నాగ చైతన్యకు సినిమాలే కాదు,

YouSay Short News App

కార్స్, బైక్స్ అంటే ఎంత పిచ్చో తెలుసా!

అక్కినేని నట వారసుడిగా సినిమాల్లోకి అడుగుపెట్టిన నాగ చైతన్య లవ్‌ స్టోరీస్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా తనకంటూ మంచి పేరుతెచ్చుకున్నాడు. అయితే చైతన్యకు సినిమాలే కాదు, సూపర్‌ కార్లు, బైక్‌లు అన్నా పిచ్చి.

రేసర్ గా చైతన్య

చైతూకి సినిమాలతో పాటు కార్లు, బైక్ లు అంటే చాలా ఇష్టం. వాటిపైన ఉన్న ఇష్టం కారణంగానే జోష్ చిత్రంలో బైక్ రేసర్‌గా కనిపించి ప్రేక్షకులను అలరించాడు.

వారాంతాల్లో ఇలా

వారాంతాలతో పాటు వీలు చిక్కిన్నప్పుడల్లా రేసింగ్ ట్రాక్స్ కు వెళ్లటం లేదా రైడ్స్‌తో సరదాగా గడపటం చైతూకి అలవాటు.

కార్లు, బైక్ కలెక్షన్

మార్కెట్‌లోకి ఏదైనా సూపర్ కార్‌, బైక్‌ వచ్చిందంటే నాగ చైతన్య కొనుగోలు చేస్తాడు. అతడి దగ్గర ఈ వాహనాలకు సంబంధించి అదిరిపోయే కలెక్షన్ ఉంది.

బీఎండబ్ల్యూ-R9T

ఇది 2014 లో ఈ బైక్ మార్కెట్లోకి వచ్చింది. దీనిధర సుమారు రూ. 19 లక్షలు ఉంటుంది. సమంతతో  కలిసి ఈ బీఎండబ్ల్యూపైనే విహారయాత్రకు వెళ్లాడు.

చైతూ బైక్ కలెక్షన్

ట్రయంఫ్ థ్రక్స్‌టన్

చైతూ రూ. 13 లక్షలు విలువ చేసే ట్రయంఫ్‌ థ్రక్స‌టన్ బైక్ ను కొనుగోలు చేశాడు. అతడి దగ్గర ఉన్న ఖరీదైన బైక‌లలో ఇది ఒకటి.

ఎంవీ ఆగస్టా F4

ఈ బైక్ ధర రూ. 26 నుంచి 35 లక్షల మధ్య ఉంటుంది. నాగచైతన్యకు అత్యంత ఇష్టమైన వాటిల్లో ఆగస్టాది ప్రత్యేక స్థానం

ఫెరారీ 430

జాన్ సీనా  ,జస్టిన్, సంజయ్ దత్ వంటి పెద్ద పెద్ద స్టార్ల దగ్గర ఈ కార్ ఉంది. కార్లమీద ఉన్న ప్రేమతో నాగచైతన్య ఈ ఫెరారీని కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 1.75 కోట్లు

చైతూ కార్స్ కలెక్షన్

మెర్సిడెస్ బెంజ్ జీ-క్లాస్  G63

రూ. కోటి విలువ చేసే ఈ బెంజ్ కారును చైతూ కొన్నాడు. ఇది చాలామంది సెలబ్రిటీల దగ్గర ఉంది. రామ్ చరణ్, రన్ బీర్ కపూర్, హార్ధిక్ పాండ్యా ఉపయోగిస్తున్నారు.

సోషల్ మీడియోలో ఫొటోలు

సోషల్‌ మీడియాలో నిత్యం కార్స్‌ ,బైక్స్‌ ఫోటోలు షేర్‌ చేస్తుంటాడు. చైతూ  ఇన్ స్టాగ్రామ్‌లో పెట్టిన మెుట్టమెుదటి పోస్ట్ కూడా ఓ స్పోర్ట్స్ కారు ఫొటోనే. దీనిబట్టి వాటిపై ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు.

అప్పట్నుంచే ఇష్టం

చిన్నప్పటి నుంచే కార్లపై మక్కువ పెరిగిందని చైతూ చెబుతుంటాడు. చెన్నైలో ఉన్న రేసింగ్ ట్రాక్‌లో జరిగే ప్రతి ఫార్మూలా రేస్‌లు అన్నింటికి వెళ్లేవాడట.

బైక్ లన్నా మక్కువే

కళాశాల రోజుల్లో బైక్ లంటే ఎక్కువగా ఇష్టం. తర్వాత సెలబ్రిటీ హోదా వచ్చాక బయటకు వెళ్లినప్పుడు వచ్చే ఇబ్బందులతో కార్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నాడట.

కార్లంటే ప్రాణం

చైతూకి ఫెరారీ స్పోర్ట్స్ కారంటే చాలా ఇష్టం. చైతన్య బర్త్ డే కి నాగార్జున ఓ కారు గిఫ్ట్ గా ఇస్తే దానిని రీ మోడల్ చేసుకున్నాడు. అందుకు కావాల్సిన పార్ట్స్‌ని వేరే దేశం నుంచి తెప్పించుకొని మరీ మార్చుకున్నాడు.

రేసింగ్ స్నేహితులు

చైతూకి రేసింగ్ కు సంబంధించి చాలామంది స్నేహితులు ఉన్నారు. సమయం దొరికితే చాలు రేసింగ్ ట్రాక్ అద్దెకు తీసుకొని స్నేహితులతో అక్కడ గడిపేస్తారు.

కార్లు, బైక్ లపై ఉన్న ప్రేమతో చాలామంది వాటికి ముద్దుపేర్లు పెడుతుంటారు. కానీ, చైతూకి అలా అస్సలు నచ్చదు. ఆ కారుకి ఓ పేరు ఉందని..దాన్ని అలా పిలిస్తేనే బాగుంటుందని చెబుతాడు.

ముద్దు పేర్లు