ఈ అవార్డు పొందిన తొలి భారతీయ చిత్రం కావడంతో నెట్టింట ‘ఆర్ఆర్ఆర్’ మేనియా నడుస్తోంది.

పాట ఒక ఎత్తు అయితే, ఇందులో ఎన్టీఆర్, రామ్‌చరణ్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మరొక ఎత్తు. ఇందులోని స్టెప్పులు ఎంతో ఫేమస్ అయ్యాయి. అయితే, ఇదివరకు ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు ఇరగదీసిన నాటు డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌లేంటో  ఓ లుక్కేద్దాం.

రచ్చ సినిమాతో తనలోని డ్యాన్సర్‌ని పరిచయం చేశాడు రామ్‌చరణ్. ఇందులోని అన్ని పాటల్లో చక్కగా కాలు కదిపాడు. ముఖ్యంగా ‘డిల్లకు డిల్లకు డిల్లా’ పాటలో మాస్ స్టెప్పులతో మైమరిపించాడు.

ws_Dillaku Dillaku Telugu Song Lyrics - Racha (2012)

నాయక్ సినిమాలోని ‘లైలా ఓ లైలా’ పాటకు మెగాపవర్ స్టార్ స్టెప్పులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. కాళ్లను బెండ్ చేస్తూ చేసిన డ్యాన్స్‌ ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

ws_maxresdefault (9)

ఎవడు సినిమాలోని మూడు పాటల్లో చెర్రీ కాలు కదిపాడు. ముఖ్యంగా ‘ఫ్రీడం’ సాంగ్‌లో చరణ్ ఇరగదీశాడు. ఈ పాటలో రాంచరణ్ డ్యాన్స్ చూసి సల్మాన్ ఖాన్ ఆశ్చర్యపోయాడట.

ws_maxresdefault (10)

ధృవ సినిమాతో లుక్కును మార్చిన రాంచరణ్ నిజమైన పోలీస్ ఆఫీసర్‌లా కనిపించాడు. ఇందులోని ‘నీతోనే డ్యాన్స్ టునైట్’ పాటలో డ్యాన్స్‌తో చెర్రీ కుమ్మేశాడు.

ws_maxresdefault (11)

వినయ విధేయ రామ సినిమాలోని ‘ఏక్ బార్..  ఏక్ బార్’ సాంగ్‌లో చరణ్ అదరగొట్టాడు. ముఖ్యంగా పడుకుని చేసే ఆ ఫ్లోర్ మూమెంట్ బాగా పాపులర్ అయింది.

ws_maxresdefault (12)

రంగస్థలంలోని ఐటమ్ సాంగ్‌లో చెర్రీ వేసిన స్టెప్పులు మాస్ ఆడియెన్స్‌కి మత్తెక్కించాయి. లుంగీపై చేయడంతో పక్కా నాటుగా కనిపించాయి. మిగతా పాటల్లోనూ చెర్రీ అదిరిపోయేలా స్టెప్పులేశాడు.

ws_maxresdefault (13)

కెరీర్ ఆరంభం నుంచే డ్యాన్సర్‌గా ఎన్టీఆర్ పేరు సంపాదించాడు. డ్యాన్స్ కొరియోగ్రఫర్‌లు ఎన్టీఆర్‌ని సింగిల్ టేక్ డ్యాన్సర్ అంటూ కొనియాడతారు. రిహార్సల్స్ చేయకుండానే  తారక్ సెట్స్‌లోకి వచ్చేస్తాడు.

ఎన్టీఆర్ కెరీర్‌లో డ్యాన్స్ పరంగా గుర్తుండి పోయేది ‘నైరే నైరే’ పాట. లావుగా ఉన్నప్పటికీ తారక్ స్టెప్పులతో అదరగొట్టేశాడు. ఆంధ్రావాలా సినిమాలో ఉంది.

ws_maxresdefault (14)

యమదొంగ సినిమాలోని ‘నాచోరే నాచోరే’ సాంగ్‌ కూడా ఎన్టీఆర్‌కు ప్రత్యేకం. చాలా హుషారుగా వేసే స్టెప్పులు.. ఫ్యాన్స్‌కి కూడా ఉత్సాహం నింపుతాయి.

ws_maxresdefault (15)

టెంపర్ సినిమాలోని టైటిల్ సాంగ్‌లో కూడా ఎన్టీఆర్ విశ్వరూపం చూపించాడు. ముఖ్యంగా ఫ్లోర్‌పై డ్యాన్స్ చేస్తూ వెనక్కి వెళ్లే స్టెప్పు బాగా పాపులర్ అయింది.

ws_maxresdefault (16)

అదుర్స్ సినిమాలోని టైటిల్‌సాంగ్‌లోనూ ఎన్టీఆర్ స్టెప్పులతో అలరించాడు. ఒంటికాలిపై కూర్చుని వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

ws_maxresdefault (17)

రభస సినిమాలోని ‘గరం గరం చిలక’ పాటలోనూ తారక్ డ్యాన్సుతో ఇరగదీశాడు. సింపుల్‌గా వేసిన స్టెప్పులు ఎంతో ఆకట్టుకున్నాయి.

Jr Ntr Rabhasa Movie New Latest Stills Samantha Pranitha

అరవింద సమేత వీర రాఘవ సినిమాలోని ‘రెడ్డీ ఇక్కడ సూడు’ సాంగ్‌లో స్టైలిష్‌గానూ కనిపిస్తూ తారక్ స్టెప్పులు ఇరగదీశాడు.

Jr NTR, Pooja Hegde in Aravinda Sametha Reddy Ikkada Soodu Song HD Stills