Oscars 2023: ఉత్తమ చిత్రం బరిలో 10 సినిమాలు.. అవార్డు దేనికి వస్తుందో?
YouSay Short News App
ఆస్కార్ వేడుకకు రెండ్రోజుల సమయం మాత్రమే ఉంది. అవార్డు గెలుచుకోవాలని చాలామంది తహతహలాడుతున్నారు. ఉత్తమ చిత్రంగా దేనికి పురస్కారం వస్తుందో అని ఆసక్తి నెలకొంది.
95వ ఆస్కార్‌కు దాదాపు 10 చిత్రాలు నామినేట్ అయ్యాయి. ఇందులో అవార్డు ఏ సినిమాకు దక్కుతుందో చూడాలి. మరి ఆ సినిమా విశేషాలు తెలుసుకుందామా?
జేమ్స్ కామోరూన్ కళాద్భుతం ఈ చిత్రం. 2009లో వచ్చిన అవాతర్‌కి సీక్వెల్. వసూళ్ల పరంగా అద్భుతాలు సృష్టించింది ఈ సినిమా. ఉత్తమ చిత్రం సహా 4 అవార్డులకు నామినేట్ అయ్యింది.
అవతార్:ది వే ఆఫ్ వాటర్
1986లో వచ్చి టాప్ గన్ చిత్రానికి సీక్వెల్ ఇది. జోసెఫ్ కోసిన్క్సి తెరకెక్కించిన సూపర్ అమెరికన్ యాక్షన్ చిత్రం. ఉత్తమ చిత్రంతో పాటు ఆరు అవార్డులకు నామినేషన్ దక్కించుకుంది.
టాప్ గన్: మావెరిక్
అమెరికన్ రాక్ అండ్ రోల్ గాయకుడు, నటుడు ఎల్విస్ ప్రెస్లీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. బాజ్ లుహర్మాన్ దర్శకత్వం వహించగా బెస్ట్ ఫిల్మ్ సహా 8 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుంది
ఎల్విస్ ప్రెస్లీ
ఈ సినిమాకు ఇప్పటికే క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు వరించాయి.
ఈ సారి అకాడమీ అవార్డుల్లో ఉత్తమ చిత్రం కేటగిరీలో పోటీపడుతున్న మరో సినిమా టార్. టాడ్ ఫీల్డ్ తెరకెక్కించిన ఈ సైకలాజికల్ డ్రామాకు..76వ బ్రిటీష్ అకాడమీ అవార్డుల్లో 5 నామినేషన్లు వచ్చాయి.
టార్ ( TAR )
అమెరికాలోని మెన్నోనైట్ కమ్యూనిటీ అయినా మానిటోబా కాలనీలో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా తీశారు. సారా పోలీ ఈ డ్రామాను అద్భుతంగా తీయటంతో ఉత్తమ చిత్ర విభాగంలో నిలిచింది.
ఉమెన్ టాకింగ్
ఆస్కార్‌కు ఉత్తమ చిత్రంతో పాటు మూడు నామినేషన్లు దక్కించుకున్న చిత్రం ఇది. రూబెన్ ఓస్టండ్ తీసిన సినిమా… కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 5 అవార్డులు సొంతం చేసుకుంది.
ట్రయాంగిల్ ఆఫ్ సాడ్‌నెస్
స్టీవెన్ స్పీల్ బర్గ్ తన బయోగ్రఫీ ఆధారంగా రూపొందించారు. ఆయన తల్లిదండ్రులకు అంకితం చేసిన ది ఫెబెల్‌మాన్స్.. ఉత్తమ చిత్రంతో పాటు 7 నామినేష్లు దక్కించుకున్న సినిమా.
ది ఫెబెల్‌మాన్స్
అకాడమీ అవార్డుల్లో అత్యధికంగా నామినేషన్లు అందుకుంది. బెస్ట్ ఫిల్మ్ సహా 11 నామినేష్లు దక్కించుకుంది ఈ సినిమా. మల్టీవర్స్ ప్రమాదాలపై డేనియల్ క్వాన్, స్కీనెర్డ్ తెరకెక్కించారు.
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
1929లో ఎరిక్ మరియా రీమార్క్ రాసిన నవల ఆధారంగా ఎడ్వర్డ్ బెర్గర్ తీర్చిదిద్దారు. ఆర్మీలో చేరి యుద్ధంలోని అసలు వాస్తవాలు బహిర్గతం చేశాడనే కథాంశంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచింది.
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్ట్రన్
ఇద్దరు చిరకాల మిత్రులు విడిపోయిన అంశంతో తెరకెక్కిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆస్కార్ అవార్డుల్లో 9 నామినేషన్లు దక్కించుకుంది ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్.
ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్
మరిన్ని కథనాల కోసం మా వెబ్‌సైట్ చూడండి. YouSay యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.