విరాట్ కోహ్లీ…! ఈ పేరు చెప్పగానే రన్ మెషీన్, పరుగుల రారాజు, చేజింగ్ కింగ్… ఇలా ఎన్నో పర్యాయపదాలు వినిపిస్తాయి. చేజింగ్‌లో విరాట్ ఎలా రెచ్చిపోతాడో అందరికీ తెలిసిందే. కానీ రికార్డుల ప్రకారం ఇప్పటికీ చేజింగ్‌లో విరాట్ కంటే ముందు మరొకరు ఉన్నారు.
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందూల్కర్ రికార్డులు ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటాయి. చేజింగ్‌లోనూ ఈ క్రికెట్ గాడ్ ఇప్పటికీ టాప్‌లో ఉన్నాడు. 124 చేజింగ్ ఇన్నింగ్స్ ఆడిన తెందూల్కర్ 5490 పరుగులు సాధించి అందరికన్నా ముందున్నాడు
సచిన్ తెందూల్కర్
సచిన్ రికార్డులను బద్దలుకొట్టగల అవకాశం, సామర్థ్యం ఉన్న ఒకే ఒక్క ఆటగాడు విరాట్ కోహ్లీ. సెంచరీలు, పరుగులు ఇలా సచిన్ ఏ రికార్డైనా బద్దలు కావాలంటే అది కోహ్లీకే సాధ్యం.
విరాట్ కోహ్లీ
ఇప్పటిదాకా 90 విజయవంతమైన ఛేజింగ్ ఇన్నింగ్స్ ఆడిన విరాట్ మొత్తం 5428 పరుగులు సాధించాడు. చేజింగ్ కింగ్ అనిపించుకునేందుకు అతడు ఇంకా 63 పరుగులు చేయాలి.
ఆస్ట్రేలియా మాజీ సారథి దిగ్గజ క్రికెటర్లలో ఒకడైన రిక్కీ పాంటింగ్ మొత్తం 104 ఇన్నింగ్స్ చేజ్ చేస్తూ ఆడాడు. అందులో 4186 పరుగులు చేసి ఆస్ట్రేలియాకు ఎన్నో మరుపురాని విజయాలు అందించాడు.
రికీ పాంటింగ్
సౌతాఫ్రికా దిగ్గజం కలిస్‌కు ఇండియాలోనూ ఫ్యాన్స్ ఉంటారు. అతడి బ్యాటింగ్ శైలి అలా ఉంటుంది. కలిస్ కూడా చేజింగ్‌లో దుమ్మురేపిన ఆటగాడే. 100 ఇన్నింగ్స్‌లో మొత్తం 3950 పరుగులు చేశాడు.
జాక్వెస్ కలిస్
ప్రస్తుత టీమిండియా కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ కూడా చేజింగ్ మాస్టర్స్ జాబితాలో ఉన్నాడు. 86 ఇన్నింగ్స్ ఆడిన హిట్‌మ్యాన్ రోహిత్…మొత్తం 3897 పరుగులు చేశాడు. కానీ ఫస్ట్ ఇన్నింగ్స్‌లోనే రోహిత్ ఎక్కువగా విధ్వంసకర ఆటను కనబర్చాడు.
రోహిత్ శర్మ
మంగళవారం న్యూజిలాండ్‌తో జరగబోయే వన్డేలో టీమిండియా చేజింగ్‌కు దిగి విరాట్ వీర విహారం చేసి 63 పరుగులు చేయగలిగితే ఇక కింగ్ కోహ్లీ పేరు మరోసారి మార్మోగుతుంది.