NIVETHA PETHURAJ:  ఎద అందాలతో ధమ్కీ… విశ్వక్‌సేన్‌ కోసమేనా?

YouSay Short News App

తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ నివేథా పేతురాజ్‌. విశ్వక్‌ సేన్ హీరోగా వస్తున్న దాస్‌ కా ధమ్కీ సినిమా ద్వారా మార్చి 22న మరోసారి ప్రేక్షకులను పలకరించనుంది.

గ్లామర్ క్వీన్

అలా వైకుంఠపురం సినిమా నుంచి కాస్త గ్లామర్ డోస్ పెంచింది ఈ మధురై సుందరి. దాస్‌కా దమ్కీ చిత్రంలోనూ అందాలు ఆరబోసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

తెలుగులోకి ఎంట్రీ

శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘మెంటల్ మదిలో’ చిత్రం ద్వారా తెలుగు తెరపైకి పరిచయం అయ్యింది  ఈ హీరోయిన్.

నటనతో గుర్తింపు

చిత్ర లహరిలో స్వేచ్ఛ క్యారెక్టర్ ద్వారా మంచి గుర్తింపు సంపాదించింది నివేథా. నటనతో ప్రేక్షకులను మెప్పించింది. బ్రోచెవారెవరూ సినిమాలోనూ శాలిని అనే పాత్రలో మెరిసింది.

అల్లు అర్జున్‌తో..

అలా వైకుంఠపురం సినిమాతో గ్లామర్‌ను చూపించింది ఈ సొగసరి. చేసింది చిన్న పాత్రే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయింది.

మంచి పాత్రలు

రామ్ హీరోగా వచ్చిన రీమేక్ రెడ్‌ సినిమాలో పోలీస్‌ క్యారెక్టర్‌తో పాటు పాగల్‌లోనూ హీరోయిన్‌గా మెప్పించింది పేతురాజ్.

హిట్ చిత్రాలు

ఓటీటీ వేదికగా వచ్చిన బ్లడ్ మేరీ చిత్రం ద్వారా హిట్‌ను ఖాతాలో వేసుకుంది. విరాట పర్వంలోనూ గెస్ట్‌ రోల్‌లో చేసింది ఈ యంగ్ హీరోయిన్‌.

విశ్వక్‌ కోసం

ప్రస్తుతం దాస్‌ కా ధమ్కీ చిత్రం ద్వారా సందడి చేయనుంది ఈ అమ్మడు. రెండోసారి విశ్వక్ సేన్ సరసన నటించింది. ఈ చిత్రంలో సూపర్‌ హాట్‌గా కనిపిస్తోంది.

ఉగాదికి రిలీజ్‌

ఉగాది సందర్భంగా దాస్‌ కా ధమ్కీ సినిమాను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ట్రైలర్ ఆకట్టుకోగా అంచానాలు బాగానే ఉన్నాయి.

రేసర్ నివేథా

నివేథా పేతురాజ్‌ మంచి రేసర్‌. ఫార్ములా కార్ రేసులో పాల్గొంటుందట ఈ బ్యూటీ. అజిత్ కుమార్ తర్వాత తమిళ్‌లో ఈ లిస్ట్‌లో చేరిన హీరోయిన్ నివేతానే.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.

Anupama Parameswaran