New Trend In Tollywood: లాఠీలు పడుతున్న స్టార్ హీరోయిన్స్.. దానికోసమేనా?

YouSay Short News App

టాలీవుడ్‌లో నయా ట్రెండ్‌ మెుదలైంది. హీరోయిన్లు ఖాకీ దుస్తుల్లో కదంతొక్కుతున్నారు. పోలీసు పాత్రల్లో అదరగొడుతున్నారు. రీసెంట్‌గా పోలీసు పాత్రల్లో కనిపించిన స్టార్ హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

‘సరిపోదా శనివారం’ సినిమాలో ప్రియాంక మోహన్‌ చారులత అనే కానిస్టేబుల్‌ పాత్రలో కనిపించనుంది.

ప్రియాంక అరుళ్‌ మోహన్‌

‘యేవమ్‌’ మూవీలో సౌమ్య అనే పవర్‌ఫుల్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్రలో చాందిని చౌదరి అదరగొట్టింది.

చాందిని చౌదరి

తన కెరీర్‌లో త్రిష చేస్తోన్న ఫస్ట్ వెబ్‌సిరీస్‌ బృందా. ఇందులో నేరస్తులను వేటాడే పోలీసు అధికారిణిగా ఆమె కనిపించనుంది.

త్రిష

కల్యాణ్ రామ్ ‘NKR21’ సినిమాలో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌ విజయశాంతి వైజయంతీ ఐపీఎస్ పాత్రలో కనిపించనున్నారు. 34 ఏళ్ల తర్వాత పోలీస్‌గా అలరించనున్నారు.

విజయ శాంతి

సత్యభామ అనే ఏసీపీ పాత్రలో కాజల్‌ మెస్మరైజ్‌ చేసింది. గతంలో ఎప్పుడు లేని విధంగా యాక్షన్‌ సీక్వెన్స్‌లో అదరగొట్టింది.

కాజల్ అగర్వాల్‌

'రక్షణ' ఫిల్మ్‌లో కిరణ్‌ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా పాయల్‌ నటించింది. యువతుల సూసైడ్‌ వెనకున్న అగంతకుడ్ని సాహసోపేతంగా పట్టుకుంటుంది.

పాయల్‌ రాజ్‌పుత్‌

తమిళ బ్యూటీ కీర్తి సురేష్‌ ‘సైరెన్‌’ ఫిల్మ్‌లో ఇన్‌వెస్టిగేటివ్‌ పోలీసు ఆఫీసర్‌ నందినిగా కనిపించి ఆకట్టుకుంది.

కీర్తి సురేష్‌

‘కోటబొమ్మాళి పీఎస్‌’ సినిమాలో మహిళా కానిస్టేబుల్‌ కుమారి పాత్రలో శివాని అద్భుత నటన కనబరిచింది.

శివాని రాజశేఖర్‌

‘పులిమేక’ సిరీస్‌లో తొలిసారి పోలీసు అధికారిణిగా లావణ్య నటించింది. ఇందులో ఆమె నటనపై ప్రశంసలు వచ్చాయి.

లావణ్య త్రిపాఠి