OSCAR AWARDS:  ఎవ్రీథింగ్ ఎవ్రీ వేర్ ఆల్ ఎట్‌ వన్స్ చిత్రానికి అత్యధిక ఆస్కార్స్… ఏకంగా 7 పురస్కారాలు

YouSay Short News App

95వ ఆస్కార్ అవార్డుల్లో “ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌” చిత్రానికి అవార్డుల పంట పడింది.  ఏకంగా 7 పురస్కారాలు ఈ సినిమాను వరించాయి.

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్‌ ఎట్ వన్స్‌ సినిమా ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అందుకుంది. అవతార్ 2, టాప్‌గన్ మావెరిక్, ది ఫాబెల్‌మాన్స్ వంటి 10 సినిమాలతో పోటీ పడి విజేతగా నిలిచింది  ఈ సినిమా.

ఉత్తమ చిత్రం

ఉత్తమ దర్శకుడు అవార్డు కూడా ఈ సినిమానే వరించింది. చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్‌లకు ఆస్కార్ ప్రధానం చేశారు.

ఉత్తమ దర్శకుడు

ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్  చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన మిచెల్ యో ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. తన కుటుంబాన్ని కాపాడుకునే పాత్రలో ఒదిగిపోయారు మిచెల్.

ఉత్తమ నటి

ఆస్కార్ ఉత్తమ సహాయ నటుడు, సహాయ నటి అవార్డులు కూడా ఈ సినిమాకే దక్కాయి. ముఖ్యపాత్రల్లో నటించిన కే హ్యూ క్వాన్, జామీ లీ కర్టిస్‌లు తమ ప్రతిభకుగాను పురస్కారాలు అందుకున్నారు.

ఉత్తమ సహాయ నటుడు, నటి

చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించడంతో పాటు గ్రిప్పింగ్‌ స్క్రీన్‌ప్లే అందించిన దర్శకులు డానియల్ క్వాన్, డానియల్ స్కీనెర్ట్‌లు ఆస్కార్ ఉత్తమ స్క్రీన్‌ప్లే అవార్డును సొంతం చేసుకున్నారు.

ఉత్తమ స్క్రీన్‌ ప్లే

ఉత్తమ ఎడిటర్ కేటగిరీలో అద్భుతమైన యాక్షన్ చిత్రాలతో పోటీ పడినా ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్‌ వన్స్ సినిమాకే ఆస్కార్ దక్కింది. పాల్‌ రోజర్‌ ఉత్తమ ఎడిటింగ్ పురస్కారాన్ని అందుకున్నారు.

ఉత్తమ ఎడిటింగ్

ఎవిలిన్ క్వాడ్‌ అనే చైనీస్ వలసదారి.. కుటుంబంతో కలిసి అమెరికాలో ఓ లాండ్రీ షాప్‌ పెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకరోజు ఆమె లాంటి వాళ్లే వేరే ప్రపంచం నుంచి వస్తారు.

అసలేంటి కథ

ఆ మల్టీ వర్స్‌ కలిగించే ప్రమాదాల నుంచి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటుంది. తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటుందనే కథాంశంతో తెరకెక్కించారు.

ఈ క్రమంలో ఎవిలిన్‌ తన గురించి తాను తెలుసుకోవటంతో పాటు ఇతరులపై ప్రభావం చేసే అంశాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుంటుంది.

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.