పవన్‌ కల్యాణ్ #OG పోస్టర్‌లో ఇవి గమనించారా?

YouSay Short News App

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ వీరాభిమాని ఆయన సినిమా తీస్తే ఎలా ఉంటుంది? PK ఫ్యాన్స్‌ ఇప్పుడదే చూడబోతున్నారు సుజిత్‌ దర్శకత్వంలో DVV దానయ్య ప్రొడక్షన్‌ బ్యానర్‌లో ఓ మాస్‌ సినిమాను ఇవాళ అనౌన్స్‌ చేశారు. అయితే సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో కొన్ని క్రేజీ అంశాలున్నాయి. అవేంటో చూడండి

చాలా మందికి పోస్టర్‌ చూడగానే ఇదేంటనే అనుమానం వచ్చుంటుంది. OG అంటే ఒరిజినల్‌ గ్యాంగ్‌స్టర్‌. అంటే పాత పద్ధతుల్లోనే డీల్‌ చేసే అసాధారణ నైపుణ్యం ఉన్న గ్యాంగ్‌స్టర్‌ అన్నమాట. సో ఇది పక్కా గ్యాంగ్‌స్టర్‌ మూవీ.

#OG

‘Fire storm is coming’ అంటే నిప్పు తుపాను వస్తోంది అంటూ జపనీస్‌లో పోస్టర్‌పై రాశారు. జపాన్‌ నేపథ్యంలో సినిమా సాగే అవకాశముండొచ్చు

జపనీస్ పదాలు

పోస్టర్‌లో రెడ్‌, ఆరెంజ్‌, బ్లాక్‌ కలర్లను వాడారు. సాధారణంగా రెడ్‌,బ్లాక్ కలర్స్‌ జీవిత పరమార్థాన్ని, అంతరాత్మను చూపిస్తాయి. ఆరెంజ్ కలర్‌ ఆశావాదాన్ని చూపెడుతుంది. అంటే హీరో క్యారెక్టర్‌ ‘ జాన్ విక్’లా ఉండొచ్చు

కలర్స్‌

సాధారణంగా నీడ అంటే చెడును చూపెడుతుంది. వెలుగును దరిచేరనివ్వనిది అని కూడా అర్థం వస్తుంది. ఆ నీడలో తుపాకి అంటే హీరో జీవితంలో తుపాకీ ఓ చీకటి అధ్యాయమని అర్థం అయ్యుండొచ్చు

నీడలో తుపాకి

అస్తమిస్తున్న సూర్యుడిలోకి పయనం అంటే ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించడం లేదా ఓ అధ్యాయం ముగిసింది అని చూపుతుంది. హీరో క్లైమాక్స్‌లో తుపాకీతో ఉన్న చీకటి అధ్యాయాన్ని వదిలి వెలుగులో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడని అర్థం కావొచ్చు

అస్తమిస్తున్న సూర్యుడిలోకి పయనం

పవన్‌ కల్యాణ్ కాళ్ల కింద కమలం గుర్తును చూపించారు. ఇది కూడా పునర్జన్మను సూచిస్తుంది. ఆ కమలం కూడా నలుపు రంగులో ఇచ్చారు. అంటే చెడు నుంచి పునర్జన్మ అని అర్థం కావొచ్చు

కమలం

కష్టాలు, కోరికలు, ఆశలు లేని జీవితాన్ని పొందడంపై బుద్ధుడు బోధనలు చేశాడు. అంటే సినిమా గన్స్‌, గ్యాంగ్‌స్టర్‌ నుంచి మంచి దిశగా హీరో ప్రయాణం అనిపిస్తోంది.

బుద్ధ విగ్రహం

ముంబయిలోని గేట్‌వే ఆఫ్‌ ఇండియా ఇంకా కొన్ని భవనాలు చూపించారు. సినిమాలో ముంబయి మాఫియా అంశాలు కూడా టచ్‌ చేసి ఉండొచ్చు. పోస్టర్‌లో మీరు ఇంకేేమైనా గమనించారా?

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.