YouSay Short News App

ఫిఫా ప్రపంచకప్‌‌లో ప్రదర్శన చేసిన ఈ నటి ఎవరు?

నోరా ఫతేహి..

‘నోరా ఫతేహి’.. ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన బాలీవుడ్ నటి. ఫిఫా ప్రపంచకప్‌ ప్రారంభ వేడుకల్లో తన ప్రదర్శనతో ప్రపంచం చూపును తనవైపు తిప్పుకున్న డ్యాన్సర్.

ఇండియాలో పేరు ప్రఖ్యాతులు గడించి ఇప్పుడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగింది.

కెనెడాలో పుట్టి పెరిగిందీ సుందరి. కానీ, పూర్వీకులు ఉత్తరాఫ్రికా దేశమైన మొరాకోకు చెందిన వారు. భారతీయురాలిగా పిలిపించుకోవడానికి ఇష్టపడతానని ఇంటర్వ్యూల్లో నోరా చెబుతూ ఉంటుంది.

ఎక్కడ పుట్టింది?

డ్యాన్సర్‌గా, సహ నటిగా భారత సినీ ఇండస్ట్రీలో తన ప్రస్థానాన్ని మొదలు పెట్టింది నోరా.

కెరీర్

‘ద రోర్: టైగర్స్ ఆఫ్ ద సుందర్‌బన్స్’(2014) సినిమాతో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. తొలి సినిమా ప్రేక్షకుల మెప్పు పొందినా.. నోరాకు ఆ తర్వాత అవకాశాలు రాలేదు.

అరంగేట్రం

డ్యాన్స్‌లో ప్రావీణ్యం ఉండటంతో కెరీర్‌ని అటు వైపు మళ్లించింది తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లోని చాలా ఐటెం సాంగ్స్‌లలో నోరా ఫతేహి తళుక్కుమని మెరిసింది. అందాలను ఆరబోసింది.

డ్యాన్స్ వైపుగా..

టాలీవుడ్‌లోని వివిధ సినిమాల్లో ఐటెం గర్ల్‌గా ఫతేహీ మెరిసింది. బాహుబలి పార్ట్‌1లోని ‘మనోహరి’ సాంగ్; టెంపర్‌లోని ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ సాంగ్‌‌లు బిగ్గెస్ట్ హిట్లుగా నిలిచాయి.

టాలీవుడ్..

2015లో జరిగిన బిగ్ బాస్ తొమ్మిదో సీజనులో వైల్డ్ కార్ట్ ఎంట్రీ ఇచ్చింది. హౌజ్‌లో మూడు వారాల పాటు మనుగడ సాగించింది.

బిగ్‌బాస్‌లో..

2016లో జరిగిన ‘జలక్ దిఖ్‌లా జా’ డ్యాన్స్ రియాలిటీ షో లోనూ నోరా కంటెస్టెంట్‌గా మెరిసింది.

జలక్ దిఖ్‌లా జా

2019లో ఈ అమ్మడి దశ తిరిగింది. సోషల్, డిజిటల్, ప్రింట్ మీడియా.. ఎటు చూసినా  ఈ భామకు విశేషమైన ఫాలోయింగ్ లభించింది.

సత్యమేవ జయతే సినిమాలోని ‘దిల్బర్’ పాటతో నోరా పేరు మార్మోగిపోయింది. 2018లో విడుదలైన ఈ సినిమా పాట నోరా కెరీర్‌కు  ఓ మైలురాయిలా నిలిచింది.

దిల్బర్ విజయంతో..

‘దిల్బర్’ పాటలో నోరా బెళ్లీ డ్యాన్స్ చేయడంతో  ఓ కుదుపు కుదిపేసింది. మధ్యప్రాచ్య దేశాల ప్రాభవం ఉన్న ఈ ఈజిప్షియన్ బెళ్లీ డ్యాన్స్ ప్రేక్షకులను విశేషంగా అలరించింది.

బెళ్లీ డ్యాన్స్..

మ్యూజిక్‌తో పాటు నోరా డ్యాన్స్, అందచందాలు ఆకట్టుకోవడంతో ‘దిల్బర్’ పాట తారాస్థాయికి చేరుకుంది. యూట్యూబ్‌లో ఈ పాటకు 100 కోట్లకు పైగా వీక్షణలు వచ్చాయి.

ఈ సాంగ్‌లో నోరా ప్రదర్శనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రపంచకప్ ఆతిథ్య దేశమైన ఖతర్ అధికారులు నోరా ప్రదర్శనకు ఫిదా అయ్యారు. దీంతో ఫిఫా ప్రారంభ వేడుకల్లో ప్రదర్శన చేసే అవకాశం నోరా తలుపు తట్టింది.

ఈ భామ 2019లో T-Seriesతో భారీ మొత్తానికి కాంట్రాక్టును కుదుర్చుకుంది. ఈ సంస్థ నిర్మాణంలో వచ్చే వెబ్ సిరీస్‌లు, సినిమాలు, పాటల్లో చేయడానికి నోరా సంతకం చేసింది.

T-Seriesతో కాంట్రాక్టు

2020లో విడుదలైన ‘స్ట్రీట్ డ్యాన్సర్- 3డీ’ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో నోరా నటించింది. ఇందులో నోరా నటనకు ప్రశంసలు దక్కాయి.

నటనకు ప్రశంసలు..

మనీ లాండరింగ్‌లో ప్రధాన నిందితుడైన సుఖేష్ చంద్రశేఖర్‌తో సత్సంబంధాలు నెరపడం వల్ల నోరా వివాదాల్లో చిక్కుకుంది.

వివాదాల్లో..

ఈ కేసుకు సంబంధించి పలుమార్లు ఈడీ అధికారులు నోరాను విచారించారు. సుఖేశ్ చంద్రశేఖర్‌తో జరిపిన లావాదేవీలపై ఆరా తీశారు.

ఈడీ విచారణ

టీ సిరీస్ యజమాని భూషన్ కుమార్‌తోనూ రిలేషన్‌షిప్‌లో ఉందన్న రూమర్లు విస్తృతంగా వ్యాపించాయి.

నిజమేనా..

ఏదేమైనా, ఓ చిన్న పట్టణంలో డ్యాన్సర్‌గా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టి.. ఫిఫా ప్రపంచకప్‌లో స్టేజీ ప్రదర్శన చేసే స్థాయికి నోరా ఎదిగింది. నిజంగా  ఈ నటి ప్రస్థానం స్ఫూర్తిదాయకం.

స్ఫూర్తిదాయకం..