నేషనల్‌ క్రష్  రష్మిక మందన్నా కాంట్రవర్సీలు

YouSay Short News App

నేషనల్‌ క్రష్‌గా మారిన హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా నిలుస్తోంది. టాలీవుడ్‌, కోలీవుడ్‌ ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది.

ఆమె తప్పుగా మాట్లాడుతుందో… లేదంటే ఏం మాట్లాడినా తప్పులు వెతుకుతున్నారో కానీ కాంట్రవర్సీల్లో చిక్కుకుంటోంది. తాజాగా దక్షణాది సినిమాల్లో పాటలపై చేసిన కామెంట్లు రచ్చ చేస్తున్నాయి.

కన్నడలో కిర్రిక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా హీరో రక్షిత్‌ శెట్టితో ప్రేమలో పడింది. ఇద్దరూ నిశ్చితార్థం చేసుకున్న కొద్దిరోజులకే విడిపోవటంతో రక్షిత్‌ ఫ్యాన్స్‌ తెగ ట్రోల్ చేశారు.

ఆదిలోనే అట్టర్‌ ఫ్లాప్

కిర్రిక్ పార్టీ హిట్‌తో తెలుగు ఆఫర్లు వచ్చాయి. విజయ్‌తో గీతగోవిందం, డియర్ కామ్రెడ్‌లో నటించింది. ఇద్దరి మధ్య రొమాన్స్‌ ఘాటుగా ఉండటంతో ఇదే బ్రేకప్‌కి కారణమంటూ ఆడుకున్నారు.

బ్రేకప్‌ రూమర్స్‌

వరుస సినిమాలతో బిజీ అయినప్పటికీ విజయ్‌తో ప్రేమాయణం కొనసాగిస్తుందని టాక్. వీరిద్దరూ ఒకే దేశానికి వెకేషన్‌కు వెళ్లటం, అక్కడ ఆనంద్‌ దేవరకొండ పెట్టిన ఫొటోలు మార్మోగి మరోసారి వార్తల్లో నిలిచారు.

విజయ్‌తో ప్రేమాయణం

డియర్ కామ్రెడ్ ఆడియో ఫంక్షన్‌లో రష్మిక ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. అభిమానుల్ని అరేయ్ పిలిచి వివాదానానికి తెర తీశారు. దీంతో నెటిజన్లు మరోసారి ట్రోల్స్‌కు పని చెప్పారు.

అరేయ్ అంటే ఊరుకుంటామా?

రష్మికకు మెుదటి అవకాశం ఇచ్చింది రిషబ్ షెట్టి. ఆయన నటించిన కాంతారాపై అడిగిన ప్రశ్నకు రష్మిక చూడలేదంటూ సమాధానం ఇచ్చింది. దీంతో అవకాశం ఇచ్చిన వ్యక్తికి కనీస కృతజ్ఞత ఇవ్వలేదని విమర్శలు చేశారు.

కాంతారా కాంట్రవర్సీ

సినిమా రిలీజ్‌ అయిన మూడ్రోజులకు అడిగారు కనుక చూడలేదు అన్నాను. తర్వాత బాగుందని కాంతార టీంకు మేసేజ్‌ చేశాను వాళ్లు రిప్లై ఇచ్చారంటూ క్లారిటీ ఇచ్చారు.

ఎట్టకేలకు వివరణ

సామాజిక మాధ్యమాల్లో తనపై ఏదో ఒక విషయంలో విమర్శలు చేస్తున్నారని. నిత్యం తన జీవితంలో ఏం జరుగుతుందో కెమెరా ముందు పెట్టలేనంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ సౌత్‌ సినిమాల్లో పాటలపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. రొమాంటిక్ పాటలంటే బాలీవుడ్‌ అని ,దక్షిణాదిలో మాస్, ఐటెమ్ నంబర్స్‌ ఎక్కువ ఉంటాయన్నారు.

పాటల పంచాయితీ

ప్రస్తుతం రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలపై నెట్టింట్లో పెద్ద రచ్చే జరుగుతోంది. ఆమెను నెటిజన్లు ఏకిపారేస్తున్నారు.

కన్నడ నుంచి తెలుగు రాగానే అక్కడి వారిని ఇప్పుడు బాలీవుడ్‌లోకి వెళ్లగానే తెలుగుపై విమర్శలా? తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్నావా అంటూ ఆగ్రహానికి గురవుతున్నారు.

తిన్నింటి వాసాలు

రష్మిక మందన్నా కావాలానే చేస్తుందని కొంతమంది అంటుంటే, తను సాధారణంగా మాట్లాడిన వాటిని కాంట్రవర్సీ చేస్తున్నారని కొందరు మద్దతు ఇస్తున్నారు.

కావాలానే చేస్తుందా?