భారత చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్‌మెరైన్ విశిష్టతలు
భారత్ నౌకాదళం అమ్ములపొదిలోకి ఐదో కలవరి తరగతికి చెందిన జలాంతర్గామి ‘వాగిర్’ చేరింది. ఇండియా చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్‌మెరైన్‌గా గుర్తింపు పొందింది. అంతటి విశిష్టతలున్న వాగిర్ సామర్థ్యంపై ప్రత్యేక కథనం..
1973లో వాాగిర్ తరగతి సబ్‌మెరైన్‌లను తొలిసారి ప్రారంభించారు. అప్పట్లో దీనిని సముద్ర గస్తీ, శత్రు దేశాల జలంతర్గాములపై నిఘా కోసం ఉపయోగించారు. దాదాపు మూడు దశాబ్దాల సేవల అనంతరం దీనిని సర్వీస్ నుంచి 2001లో ఉపసంహరించారు.
3 దశాబ్దాలుగా సేవలు
ప్రస్తుత నౌకాదళం అవసరాలకు అనుగుణంగా దీనిని తీర్చిదిద్దారు. పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో ముంబైలోని మజగావ్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ దీనిని నిర్మించింది.
సరికొత్త హంగులతో నయా వాగీర్
ఐఎన్‌ఎస్ వగీర్‌ను 2020 నవంబర్‌లోనే ఆవిష్కరించగా.. అప్పటి నుంచి ఫిబ్రవరి 2022 వరకు సముద్రంలో ఆయుధాలు, సోనార్లు సహా వివిధ రకాల పరీక్షలు నిర్వహించారు. తాజాగా
ఈ సబ్‌మెరైన్‌ని నౌకాదళానికి అప్పగించారు.
పూర్తి స్వదేశి పరిజ్ఞానంతో నిర్మించిన అత్యాధునిక సబ్‌మెరైన్లలో వాగిర్ ఒకటి. ప్రాజెక్టు 75 కింద నిర్మించిన ఐదో డీజిల్ ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ .
వాగిర్ యుద్ధ నైపుణ్యం
ఐఎన్‌ఎస్ వగీర్ సముద్ర యుద్ధంలో ఆల్ రౌండర్ అని నౌకాదళం పేర్కొంది. దీనికి ‘సాండ్ షార్క్’గా నామకరణం చేసింది. హిందూ మహాసముద్రంలో సేవలందించనున్నట్లు వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యాధునిక సోనార్లను వాగిర్‌లో అమర్చారు.వైర్ గైడెడ్ టార్పిడోలు కూడా ఉన్నాయి. ఈ జలాంతర్గామి నుంచి సబ్ సర్ఫేస్ టూ సర్ఫేస్ క్షిపణులను ప్రయోగించవచ్చు.
యాంటి సబ్‌మెరైన్ వార్‌ఫెర్‌లను సమర్థంగా నిర్వహించగలదు. శత్రుదేశాల జలంతార్గాముల ఉనిఖిపై ఇంటెలిజెన్స్ సేకరణ వంటి నిఘా మిషన్లతో సహా విభిన్న ఆపరేషన్లను చేపట్టగలదు.
ఈ సబ్‌మెరైన్ పొడవు 221 అడుగులు కాగా, వెడల్పు 40 అడుగులు. ఇది నాలుగు శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లతో పనిచేస్తుంది.
వాగిర్ విశిష్టతలు
ఎలాంటి సమస్య లేకుండా 350 అడుగుల లోతు వరకు వెళ్లగలదు. సముద్రంలోపల గంటకు 37 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లె సామర్థ్యం దీని సొంతం.
సముద్ర ఉపరితలంపై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్తూ.. 12,000 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఈ జలాంతర్గామి 50 రోజుల పాటు నిరంతరం నీటిలోనే ఉండగలదు.
ఆధునిక నావిగేషన్, ట్రాకింగ్ సిస్టమ్‌తో నడుస్తుంది.40 కంటే ఎక్కువమంది సైనికులు ప్రయాణించే సౌలభ్యం కలదు.
వాగిర్ భారత దేశ సముద్ర ప్రయోజనాలను మరింతగా పెంచడాని దోహదపడనుంది. నౌకాదళ సామర్థ్యం పెరగనుంది.
నౌకాదళంలో కీలక భూమిక
‘Stealth and Fearlessness’(చొచ్చుకెళ్లే సామర్థ్యం, నిర్భయతే) వాగిర్ ప్రధాన సూత్రం. వాగిర్ రాకతో భారత నౌకాదళం శక్తి పెంపొందటంతో పాటు స్వదేశీ షిప్ బిల్డింగ్ నిర్మాణంలో మరొక ముందడుగు పడింది.