2023లో రసవత్తరంగా దేశ రాజకీయం: 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు

YouSay Short News App

గతేడాది రాజకీయ ప్రస్థానం వాడీ వేడీగానే సాగింది. ఎన్నికలు, పాదయాత్రలు, విమర్శలతో. రానున్న ఏడాది కూడా రసవత్తరంగానే కొనసాగే అవకాశాలు ఉన్నాయి.

లోక్‌సభ ఎన్నికల వ్యూహాలు, 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు, భాజపా వ్యతిరేక కూటముల పైఎత్తులతో పార్టీలు సమరశంఖం పూరించనున్నాయి.

కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ 2023లోనూ రాజకీయ యుద్ధాలు తప్పవనే చెప్పాలి. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు సెమీఫైనల్‌ లాటింది.

రాజకీయ యుద్ధం

2024లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నేతలు వ్యూహాలకు పదును పెట్టనున్నారు. ఇప్పటికే కసరత్తులు ప్రారంభించారు.

ఎన్నికలకు సమాయత్తం

వచ్చే ఏడాది దాదాపు 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలో పోలింగ్ జరగనుంది.

9 రాష్ట్రాల్లో పోలింగ్‌

అన్ని సవ్యంగా జరిగితే జమ్ము కశ్మీర్‌లోనూ ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇది కూడా రాజకీయంగా ఓ సంచలనం సృష్టించవచ్చు.

జమ్ము కశ్మీర్‌లోనూ

రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలో ఉంది. అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో గెలిచిన జోష్ కొనసాగించాలని యోచన.

అస్థిత్వం కోసం హస్తం

BRS స్థాపనతో జాతీయ రాజకీయాల్లోకి వెళ్లిన కేసీఆర్‌కు, రాష్ట్రంలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు.

తెలంగాణలో రణమే

BRS,  భాజపా మధ్య రణరంగమే జరగనుంది. ఎన్నికల సమయానికి తారాస్థాయికి చేరే అవకాశాలు లేకపోలేదు.

త్రిపురలో పాగా వేసేందుకు తృణమూల్ కాంగ్రెస్‌ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ఇప్పటికే అక్కడ చక్రం తిప్పుతున్నాడు.

తృణమూల్‌ X భాజపా

దీంతో భాజపాకు త్రిపుర ఎన్నికలు ముళ్ల కంచెపై నడకలాంటిది.

భాజపాకు వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు ప్రతిపక్షాలన్ని ఇప్పటికే ఏకం అయ్యాయి. దీనిపై ఈ ఏడాది కూడా మరింత లోతుగా వెళ్లి కమలదళాన్ని ఢీకొట్టనున్నాయని టాక్.

ప్రాంతీయ పార్టీల హవా

మరికొన్ని వార్తల కోసం YouSay App  డౌన్‌లోడ్ చేయండి