‘నాటు నాటు’ సాంగ్ మాత్రమే కాదు. MM కీరవాణి స్వరపరిచిన టాప్ 10 సాంగ్స్ లిస్ట్ ఇదే

YouSay Short News App

కీరవాణి స్వరపరిచిన RRR మూవీలోని నాటు నాటు పాట ప్రపంచవ్యాప్తంగా దుమ్మురేపింది. ఈ గీతానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా వరించింది. నాటు నాటు పాటతో పాటు కీరవాణి ఎన్నో వీనుల విందైన పాటలను స్వరపరిచారు. వాటిలో టాప్ 10 పాటలు ఓసారి చూద్దాం.

1. ఎత్తర జెండా- RRR

RRRలోని నాటు నాటు పాటతో పాటు   ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మరో పాట ఎత్తర జెండా. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను విశాల మిశ్రా, హారిక నారాయణ్ అద్భుతంగా పాడారు.

2. శివుని ఆనా- బాహుబలి

ఎవడట, ఎవడట సాంగ్ ఆధ్యాత్మికత గల ప్రేక్షకులకు  గూస్ బంప్స్ తెప్పించింది. ఈ పాట సాహిత్యం అలాంటిది మరి. ఈ పాటను కీరవాణి, మౌనిమ ఆలపించారు.

3.నీతో ఉంటె చాలు – బింబిసార

కొత్త డైరెక్టర్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహించిన తెలుగు ఫాంటసీ యాక్షన్ చిత్రం ‘బింబిసార’లోని పాట ‘నీతో ఉంటె చాలు’. శాండిల్య పిసాపతి పాడిన ఈ పాట సంగీత ప్రియులను ఎంతో అలరిస్తోంది.

4. జామురాత్రి జాబిలమ్మ- క్షణక్షణం

రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన క్షణ క్షణం మూవీలోని క్లాసిక్ సాంగ్ ఇది. ఇప్పటికీ.. పాట తెలుగు పాటల్లో మెలోడి హిట్‌గా నిలిచింది.  ఈ పాటను నాగూర్ బాబు, చిత్ర అద్భుతంగా పాడారు.

5. ఎక్కడో పుట్టి- స్టూడెంట్ నంబర్ 1

SS రాజమౌళి తొలి సినిమాలోని ఈ పాట సూపర్ హిట్‌ అయింది. ఇప్పటికీ కాలేజీ కల్చరల్ ఇవెంట్లలో ఈ పాట మోగకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. ఈ పాటను కీరవాణి ఆలపించారు.

6. గుండు సూది.. ఛత్రపతి

'గుండు సూది గుండు సూది.. గుచ్చుకుంటే తప్పునాది పాట కీరవాణి స్వరపరిచిన ఎవర్ గ్రీన్ రోమాంటిక్ సాంగ్. ఈ సాంగ్‌ను కీరవాణి, సునిత అద్భుతంగా పాడారు

7. అదివో అల్లదివో.. అన్నమయ్య

అదివో అల్లదిలో పాట ఇప్పటికీ తిరుమల గిరుల్లో మార్మోగుతూనే ఉంటుంది. ఆ పాట ప్రాశస్త్యం అలాంటింది. అన్నమయ్య సినిమాకు గాను కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ స్థాయిలో అవార్డు పొందారు. ఎస్పీ బాలు ఎంతో చక్కగా ఆలపించారు.

8.అంతా రామ మయం - రామదాసు

ఈ పాట భక్త జనులను ఉర్రూతలూగించింది. ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోయేలా చేసింది.  ఈ గీతాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడారు.

9.  రాలిపోయే పువ్వా నీకు.. మాతృదేవో భవ

మాతృదేవో భవ సినిమాలోని ఈ పాటను కీరవాణి ఎంతో హృద్యంగా ఆలపించారు. ఈ పాట అంటే జూ.NTRకు చాలా ఇష్టమని చెప్పారు. ఈ పాట ఆయన సమక్షంలో తప్ప మరెక్కడ పాడనని ఓ ఇంటర్వ్యూలో కీరవాణి చెప్పారు.

10. పుణ్యభూమి నా దేశం- మేజర్ చంద్రకాంత్

ఈ పాట మేజర్ చంద్రకాంత్ సినిమాలోని దేశభక్తి గీతం. ఇప్పటికీ జాతీయ పండగల వేళ.. తెలుగు రాష్ట్రాల్లో మార్మోగుతూ ఉంటుంది. ఈ పాటను ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం ఆలపించారు.