ఇతర దేశాల్లో  అత్యున్నత పదవుల్లోఉన్న భారత సంతతి

బ్రిటన్ ప్రధానమంత్రిగా తొలిసారి భారత సంతతికి చెందిన రిషిసునాక్ ఎన్నికయ్యారు. సునాక్‌ మాదిరిగా మిగతా దేశాల్లోనూ భారత మూలాలున్న ఉన్నత పదవుల్లో ఉన్న మరికొందరు.

రిషి సునాక్ : బ్రిటన్ ప్రధానమంత్రి

భారత్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన దంపతులకు కమలా హ్యారీస్‌ జన్మించారు. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ మూలాలు తమిళనాడులో ఉన్నాయి. హ్యరీస్‌ తండ్రి బ్రిటీష్ జమైకాకు చెందినవారు.

కమలా హ్యారిస్ :  అమెరికా ఉపాధ్యక్షురాలు

పోర్చుగల్‌ ప్రస్తుత 119వ ప్రధాని కోస్టా. కోస్టా సగం పోర్చుగీస్‌తోనూ సగం ఇండియాతో మూలాలు కలిగి ఉన్నారు. ఆయన తండ్రి గోవా కుటుంబానికి చెందిన దంపతులకు మోజాంబీక్‌లోని మాపుటోలో జన్మించారు. ఆంటోనియో గోవాతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటుంటారు.

ఆంటోనియో కోస్టా : పోర్చుగల్ ప్రధాని

మారిషస్ ప్రధాని ప్రవింద్  జౌగ్నౌత్‌ హిందు కుటుంబంలో పుట్టారు. ప్రవింద్ తండ్రి అనిరుధ్ జౌగ్నౌత్, తల్లి సరోజినీ భల్లా భారత సంతంతికి చెందినవారు.

ప్రవింద్  జుగ్నాత్ : మారిషస్ ప్రధాని

కరేబియన్‌ ద్వీపానికి చెందిన గుయానా అధ్యక్షుడు మహమ్మద్ ఇర్ఫాన్ అలీ భారత్ నుంచి వలస వెళ్లారు. ఆయన 2020 సాధారణ ఎన్నికల్లో గుయానా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

మహమ్మద్‌ ఇర్ఫాన్‌ అలీ : గుయానా అధ్యక్షుడు

పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ను ప్రదీప్‌ సింగ్‌ రూపున్‌గా కూడా పిలుస్తారు. ఆయన మారిషస్‌ 7వ అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు. రూపున్ భారత్‌లోని ఆర్యసమాజ్‌ హిందూ కుటుంబంలో జన్మించారు.

పృథ్వీరాజ్‌సింగ్‌ రూపున్‌ :  మారిషస్ అధ్యక్షుడు

చాన్‌ సంతోకి సూరినామ్‌ 9వ అధ్యక్షుడు.  ఇండో-సురినామీకి చెందిన హిందూ కుటుంబంలో సంతోకి జన్మించారు

చాన్‌ సంతోకి :సూరినామ్‌ అధ్యక్షుడు