Penis Transplantation:  72ఏళ్ల వృద్ధుడికి అంగ మార్పిడి.. జైపుర్‌లో సర్జరీ సక్సెస్

YouSay Short News App

శరీరంలో ప్రతి అవయవం ప్రాధ్యానమే. రాజస్థాన్ వైద్యులు తాజాగా అరుదైన అవయవ మార్పిడి సర్జరీ చేసి విజయవంతమయ్యారు.

72ఏళ్ల వృద్ధుడికి పురుషాంగ(Penis)  మార్పిడిని వైద్యులు విజయవంతంగా పూర్తి చేశారు. రాజస్థాన్‌లో ఇది తొలి ట్రాన్స్‌ప్లాంటేషన్ అని సర్జరీ చేసిన వైద్యులు వెల్లడించారు.

రాజస్థాన్‌లోని జైపుర్‌ పరిధిలోని బుండికి చెందిన  వృద్ధుడి అంగానికి క్యాన్సర్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అంగాన్ని తీసేసి.. కొత్త అవయవాన్ని సెట్ చేయాలని వైద్యులు సూచించారు.

రాజస్థాన్‌లో

అవయవ మార్పిడికి పేషంట్ ఎంతకూ ఒప్పుకోలేదు. కానీ, వైద్యులే వృద్ధుడికి నచ్చజెప్పి ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు ఒప్పించారు. సర్జరీలో సక్సెస్ అయ్యారు.

వైద్యులే ఒప్పించి..

జైపుర్‌లోని భగవాన్ మహావీర్ క్యాన్సర్ హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్(BMCHRC) వైద్యులు  ఈ ఆపరేషన్‌కి సిద్ధమయ్యారు. ఐదుగురు డాక్టర్లు సహా 11 మంది సిబ్బంది ఇందులో పాల్గొన్నారు.

11 మంది బృందంతో..

ముందుగా క్యాన్సర్ సోకిన అంగాన్ని పూర్తిగా తొలగించారు. అనంతరం, సింథటిక్ రకమైన అంగాన్ని అమర్చారు.

ఇలా సెట్ చేశారు..

పేషంట్ చేతి చర్మం, రక్తనాళాలు, నరాలను ఉపయోగించి వైద్యులు కొత్త అంగాన్ని సిద్ధం చేశారు. ఆకారం, పొడవు, యురెత్రా తదితర భాగాలన్నీ సక్రమంగానే ఉన్నట్లు నిర్ధారించుకున్నారు.

మైక్రో సర్జికల్ టెక్నిక్స్‌ని ఉపయోగించి ఈ సర్జరీ చేసినట్లు భగవాన్ మహావీర్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఇది ఎంతో కష్టతరమైన ప్రక్రియ అని వైద్యులు చెప్పారు.

మైక్రో సర్జికల్ టెక్నిక్‌తో..

దాదాపు 8 గంటల పాటు శ్రమించి ఈ అంగాన్ని శరీరానికి వైద్యులు విజయవంతంగా అతికించగలిగారు. సర్జరీ పూర్తయ్యాక రక్త ప్రసరణ సాఫీగా జరిగింది.

సర్జరీ సక్సెస్..

అసలైన అంగం మాదిరే పనిచేయడం ప్రారంభించిందని వైద్యులు వెల్లడించారు. త్వరలోనే పేషంట్ పూర్తిగా కోలుకుంటాడని వైద్యులు తెలిపారు. మునపటి జీవితాన్ని ఆస్వాదించగలడని వారు చెప్పారు.

తేడా లేకుండా..

సాధారణంగా పురుషులకు సోకే క్యాన్సర్‌లలో 4శాతం  ఇలా జననాంగాలకు సోకుతాయి. వారిలో సగం మంది బాధితులకు అంగాన్ని తొలగించాల్సిన  పరిస్థితి వస్తుందని వైద్యులు వెల్లడించారు.

2శాతం మందికి ఇలా..

బెంగుళూరులో ఈ తరహా ఆపరేషన్ ఒకటి జరిగింది. యాక్సిడెంట్‌లో 12ఏళ్ల బాలుడు తన జననేంద్రియాలను కోల్పోయాడు. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి పునర్ వ్యవస్థీకరించారు.

బెంగుళూరులో..

మరిన్ని కథనాల కోసం  మా వెబ్‌సైట్‌ చూడండి.  YouSay యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోండి.