NTR 30 Heroine: సస్పెన్స్ వీడింది… Jr NTRతో రోమాన్స్ చేయనున్న  జాన్వీ కపూర్

YouSay Short News App

జూనియర్ ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న NTR 30 నుంచి అప్డేట్‌ రానే వచ్చింది. ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ జాన్వీ కపూర్.

జాన్వీ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించింది చిత్రబృందం. ఆదివారం సాయంత్రం నుంచి ట్విటర్‌లో NTR 30 హ్యాష్‌ ట్యాగ్‌ను ఫ్యాన్స్‌ హోరెత్తిస్తున్నారు.

ఎదురుచూపులు

ఎన్టీఆర్ తర్వాతి సినిమా గురించి అప్డెట్స్‌ గురించి ఫ్యాన్స్ చాలారోజులుగా ఎదురుచూస్తున్నారు. కొరటాల శివ తెరకెక్కిస్తున్నాడనే విషయం తప్ప మరే విషయం మెున్నటివరకు తెలియలేదు.

కాస్త ఊరట

అమిగోస్ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో కొరటాల మూవీపై ఎన్టీఆర్‌ ప్రకటన చేశారు. త్వరలో సినిమా షూట్‌ చేసి వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేస్తామని చెప్పాడు ఎన్టీఆర్.

వెయిటింగ్‌తో ట్రెండింగ్‌

NTR30కి సంబంధించి సోమవారం అప్డేట్‌ ఇస్తున్నామని వెల్లడించారు నిర్మాతలు. అప్పట్నుంచి ఫ్యాన్స్‌ కనులు కాయలు కాచేలా ఎదురుచూసి హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.

ఫుల్ మీల్స్‌

తారక్ సరసన జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తోందని ప్రకటించారు మేకర్స్‌. దీంతో ఫ్యాన్స్‌ చాలా ఖుషీ అవుతున్నారు.

క్రేజీ కాంబో

తారక్ సరసన జాన్వీ ఓ క్రేజీ కాంబినేషన్. ఎందుకంటే ఆమె తల్లి శ్రీదేవితో సీనియర్ ఎన్టీఆర్‌ ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పుడు శ్రేదేవి కుమార్తెతో ఆయన మనుమడు ఆడిపాడనున్నాడు.

జాన్వీ సినిమాలు

శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ. మరాఠీ చిత్రం సైరాత్ రీమేక్ ధడక్‌లో హీరోయిన్‌గా నటించింది.

నటనలో గుర్తింపు

గుంజన్ సక్సేనా చిత్రంతో నటనలో మంచి గుర్తింపు తెచ్చుకుంది జాన్వీ. నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాలో తన యాక్టింగ్‌తో ప్రేక్షకులను మెప్పించింది.

ఇటీవల విడుదలైన మిలీ సినిమాలోనూ జాన్వీ నటనకు మంచి మార్కులు పడ్డాయి. కానీ,సినిమా పెద్దగా ఆడలేదు.

హిట్‌ కావాలి

జాన్వీకి ఇప్పటివరకు సరైన హిట్ పడలేదు. ఎన్టీఆర్‌ చిత్రంతో హిట్ దక్కితే తెలుగులోనూ వరుసగా ఆఫర్లు క్యూ కడతాయి.

కొరటాలకు కీలకం

ఆచార్య ఫ్లాప్ తర్వాత కొరటాల శివపై రూమర్స్‌ వెల్లువెత్తాయి. చిరంజీవి చేసిన కామెంట్స్‌ కొరటాలను ఉద్దేశించి అన్నట్లుగా ప్రచారం చేశారు. ఇప్పుడు అతడికి హిట్‌ చాలా అవసరం.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.