లిప్ కిస్‌తో అధికారిక ప్రకటన: పెళ్లి కన్ఫామ్ చేసుకున్న  నరేష్- పవిత్ర

YouSay Short News App

అందరి విమర్శలకు చెక్ పెడుతూ త్వరలోనే వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు నరేష్- పవిత్ర జంట. గత కొంతకాలంగా లివింగ్ రిలేషన్‌లో ఉన్న ఈ రోమాంటిక్ కపుల్  తాజాాగా పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు.

ఓ వీడియో పోస్ట్ చేసి అధికారికంగా ప్రకటించారు. వీళ్ల రిలేషన్‌షిప్ పెళ్లి వరకు ఎలా సాగిందో ఓ సారి చూద్దామా?

పవిత్ర లోకేశ్ - నరేశ్‌. కొద్దికాలంగా సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసిన వీళ్ల పేరే. ఎందుకంటే లేటు వయసులో  ఘాటు ప్రేమలో మునిగి తేలుతున్నారు. దీంతో వీరిపై విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి.

వీరిద్దరి సహజీవనానికి మా ఎన్నికలే కారణమని అంటారు. నరేశ్‌ ప్యానెల్‌లో ఉన్న పవిత్ర ఆయన గెలుపుకోసం చాలా కృషి చేసింది. అక్కడే వీరిమధ్య బంధం బలపడిందని టాక్.

అలా మెుదలైంది

వరుస సినిమాల్లోనూ భార్యభర్తల పాత్రలను పవిత్ర, నరేశ్‌ పోషించారు. సమ్మోహనం, హ్యపీ వెడ్డింగ్, రియల్‌ ఎస్టేట్‌ యాడ్‌లో నటించడంతో వాళ్ల బాండింగ్‌ పెరిగిందట.

భార్యభర్తలు

వీటితో పాటు చాలా చిత్రాల్లోనే నటించారు.

నరేశ్‌తో కలిసి చాలా పార్టీలు, ఈవెంట్లకు పవిత్ర వెళ్లారు. క్రిష్ణ జన్మదిన వేడుకలు, కరాటే కల్యాణి పుట్టినరోజులోనూ సందడి చేయడంతో వీరిమధ్య రిలేషన్ బయటపడింది.

సహజీవనం

మైసూర్‌లోని ఓ లాడ్జ్‌లో ఇద్దరూ కనిపించారు. నరేశ్ మూడో భార్య రెడ్‌ హ్యాండెండ్‌గా పట్టుకొని గొడవ పెట్టింది.

లాడ్జ్‌ వివాదం

పవిత్రని ఇష్టం వచ్చినట్లు దూషించింది. అప్పటి నుంచి వీరిద్దరిపై యూట్యూబ్‌లో తెగ ట్రోలింగ్ నడిచింది.

నరేశ్ భార్య వివాదంతో ఇద్దరు సహజీవనం చేస్తున్నట్లు ఒప్పుకున్నారు. మీడియా, ప్రజల మద్దతు కోరారు.

బయటపెట్టేశారు

వివాదం మెుదలైన తర్వాత ఈ వయసులో ఇదంతా ఏంటి అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వచ్చాయి.

ట్రోల్స్‌ షురూ

కృష్ణ అంత్యక్రియల్లోనూ నరేశ్ ఆమెకు భద్రత కల్పిస్తున్నట్లు రావటంతో నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు.

నరేశ్‌కు ఇప్పటికే మూడు వివాహాలు జరిగాయి. అందరికీ విడాకులు ఇచ్చేశారు. మూడో భార్యతో కూడా లీగల్‌ సమస్యలు వైదలొగినట్లు తెలుస్తోంది.

మూడు పెళ్లిళ్లు

ట్రోల్స్ పెరుగుతుండటం, లీగల్‌ సమస్యలకు  దాదాపు చెక్ పడటంతో వివాహబంధంలోకి అడుగుపెడుతున్నారు.

నవ్వుతూ నాలుగోసారి

న్యూఇయర్‌ కేక్ కట్‌ చేసి లిప్‌లాక్‌ అందరి విమర్శలకు చెక్‌ పెట్టారు. మరి నరేష్ ఈసారైనా పవిత్రతో  స్థిరమైన బంధం కొనసాగిస్తారో లేదో చూడాలి మరి..