YouSay Short News App

తెలుగులో టాప్‌ స్క్రీన్ రైటర్స్‌

నేషనల్‌ స్క్రీన్‌ రైటర్స్‌ డే

స్వయంవరం సినిమాతో కథా రచయితగా తన ప్రయాణాన్ని ప్రారంభించి  నువ్వే కావాలి , నువ్వు నాకు నచ్చావ్ , వాసు లాంటి ఎన్నో సినిమాలకి మాటలు,కథలను అందించి, నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడుగా మారి , అప్పటి నుంచి అల వైకుంఠపురంలో దాకా ఎన్నో హిట్స్ ని అందుకున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్

శాంతినివాసం అనే సీరియల్‌తో దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి తర్వాత రోజుల్లో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశారు. స్టూడెంట్ నం.1 నుంచి ఇటీవల వచ్చిన RRR  వరకు అన్నీ విజయాలనే పొందారు.

ఎస్ ఎస్ . రాజమౌళి

విజయేంద్ర ప్రసాద్ జానకి రాముడు సినిమాతో రచయితగా పరిచయం అయ్యారు. ఎన్నో అవార్డ్స్ ని సొంతం చేసుకొని తన కుమారుడు ఎస్ ఎస్ రాజమౌళి చేసే ప్రతి సినిమాకి విజయేంద్ర ప్రసాదే కథలను అందిస్తుంటారు.

విజయేంద్ర ప్రసాద్

బద్రి సినిమాతో కథ రచయితగా, దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆయన తీసే ప్రతి సినిమాలో హీరోకి చాల ప్రాముఖ్యత ఇస్తారు. తనదైన రీతిలో తాను అనుకున్నది చూపించటం ఆయన నైజం.

పూరి జగన్నాధ్

ప్రేమ కోసం సినిమాతో కథ రచయితగా పరిచయం అయ్యారు. అలా ఎన్నో సినిమాలు రాయగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో దర్శకుడుగా మారారు. ఆయన రాసే కథలలో ఎంతో దమ్ము ఉంటుంది.

వక్కంతం వంశీ

కొరటాల శివ గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా తో కథ రచయితగా పరిచయం అయ్యారు. ఆయన రాసే ప్రతి సినిమా లో సెంటిమెంట్ ఎక్కువ గా ఉంటుంది అలానే కథ అకరిలో ఒక మెసేజ్ ఇవ్వటం ఆయన స్టైల్.

కొరటాల శివ

తనికెళ్ళ భరణి గారు 52 సినిమాలకి స్క్రీన్ రైటర్‌గా పని చేశారు. లేడీస్ టైలర్ సినిమాతో కథ రచయితగా పరిచయం అయ్యారు. అలానే ఆయన ఒక గొప్ప నటుడు కూడా. ఎన్నో సినిమాలకు కథలు రాసి ఎన్నో పాత్రలు చేశారు. అలానే ఆయన ఎన్నో నాటకాలు ఎన్నో పాటలు రాశారు.

తనికెళ్ళ భరణి

చలిచీమలు అనే సినిమాతో చిత్ర పరిశ్రమకి పరిచయం అయిన ఈ సోదరులు.. అప్పటి నుంచి ఎన్నో సినిమాలకి మాటలు, కథలు అందించారు. కాయ్ రాజా కాయ్ సినిమాతో దర్శకులుగా మారారు. హీరోకి, దర్శకుడికి కావాల్సినట్లు రాయటం వాళ్ళ స్టైల్.

పరుచూరి బ్రదర్స్

ఈయన పుస్తక రచయిత అలానే స్క్రీన్ రైటర్ కూడా.స్ఫూర్తిని నింపే ఆయన రచనలు చాలా ఫేమస్. ఆయన రాసిన పుస్తకాలను కథలు రూపంలోకి మార్చి చిత్రాలను తీశారు. ఆయన ఒక ఊరి కథ అనే సినిమాకి రచయితగా తెలుగు పరిశ్రమకు పరిచయం అయ్యారు.

యండమూరి వీరేంద్రనాథ్