నేడు లేడి సూపర్‌స్టార్ నయనతార పుట్టినరోజు
దాదాపు రెండు దశాబ్దాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తోంది.
భారత చలనచిత్ర పరిశ్రమలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లలో నయన్ ఒకరు.
నయనతార ప్రస్తుతం ఈ స్థితికి చేరుకోవడానికి ఎన్నో ఎత్తు పల్లాలు చవిచూసింది.
నయనతార నట ప్రయాణాన్ని ఒకసారి పరిశీలిస్తే..
భారతీయ చిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక గౌరవం ఉంది.
నయనతారతో సినిమాలు నిర్మించడానికి ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు ఆతృతగా ఎదురు చూస్తుంటారు.
ఫీమేల్ లీడ్ పాత్రలతో సినిమలు చేసి ఎన్నో బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టింది.
దక్షిణాదిన విజయకేతనం
నయనతార పుట్టుకతో మళయాలీ.
మల్లూవుడ్‌లో జయరాం నిర్మించిన ‘మనస్సినక్కరే’(2003) చిత్రంతో ఆరంగ్రేటం చేసింది.
ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో నయన్ పేరు మార్మోగిపోయింది..
ఇక అప్పటి నుంచి నయన్ వెనక్కి తిరిగి చూసుకుందే లేదు.
తెలుగు, తమిళ, కన్నడ చిత్రాల్లో వరుస పెట్టి నటించింది.
అన్ని భాషల్లో ఆమె విజయవంతమైంది.
నయనతార కోలీవుడ్‌ను తన నివాసంగా మార్చుకుంది.
తొలుత సాధారణ హీరోయిన్‌గానే సినిమాల్లో నటించింది.
అనంతరం గ్లామర్ పాత్రలు పోషించి క్రేజ్ తెచ్చుకుంది.
ఆ తర్వాత తన స్టార్‌డమ్‌తో లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగింది.
విమర్శలు
తను పోషించిన గ్లామరస్ పాత్రలతో నయనతార అటు ప్రశంసలను, ఇటు విమర్శలను ఎదుర్కొంది.
తన సినిమాల ఎంపికపై మళయాల చిత్ర పరిశ్రమ నయన్‌ను ఎగతాళి చేసింది.
2010 వరకు నయనతార గ్లామర్ తారగానే మిగిలిపోయింది.
హార్ట్ బ్రేక్స్
ఈ అసాధారణ నటి తన జీవితంలో అతి పెద్ద తప్పిదాలు కూడా చేసింది.
నయనతార వ్యక్తిగత జీవితంలో కూడా కష్ట సమయాలు ఉన్నాయి.
తొలుత తమిళ నటుడు శింబుతో ప్రేమాయణం సాగించింది.
శింబు వీరిద్దరి వ్యక్తిగత ఫొటోలను బయటపెట్టడంతో మనస్తాపానికి గురై అతడిని వదిలించుకుంది.
ఆ తర్వాత నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో ప్రేమ వ్యవహారం నడిపింది.
‘విల్లు’ సినిమా చిత్రీకరణ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
వీరిద్దరి వ్యవహారం ప్రభుదేవా భార్య దృష్టికి వెళ్లడం, ఆమె ప్రభుదేవా నుంచి విడాకులు కోరడం చకచకా జరిగిపోయాయి.
ఈ క్రమంలో ప్రభుదేవా నయనతారను పక్కనబెట్టాడు. ఈ పరిణామంతో నయనతార హతాశయురాలైంది. ఇది నయన్ జీవితంలో ఒక కోలుకోలేని దెబ్బ.
పూర్వ వైభవం
ప్రభుదేవాతో బ్రేకప్ అనంతరం నయనతార సినిమాలకు దూరమైంది.
11 నెలల విరామం తర్వాత ‘రాజారాణి’ సినిమాలో నటించి ఘన విజయం అందుకుంది.
ఇక అప్పటినుంచి తన పాత్రల ఎంపికలో వైవిధ్యం చూసిస్తూ సినిమాలు చేస్తోంది.
లేడీ ఒరియెంటెడ్ సినిమాలకే ప్రాధాన్యం ఇస్తోంది.
మాయా, ఐరా, కొలమావు కోకిల, నేనూ రౌడీనే, ఆరాం, ఇమైక్క నొడిగల్, భాస్కర్ ద రాస్కెల్, పుతియ నియమం తదితర చిత్రాలు చేసింది.
బాలీవుడ్ ఎంట్రీ
నయనతార అన్ని భాషల్లోనూ నటించడం షురూ చేసింది. బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ హీరోగా నటిస్తున్న జవాన్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.
మళ్లీ ప్రేమలో పడింది..
‘నేనూ రౌడీనే’ చిత్ర దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ముచ్చటగా మూడోసారి ప్రేమలో పడింది నయన్.
5 ఏళ్ల సహజీవనం తర్వాత ఇటీవలే వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
పెళ్లి, పిల్లలు
తన జీవితంలో రెండు బ్రేకప్‌లు ఎదుర్కొన్నప్పటికీ చివరగా విఘ్నేష్ నిజమైన ప్రేమను పొందగలిగింది. దీంతోపాటు సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చింది.
దక్షిణ చలన చిత్ర పరిశ్రమంలో నయనతార అత్యధిక పారితోషికం తీసుకుంటోంది. ఒక్కో సినిమాకు దాదాపు రూ.10 కోట్ల నుంచి రూ. 12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.