శ్రద్ధా వాకర్ హత్య కేసులో  అఫ్తాబ్‌కు నార్కో టెస్టు

YouSay Short News App

దిల్లీలో ప్రియురాలిని ముక్కలుగా నరికి హత్య చేసిన ఘటనలో నిజ నిర్ధారణ కోసం నిందితుడు ఆఫ్తాబ్ కు నార్కో అనాలసిస్ టెస్ట్ చేయనున్నారు. ఈ కేసులో ఇది కీలకంగా మారనుంది. అసలు నార్కో టెస్ట్ అంటే ఏమిటీ ? ఇప్పటివరకు ఎప్పుడైనా చేశారా ? ఎలాంటి సందర్భాల్లో ఈ పరీక్ష చేేస్తారు ? తెలుసుకోండి

అసలేంటీ నార్కో టెస్ట్?

నార్కో అనాలసిస్ టెస్ట్‌ను నిజ నిర్ధరణ పరీక్ష అంటారు. కొన్ని కేసుల్లో సరైన ఆధారాలు దొరకనప్పుడు దీనిని ఉపయోగిస్తారు. దర్యాప్తు అధికారులు,  వైద్యులు, మానిసిక వైద్య నిపుణుల సమక్షంలో నిర్వహిస్తారు.

నార్కో టెస్ట్

ఎవరి నుంచి అయితే వాస్తవాలు రాబట్టాలనుకుంటామే ఆ వ్యక్తిని కంప్యూటర్ ముందు పడుకోబెట్టి విజువల్స్ చూపిస్తూ అతడికి సోడియం పెంటోథాల్ ఇంజిక్షన్ ఇస్తారు. దీనిని ‘ట్రూత్ సిరం’ అని కూడా అంటారు.

ఎలా చేస్తారు

సోడియం పెంటోథాల్ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వారు మనసుపై నియంత్రణ కోల్పోతారు. సగం స్పృహలో సగం మత్తులో ఉన్నట్లుగా ఉంటారు. ఆలోచనా శక్తి మందగించినప్పుడు దర్యాప్తు అధికారులు ప్రశ్నిస్తారు. ఆలోచించుకునే సామర్థ్యం ఉండదు కనుక నిజాలు చెప్పే అవకాశం ఉంటుంది.

ఏం జరుగుతుంది

నార్కో టెస్ట్ చేస్తున్నప్పుడు సదరు వ్యక్తులు చెప్పింది నిజమేనని భావించలేం. ఎందుకంటే కొందరికి ట్రూత్ సిరం పనిచేయదు. అలాంటి సమయంలో వారు నియంత్రణలో ఉండి సమాధానం మార్చి చెప్పే అవకాశం కూడా ఉంటుంది.

నిజాలే చెప్తారా ?

నార్కో పరీక్ష చేస్తున్న వ్యక్తి మెడికల్‌గా ఫిట్ ఉన్నప్పుడే వారికి ఇంజక్షన్ ఇస్తారు. వ్యక్తి జెండర్, వయస్సు, ఆరోగ్య పరిస్థితిని బట్టి డోస్ ఇస్తారు. కొంచెం డోస్ ఎక్కువైనా వారు కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది.

ఎవరికైనా ఇవ్వొచ్చా

ఎవరికిపడితే వారికి నార్కో టెస్ట్  చేయడం చట్ట విరుద్ధం. సదరు వ్యక్తి ముందస్తు అనుమతి లేకుండా పరీక్ష నిర్వహించకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కానీ, కొన్ని ప్రత్యేకమైన కేసుల్లో చేయవచ్చని వెల్లడించింది. అప్పుడు వారి మాటలను రికార్డ్ చేసి న్యాయమూర్తికి ఇవ్వాలి.

దేశంలో అనుమతి

నార్కో పరీక్ష ద్వారా తీసుకున్న ఆధారాలను కోర్టులు పూర్తిగా పరిగణించవు. నిందితులు నియంత్రించుకునే ప్రమాదం ఉన్నందున పూర్తిగా పరిగణలోకి తీసుకోవు. కానీ, కొన్ని సందర్భాల్లో వాస్తవాలేనని నమ్ముతుంది.

నార్కో సాక్ష్యం చెల్లుతుందా ?

2002లో గుజరాత్ అల్లర్ల కేసులో తొలిసారి నార్కోటెస్ట్‌ను ప్రయోగించారు. 2003లో స్టాంప్ పేపర్ కుంభకోణంలో అబ్ధుల్ కరీం తెల్గీకి పరీక్ష నిర్వహించారు. దిల్లీ వ్యాపారి అరుణ్ టిక్కూ కేసులో పరీక్షించారు.

నార్కో టెస్ట్ సందర్భాలు

2007 హైదరాబాద్ పేలుళ్ల కేసులో నిందితులకు నార్కో టెస్‌ చేశారు. 26/11 మారణహోమానికి సంబంధించి కసబ్ నుంచి కూడా ఆధారాలు రాబట్టారు. మరికొన్ని కేసుల్లోనూ నార్కో  పరీక్షలు చేశారు.

మరిన్ని కేసుల్లో

శ్రద్ధా వాకర్‌ను 35 ముక్కలుగా నరికి హత్య చేసిన ఆఫ్తాబ్, కేసును తప్పుదారి  పట్టించే ప్రయత్నం చేశాడు. నిజం ఒప్పుకున్నప్పటికీ పొంతన లేని సమధానాలు చెబుతుండటంతో నార్కో పరీక్ష చేయనున్నారు.

ఆఫ్తాబ్‌కు నార్కో పరీక్ష